Horoscope Today 29th june 2024: ఈ రాశులవారు ప్రతికూల వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండాలి - 2024 జూన్ 29 రాశిఫలాలు!
Horoscope Prediction 29th june 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope Predictions in Telugu
మేష రాశి
ఈ రోజు మనసంతా బాధగా ఉంటుంది. మీరు చేయని పనికి బాధ్యులుకావాల్సి రావొచ్చు. ఉద్యోగులు పనివిషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రతికూల వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండండి. వ్యాపారులు తమ పనిని విస్తరించుకునే అవకాశాలను పొందుతారు.
వృషభ రాశి
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబంతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ప్రణాళిక ప్రకారం అనుకున్నపనులన్నీ పూర్తిచేస్తారు. ఆరోగ్యం బావుంటుంది.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశివారికి అనుకూల పరిస్థితులన్నాయి. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. మీ ప్రవర్తన చాలా సంయమనంతో ఉంటుంది..అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంటుంది. మీ అభిప్రాయాలను సమర్థవంతంగా ప్రదర్శిస్తారు. ఇంటర్యూలకు హాజరయ్యేవారు మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: బోనాలు, రథయాత్ర, తొలి ఏకాదశి, గురుపూర్ణిమ సహా జూలై నెలలో ఎన్ని పండుగలో!
కర్కాటక రాశి
కష్టానికి తగిన ఫలితాలు రాకపోవడంతో ఈ రాశివారు బాధపడతారు. కుటుంబ సభ్యులతో శత్రుత్వం కానీ ఇంకేమైనా విభేదాలున్నా ఈ రోజు తొలగిపోతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే మీ బాధ్యతలను విస్మరించకండి.
సింహ రాశి
ఈ రోజు వ్యాపార ఒప్పందాలకు దూరంగా ఉండడం మంచిది లేదంటే నష్టపోకతప్పదు. వ్యక్తిగత సంబంధాలలో వివాదాలకు అవకాశం ఉంది..అది కూడా మీ అహంకారం కారణంగా. అనవసర విషయాలపై శ్రద్ధ తగ్గించండి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్తగా ఉండండి.
కన్యా రాశి
ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందుతారు. వ్యాపారంలో మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన ఒప్పందాలకు ఈ రోజు అనుకూలం.
Also Read: యక్షిణిలు ఎవరు ? భూమ్మీద ఉన్నారా - యక్షిణి సాధన ఎందుకు చేస్తారు..ఎవరు చేస్తారు!
తులా రాశి
ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో అనుకోని ఇబ్బందులు ఎదుర్కొంటారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. న్యాయపరమైన అడ్డంకులను తొలగించుకునేందుకు ప్రయత్నించాలి. నిరుద్యోగులు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. ఇతరుల విషయాలలో అతిగా జోక్యం చేసుకోవడం సరికాదు
వృశ్చిక రాశి
శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. ప్రేమసంబంధాలు బావుంటాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. మీ బాధ్యతల నుంచి దూరంగా పారిపోవద్దు. ఉద్యోగులకు సాధారణ ఫలితాలున్నాయి. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకండి.
ధనుస్సు రాశి
ఈ రోజు మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. ఇంట్లో అవివాహితులు వివాహం గురించి చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మకర రాశి
ఈ రోజు అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు చదువు విషయంలో చాలా సీరియస్‌గా ఉంటారు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామికి కొన్ని బహుమతులు ఇస్తారు. వ్యాపారంలో అనుకున్నదానికంటే ఎక్కువ డబ్బు వస్తుంది.
కుంభ రాశి
ఈ రోజు పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. కళారంగంలో అనుబంధం ఉన్న వ్యక్తులు మంచి అవకాశాలు పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
Also Read: ఈ రాశులవారు ఒంటరితనాన్ని సౌకర్యవంతంగా ఫీలవుతారు..ఇందులో మీరున్నారా!
మీన రాశి
ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. దూర ప్రాంత ప్రయాణానికి ప్రణాళికలు వేసుకుంటారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు నష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. నూతన ఆస్తిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం...
గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.