By: RAMA | Updated at : 02 Dec 2022 05:19 AM (IST)
Edited By: RamaLakshmibai
Horoscope Today 2nd December 2022 (Image Credit: freepik)
Horoscope Today 2nd December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
మీరు ఈ రోజు ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయండి. ఆధ్యాత్మిక వ్యవహారాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీకు సరైన ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. స్నేహితులతో సమయం గడుపుతారు. చెడు సహవాసాన్ని వదిలివేయండి లేకపోతే నష్టపోతారు.
వృషభ రాశి
కార్యాలయంలో మిమ్మల్ని ఇష్టపడని వ్యక్తులు కూడా మీ పనితీరుని అభినందిస్తారు. అనుకున్న పనులు పూర్తవ్వాలంటే వేరేవారి సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని అడగకుండా అభిప్రాయం అస్సలు చెప్పొద్దు
మిథున రాశి
మీకు నిరంతరం టెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. నడకే మీకు మంచి పరిష్కారం. మీ ప్రియమైన వారికి మీరు చాలా అవసరం. సరదాగా ఖర్చు చేస్తారు. కన్నవారి ప్రవర్తనలో మార్పు రావడంతో మీరు ఆందోళన చెందుతారు
Also Read: ఈ రాశివారు దుష్టుల సహవాసానికి దూరంగా ఉండాలి, డిసెంబరు నెల రాశిఫలాలు
కర్కాటకం
ఎలాంటి కారణం లేకుండా వివాదంలో చిక్కుకుంటారు. మీ ఆలోచనా ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పురోగతికి ఆటంకం ఏర్పడుతుంది. కొన్ని శుభవార్తలు వినగలరు. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
సింహ రాశి
మీరు ఉద్యోగాన్ని మార్చాలని నిర్ణయించుకుంటే ఇదే మంచి సమయం. ఎవరి సిఫార్సుతోనైనా నూతన ఉద్యోగంలో చేరుతారు. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఎవరైనా తప్పుదోవ పట్టించడం వల్ల సంబంధాలు బలహీనపడతాయి. సంతానానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు
కన్యా రాశి
రోజు ప్రారంభంలో మనసు విచారంగా ఉంటుంది. ఓ విషయాన్ని అర్థం చేసుకోవాలనే కుతూహులం ఉంటుంది. మీ కింది వారు చేసిన పనిని మెచ్చుకోండి. ఆర్థిక ప్రయోజనాలుంటాయి.
తులా రాశి
వివాదాస్పద విషయాలలో విజయం ఉంటుంది. కొన్ని విషయాల్లో కొత్తదనం కోరుకుంటారు. విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. జీవితానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఈరోజు ప్రస్తావనకు రావచ్చు. ఉద్యోగంలో ఉత్సాహం లోపిస్తుంది.
వృశ్చిక రాశి
విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.మీ పని పట్ల నిజాయితీగా ఉండండి. కోరుకున్న సమాధానం రాకపోవడంతో నిరాశ చెందుతారు.
ధనుస్సు రాశి
ప్రతికూల ఆలోచనలతో నిరాశ చెందుతారు. మీరు మీపై నియంత్రణ కోల్పోతారు. మిత్రులతో విభేదాలు రావొచ్చు. కార్యాలయంలో కొంత నష్టపోతారు. అనుకూలమైన శక్తిని బలోపేతం చేయండి..పాజిటివ్ ఆలోచనలు పెంచుకోండి.
Also Read: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది, మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు
మకర రాశి
మీరు మీ వృత్తి పట్ల సంతోషంగా లేరు..అయితే కొంత ఓపిక పట్టండి. కాలక్రమేణా పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. జీవిత భాగస్వామి ప్రవర్తన మనోధైర్యాన్ని పెంచుతుంది. రుణం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
కుంభ రాశి
ఆర్థిక లావాదేవీలు జరుపుతారు. ఆహారం, పానీయాలపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం క్షీణించవచ్చు. పేదలకు సహాయం చేయండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. రాజకీయనాయకులకు మంచి రోజు
మీన రాశి
ఈ రోజు మీరు ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. విద్యార్థులు ఫలితాల గురించి ఆందోళన చెందుతారు. అతిథులు ఇంటికి రావొచ్చు. భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. డబ్బు సంపాదించాలనే తపనతో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి.
Horoscope Today 30th January 2023: రాబోయే రోజుల్లో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది, జనవరి 30 రాశిఫలాలు
Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!
Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!
Srimad Bhagavatam:పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!
Weekly Horoscope 30 January to 5 February 2023: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు
కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ
Peerzadiguda: అర్ధరాత్రి పేకాటరాయుళ్ల హంగామా, మీడియాపై దాడి! తలుపులు మూసేసి, కరెంటు తీసేసి రచ్చ
Hindenburg on Adani: జాతీయవాదం పేరు చెప్పి మోసాల్ని కప్పి పుచ్చలేరు, అదానీకి హిండన్ బర్గ్ స్ట్రాంగ్ కౌంటర్
Pathaan movie: అమెరికాలో ‘పఠాన్’ జోరు, థియేటర్లో ఆ నోటీస్ చూసి ఫ్యాన్స్ షాక్ - బాలయ్య ఎఫెక్టేనా?