మే 29 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు
Rasi Phalalu Today 29th May: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మే 29 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు తొందరపడి ఏ పనీ చేయకండి. ఉద్యోగులు కార్యాలయంలో మంచి పనితీరును కనబరుస్తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. అధికారుల నుంచి పూర్తి సహకారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్నేహితునితో వివాదాలు రావచ్చు. మానసిక గందరగోళం ఏర్పడవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
వృషభ రాశి
మీరు ఈ రోజు మంచి విజయాన్ని పొందవచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు బలంగా ఉంటాయి. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. బ్రహ్మచారులకు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.
మిధునరాశి
మీకు ధనలాభం సంకేతాలు ఉన్నాయి. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. వైద్య విద్యను అభ్యసించే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోపాన్ని నియంత్రించుకోండి.
కర్కాటక రాశి
ఈ రోజు మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఉద్యోగస్తులకు ఈరోజు మంచి రోజు కానుంది. స్నేహితుల సహకారంతో ఆర్థికంగా లాభపడే అవకాశాలున్నాయి. కుటుంబంతో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. చాలాకాలం నుంచి నిలిచిపోయిన పనులను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మీ కుటుంబం ఆనందాన్ని పొందుతారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
Alo Read: జూన్ మొదటివారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!
సింహ రాశి
ఈ రోజు ఈ రాశివారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఏదైనా పెద్ద ఒప్పందం కుదుర్చుకునేముందు సన్నిహితుల సలహాలు తీసుకోవడం మంచిది. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు వస్తాయి. మితిమీరిన బిజీ కారణంగా మీ ప్రవర్తనలో చిరాకు ఉంటుంది.పిల్లల పురోగతితో మీరు సంతోషిస్తారు. అసమతుల్య ఆహారం మానుకోండి.
కన్యా రాశి
ఈ రోజు మీరు మీ సీనియర్ల మార్గదర్శకత్వంలో అద్భుతమైన అవకాశాలు పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఏదైనా పెట్టుబడిని ఆలోచనాత్మకంగా చేయండి. కుటుంబ జీవితంలో ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి అనుభవజ్ఞుల సలహా తీసుకుంటారు. వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు.
తులా రాశి
ఈరోజు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. మీరు కార్యాలయంలో మీ సహోద్యోగులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. స్నేహితుల సహాయంతో మీ ముఖ్యమైన పనులు కొన్ని పూర్తవుతాయి. ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యల వల్ల ఇబ్బంది పడవచ్చు. వైవాహిక జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి.
వృశ్చిక రాశి
మీ పని తీరులో సానుకూల మార్పు ఉంటుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఆధ్యాత్మిక పనులకు ఖర్చులు చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. వ్యాయామం చేయండి. కోపాన్ని అదుపుచేసుకోండి. చురుగ్గా వ్యవహరించండి. తప్పుడు పనుల్లో సమయాన్ని వృథా చేయకండి.
Also Read: మీ అరచేతిలో పంచభూతాలున్నాయని మీకు తెలుసా!
ధనుస్సు రాశి
ఈరోజు మీరు కష్టపడి పనిచేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. పురోగతికి కొత్త అవకాశాలు ఉంటాయి. కొన్ని పనులకు డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది. మీ మొరటు ప్రవర్తనను నివారించండి. దగ్గరి బంధువుతో మీ సంబంధం మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది.
మకర రాశి
ఈ రోజు సీనియర్లను మెప్పించగలుగుతారు. మీ స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. సంతానం గురించిన మీ చింత దూరమవుతుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుక్కోవాలనే పట్టుదలతో ఉంటాడు. ఇంటికి బంధువుల రాక కారణంగా కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. కుటుంబ సమస్యలను సహనంతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.
కుంభ రాశి
ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. జీతం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ వనరులను పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో సమన్వయం ఉంటుంది. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. ప్రవర్తనలో మార్పులు తీసుకురండి. ఆరోగ్యంలో సమస్యలు రావచ్చు.
మీన రాశి
ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగం మారే ఆలోచన చేయవచ్చు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ వాతావరణంలో ఆనందం, శాంతి ఉంటుంది. మంచి ఆలోచనతో అందరినీ ఏకం చేయగలుగుతారు. ఎవరితోనూ కోపంగా మాట్లాడకండి.