By: RAMA | Updated at : 31 Dec 2022 06:17 AM (IST)
Edited By: RamaLakshmibai
Horoscope Today 31st December 2022 (Image Credit: freepik)
Horoscope Today 29th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. వ్యాపారంలో మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు శ్రద్ధగా పనిచేస్తారు. ఈ రోజు ఓ కొత్త పనిని ప్రారంభిస్తారు.
వృషభ రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగులకు పురోగతి ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంతో సంబంధం ఉన్నవారికి శుభసమయం
మిథున రాశి
తొందరపడి ఏ పని చేయకండి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో గందరగోళం ఉంటుంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు
కర్కాటక రాశి
ఈ రోజు మీరు మీ కుటుంబానికి మంచి సమయాన్ని ఇస్తారు. ఇంటి ఖర్చులపై కూడా శ్రద్ధ వహిస్తారు. కొన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారు.
Also Read: కొత్తఏడాది ఈ రాశివారి జీవితంలో పెనుమార్పులు తీసుకు రాబోతోంది, 2023 మకర రాశి వార్షిక ఫలితాలు
సింహ రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఆలోచనలు అలు చేయడానికి సమయం పడుతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఎవరి మీదా ఆధారపడకుండా పని చేసుకుపోవడమే మంచిది
కన్యా రాశి
ఈ రాశివారి వ్యాపారం మెరుగుపడుతుంది. దిగువ స్థాయి ఉద్యోగుల నుంచి మీరు మద్దతు పొందుతారు. ప్రత్యేక వ్యక్తులను కలుస్తారు. కొంతకాలం రెగ్యులర్ వర్క్ నుంచి బయటపడతారు. సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి.
తులా రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. అనుకున్న పనిని మంచి మార్గంలో చేసేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి
వృశ్చిక రాశి
ఈ రాశివారికి ఈ రోజు శుభదినం. ఆఫీసులోని సహోద్యోగి నుంచి మీరు సహాయం పొందుతారు. పనిచేసే ప్రదేశంలో పురోగతి ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది.
ధనుస్సు రాశి
రోజువారీ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. తెలివైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కొన్ని కష్టమైన పనులు కూడా సక్సెస్ అవుతాయి. ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది
Also Read: 7 నెలలు రకరకాల ఇబ్బందులు, 5 నెలలు ఆర్థిక ప్రయోజనాలు, 2023లో ధనస్సు రాశి వార్షిక ఫలితాలు
మకర రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
కుంభ రాశి
ఈ రోజు మీరు అంత్యత సంతోషంగా ఉంటారు. వ్యాపారాలు బాగా సాగుతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులు, గతంలో పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం అందుకుంటారు
మీన రాశి
వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోపోవడమే మంచిది. ప్రేమికులకు మంచి రోజు. ఈ రోజు మీరు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు
Magha Pournami 2023: మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత ఏంటి - ఆ రోజు సముద్రం స్నానం ఎందుకు చేయాలి!
Love Horoscope Today 31st January 2023: పాతస్నేహం వల్ల ఈ రాశివారి జీవితంపై ఒత్తిడి పెరుగుతుంది జాగ్రత్త
Horoscope Today 31st January 2023: ఈ రాశివారు సవాళ్లను కూడా అనుకూలంగా మలుచుకుంటారు, జనవరి 31 రాశిఫలాలు
Horoscope Today 30th January 2023: రాబోయే రోజుల్లో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది, జనవరి 30 రాశిఫలాలు
Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి