News
News
వీడియోలు ఆటలు
X

ఏప్రిల్ 30 రాశిఫలాలు, ఈ రాశివారు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తే మంచి అవకాశం కోల్పోతారు!

Rasi Phalalu Today 30th April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

ఏప్రిల్ 30 రాశిఫలాలు

మేష రాశి
ఈ రాశివారికి  కార్యాలయంలో సహోద్యోగులు, సీనియర్ల నుంచి సహాయం అందుతుంది. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తిచేయగలుగుతారు. వ్యాపారులు ప్రణాళిక ప్రకారం అడుగేస్తే విజయం సాధిస్తారు. విద్యార్థులు  రాబోయే పరీక్షలకు ఓపికతో సన్నద్ధం కావాలి. మీ ప్రయత్నాలతో ఇంట్లో ఆనందం నింపేందుకు ప్రయత్నించండి. పొట్టకు సంబంధించిన ఇబ్బంది ఉండొచ్చు. 

వృషభ రాశి
ఈ రాశి ఉద్యోగులు ఆఫీసులో పని చేస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాలకు సహోద్యోగులపై కోపగించుకోవడం మానుకోవాలి. వ్యాపారం చాలా కాలంగా మాంద్యంలో ఉంటుంది...కొంత ఓపికగా వ్యవహరిస్తే త్వరలోనే మంచి రోజులు వస్తాయి. ప్రేమ వ్యవహారంలో నిమగ్నమైన వ్యక్తులు తమ సంబంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ఒక ఆలోచన చేస్తారు. ప్రమాదకర పనులు చేయవద్దు. స్నేహితులను కలుస్తారు.

మిథున రాశి
వ్యాపారులు తమ ఖాతాదారులకు, కస్టమర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యాపార పురోగతి వినియోగదారులపై ఆధారపడి ఉంటుందని గుర్తించాలి. విద్యార్థులు తమ కెరీర్ గురించి సందేహంగా ఉంటారు...ఇలాంటి పరిస్థితిలో మీ గురువు లేదా పరిజ్ఞానం ఉన్న వ్యక్తితో మాట్లాడండి. కుటుంబ సభ్యులతో కలిసి, మీరు మతపరమైన యాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు కొన్ని బాధల నుంచి ఉపశమనం పొందుతారు.

Also Read: వాస్తు ప్రకారం ఈ మూలలు పెరిగిన స్థలాలు అస్సలు కొనకూడదు

కర్కాటక రాశి
ఈ రాశివారు కార్యాలయంలోని పనుల గురించి సుఖంగా ఉంటారు..మీ అంకిత భావం పెరుగుతుంది. వ్యాపారులకు ఈరోజు లాభాలొస్తాయి. విద్యార్ధులు చదువుతో పాటు వారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. పిల్లల విషయంలో జీవిత భాగస్వామితో వాదించకండి.  పనితో పాటు విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. పని భారం మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.

సింహ రాశి
ఈ రాశివారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు..రోజంతా సంతోషంగా ఉంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.లక్ష్యసాధనలో విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో మీకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండనివ్వవద్దు. మీ ఆలోచనలకు శ్రేష్ఠతను తీసుకురండి. వివాదాలకు దూరంగా ఉండాలి. కంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

కన్యా రాశి 
ఈ రాశివారు ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. పనిచేసే ప్రదేశంలో మీ బాస్ మాటలను సీరియస్ గా ఫాలో అవడం మీకే మంచిది.  ఆఫీసులో జరిగే రాజకీయాలకు దూరంగా ఉండండి. ఏదో ఒక విషయంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త. భాగస్వామ్య వ్యాపారం వృద్ధి చెందాలంటే కొన్ని ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఆటగాళ్లు సీనియర్ల సలహాలు తీసుకోవడం మంచిది. తండ్రి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. సంపాదన తగ్గే అవకాశం ఉంది.
 
తులా రాశి
ఈ రాశివారికి నైతికత ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పని సమయం కన్నా ముందే పూర్తవుతుంది. వ్యాపారుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మనస్సు సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు కళను మెరుగుపరచుకోవడంపైనే దృష్టి సారించాలి. ఒకరితో స్నేహం మీ కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, అందరి అభిప్రాయం, సమ్మతి తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్లాన్ చేయండి.

వృశ్చిక రాశి 
ఈ రాశివారు కష్టానికి తగిన ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్ , పదోన్నతి పొందే అవకాశం ఉంది. హోటల్, బార్, ఆహారం, రోజువారీ అవసరాలు మరియు రెస్టారెంట్ల వ్యాపారవేత్తలు ప్రయోజనం పొందుతారు. కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు రావొచ్చు.  కొత్త తరంలో ఏదైనా పని నిలిచిపోయినట్లయితే..స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి విషయంలో కుటుంబ సభ్యులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది.

Also Read: శని ఉందని ఎలా తెలుస్తుంది, చీమలకుఆహారం వేస్తే శని బాధల నుంచి ఎందుకు విముక్తి కలుగుతుంది

ధనుస్సు రాశి 
ఈ రాశివారి హోదా పెరుగుతుంది. పనుల్లో మీ నిర్వహణ చాలా బాగుంటుంది. మీ పనులతో పాటు ఇతరుల పనులను చక్కగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులు వ్యాపారాన్ని పెంచుకోవడానికి తమ కష్టార్జితాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. వ్యాపారం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. విద్యార్థులు తమ ఇబ్బందులను స్నేహితులతో పంచుకోవడం మంచిది. మీ జీవిత భాగస్వామితో సామరస్యంగా నడుచుకోవాలి.

మకర రాశి
ఈ రాశివారు రహస్య దానాలు చేస్తారు. కెరీర్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించవద్దు. ఆలోచించకపోతే అవకాశాలు చేజారిపోయే ప్రమాదం ఉంది. నష్టాల్లో ఉన్న వ్యాపారాన్ని మూసేయడం మంచిది. మీ సౌమ్య ప్రవర్తన ఇతరుల హృదయాల్లో మీ స్థానాన్ని ఏర్పరుస్తుంది. ప్రయాణం విజయవంతమవుతుంది. పిల్లలతో సంతోష సమయం గడుపుతారు.

కుంభ రాశి 
ఈ రాశి వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులు సీనియర్ల నంచి ముఖ్యమైన సలహాలు అందుకుంటారు. వ్యాపారులు ఎలాంటి ప్రభుత్వ పన్ను బకాయిలను ఉంచుకోకూడదు, లేకుంటే జరిమానా విధించవచ్చు. యువతకు దేవుడిపై నమ్మకం, విశ్వాసం ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి

మీన రాశి
ఈ రాశివారికి రుణవిముక్తి కలుగుతుంది. కార్యాలయంలో ఉద్యోగులు పనిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలి. పనిలో నాణ్యత తగ్గకుండా చూసుకోవాలి  భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి ఈ రోజు బాగుంటుంది.  అవివాహిత వ్యక్తులకు వివాహం నిశ్చయమవుతుంది. సౌమ్య ప్రవర్తన కలిగి ఉంటే మంచిది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

Published at : 30 Apr 2023 05:36 AM (IST) Tags: Astrology rasi phalalu Horoscope Today Aaj Ka Rashifal Today Rasiphalalu astrological prediction today Horoscope for 30th April 30th April Astrology

సంబంధిత కథనాలు

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి  ఎప్పుడొచ్చింది,  ప్రత్యేకత ఏంటి!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !