ఏప్రిల్ 29 రాశిఫలాలు, ఈ రాశివారు లాభాలకోసం తాపత్రయపడి ఉచ్చులో చిక్కుకోవద్దు
Rasi Phalalu Today 29th April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
ఏప్రిల్ 29 రాశిఫలాలు
మేష రాశి
ఈ రాశివారు ఈరోజు ఎక్కువ సమయం సామాజిక కార్యక్రమాలలో గడుపుతారు. ఏదైనా ముఖ్యమైన సమాచారం వింటారు. పరిజ్ఞానం ఉన్న వ్యక్తుల సలహాలు పాటించండి. మనస్సును స్థిరంగా ఉంచుకోండి. మీ ప్రవర్తనలో మార్పు తీసుకురావడం చాలా అవసరం. ప్రమాదకరమైన పనులు చేయొద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కోపం ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశం వస్తుంది. వ్యాపారంలో అధిక పోటీ పెట్టుకోవద్దు.
వృషభ రాశి
పెట్టుబడి పెట్టిన డబ్బువల్ల ప్రయోజనం పొందడంలో కొంత జాప్యం ఉంటుంది. పిల్లలకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడంలో కొంత సందిగ్ధత ఉంటుంది. ఈరోజు కుటుంబానికి సంబంధించిన ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. ఇంటి మరమ్మతులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు రూపొందిస్తారు. స్నేహితులతో సమయం గడుపుతారు. మాట్లాడేటప్పుడు దూషించే పదాలు ఉపయోగించవద్దు. మిమ్మల్ని మీరు విశ్వసించండి.
మిథున రాశి
ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. అనుకున్న పనులు పూర్తవ్వాలంటే కష్టపడాల్సి ఉంటుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్నపనులన్నీ పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు ఇబ్బందిపెడతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులకు పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. తప్పనిసరి అయితే కానీ ప్రయాణం చేయకపోవడమే మంచిది. తక్కువసమయంలో ఎక్కువ లాభపడాలనే ఉద్దేశంతో ఉచ్చులో చిక్కుకోవద్దు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు ప్రారంభమవుతాయి. తొందరపాటు హానికరం.
Also Read: మీ బెడ్ రూమ్ లో అద్దం ఎటువైపు ఉంది, మంచం ఏ దిక్కున గోడకు వేశారు!
కర్కాటక రాశి
ఈ రోజు విశేష పురోభివృద్ధి యోగాల వల్ల మనసులో సంతోషం ఉంటుంది. మనస్సును భక్తిలో నిమగ్నం చేసేందుకు ప్రయత్నిస్తారు. కార్యాలయంలో అనుకూలమైన ఫలితాల కోసం క్రియాశీలత అవసరం. ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాలలో గడుపుతారు. భవిష్యత్తు ప్రణాళికల్లో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన సమయం. పిల్లల కార్యకలాపాలను పర్యవేక్షించండి. కాలానికి అనుగుణంగా ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉండదు.
సింహ రాశి
ఈ రోజు సామాజిక కార్యకలాపాలు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఆస్తి లావాదేవీలకు సంబంధించిన పనులు విజయవంతమవుతాయి. మీలో ఏదైనా ప్రత్యేక నైపుణ్యం వెలుగుచూస్తుంది. అనవసర విషయాలకు ఖర్చు చేయవద్దు. పెద్దల సలహాలు, సూచనలు పాటించండి. వ్యాపారానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఇదే మంచి సమయం. ఏప్పటి నుంచో ఆగిపోయిన పనిలో విజయం సాధిస్తారు. ఒకరి పట్ల ఆకర్షితులవుతారు.
కన్యా రాశి
ఈ రోజు పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మీరు కార్యాలయంలో గౌరవం పొందుతారు. వ్యాపారంలో పెరుగుదల కారణంగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతాయి. ఏదైనా వివాదాలు ఉంటే అవి ఈ రోజు పరిష్కారం అవుతాయి. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మీరు కుటుంబానికి సమయం కేటాయిస్తారు. కొన్నిసార్లు అజాగ్రత్త కారణంగా మీరు కొన్ని పనులను వాయిదా వేయవలసి ఉంటుంది. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది.
తులా రాశి
ఈ రోజు మీరు ఆసక్తికర పనుల్లో ఎక్కువ సమయం గడుపుతారు. మీరు మానసిక ప్రశాంతత పొందుతారు. మీ పనిని ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణతో చేయండి. వైవాహిక జీవితంలో సమస్యల కారణంగా ఒత్తిడికి లోనవుతారు. డబ్బు విషయంలో వెంటనే ఎవరినీ నమ్మవద్దు. సమయానికి అవసరమైన పత్రాలను జాగ్రత్తగా చూసుకోండి. స్థిరాస్థి కొనడానికి తొందరపడకండి. కుటుంబ సమస్య పరిష్కారమవుతుంది. వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉంటారు.
వృశ్చిక రాశి
ఈ రోజు ఆధ్యాత్మిక పనుల్లో సంతోషంగా గడుపుతారు. కొత్త ఒప్పందాల వల్ల మీ లాభాలు పెరుగుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.ఈ రోజు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. నిర్మాణ సంబంధిత పనులు నిలిచిపోవచ్చు. కెరీర్ ప్లాన్ చేసుకోవడానికి ఇది సరైన సమయం. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచిసమయం.
ధనుస్సు రాశి
ఈ రోజు కొన్ని ముఖ్యమైన వార్తలు వినే అవకాశం ఉంది. ఆన్‌లైన్ కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. ఎప్పటి నుంచో కొనసాగుతున్న పాత సమస్యకు పరిష్కారం లభించడం ద్వారా మీరు ఉపశమనం పొందుతారు. మీ ప్రణాళికలు బయట పెట్టడం వల్ల మీరు నష్టపోతారు. మాటలు అదుపు చేసుకోవాలి..వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. సమయం అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. కుటుంబ బాధ్యతలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!
మకర రాశి
ఈ రోజు జీవితాన్ని సానుకూలంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మంచి విజయాన్ని అందుకుంటారు. ఆత్మపరిశీలన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ నిర్ణయాలు మీరు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తెలియని వ్యక్తులను నమ్మొద్దు. కార్యాలయంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. చురుకుగా ఉండటం వల్ల అనుబంధం మరియు పరిచయాల ప్రాంతం పెరుగుతుంది.
కుంభ రాశి
ఈ రాశిలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ఆర్థిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మేలు. కుటుంబంలో , కార్యాలయంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. మీ ఆలోచనలలో ఓర్పు స్థిరత్వాన్ని కొనసాగించండి.ఆర్థిక లావాదేవీలు జరపకపోవడం మంచిది. ఉద్యోగం, వ్యాపారంలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
మీన రాశి
ఈ రోజు మీరు కష్టమైన పనిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. కొత్త శక్తి నిండిఉంటుంది. కుటుంబ వివాదాలను పరిష్కరించడం వల్ల ఇంట్లో ఆనందం ఉంటుంది. అనుమానపు ధోరణికి దూరంగా ఉండండి. సన్నిహిత స్నేహితుడి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ఎక్కువ అప్పు తీసుకోకండి. ఈ సమయంలో పిల్లలకు సరైన మార్గదర్శకత్వం కూడా అవసరం. వాహన సుఖం పొందుతారు.వ్యాపారంలో కొనసాగుతున్న చిక్కుల వల్ల ఇబ్బంది పడతారు. స్నేహితులను కలుస్తారు.