ఈ రాశులవారి కుటుంబాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి, అక్టోబరు 28 రాశిఫలాలు
Horoscope Today 28th October: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 28th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
మెరుగైన పురోగతి కోసం మీ ప్రవర్తన, పద్దతిని మార్చుకోండి. ఒక సమయంలో ఒక పని మాత్రమే చేయడం ఉత్తమం. పది పనుల్లో వేలుపెట్టి మొదటికే మోసపోవద్దు. విద్యుత్ పరికరాలు కొన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
వృషభ రాశి
ఈ రాశివారికి గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. రోజూకన్నా ఈ రోజు మీ పని జోరందుకుంటుంది. రోజంతా ఆనందంగా ఉంటారు. ప్రేమ వ్యవహారాలలో విజయం సాధించే అవకాశం ఉంది. తలపెట్టిన పనులకు కుటుంబ సహకారం లభిస్తుంది. అవసరమైన పనిని సమయానికి పూర్తి చేయండి..పోస్ట్ పోన్ చేయొద్దు
మిథున రాశి
మీ సక్సెస్ వెనుక మీ కృషితో పాటూ ఎంతోమంది ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చుచేస్తారు. కుటుంబంలో కొన్ని సంఘటనల ద్వారా దూరాలు తొలగిపోతాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు పని ఒత్తిడి ఉన్నప్పటికీ టార్గెట్లు పూర్తిచేస్తారు
Also Read: కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే జ్వాలా తోరణం కిందనుంచి ఎందుకు దాటితే ఏమవుతుంది!
కర్కాటక రాశి
తలపెట్టిన పనుల్లో చట్టపరమైన అడ్డంకులు ఉండొచ్చు. ఏదో విషయంలో మీరు అశాంతిగా ఉంటారు. చమురు వ్యాపారులు ఈరోజు ఎక్కువ లాభాలను ఆర్జించగలరు. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇదో మంచి అవకాశం. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు ముందడుగు వేయొచ్చు.
సింహ రాశి
మీ తప్పులను సకాలంలో సరిదిద్దుకోవడంతో మీ జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. చాలా రోజులుగా ఉన్న సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టినవారవుతారు. ఈ రోజుమీరు ప్రభావవమంతమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది.
కన్యా రాశి
ఈ రాశివారు అనవసర విషయాల గురించి చింతించడం మానేయండి. ఏం జరిగినా అది మీ మంచికోసమే జరిగిందనుకోవాలి. వ్యర్థంగా ఆలోచించడం మానేస్తే చాలా మంచిది. మీ వాక్చాతుర్యంతో ఎంత పనిఅయినా సులభతరం అవుతుంది. శత్రువులు మీకు హాని కలిగించవచ్చు..జాగ్రత్తగా ఉండండి.
తులా రాశి
పొరుగువారితో వివాదాలుండే అవకాశం ఉంది..అనవసరంగా నోరు పారేసుకోవద్దు. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వైద్యులను సంప్రదిస్తారు. వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. అనుకోని బహుమతి పొందే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నవారికి ఇదే మంచి సమయం.
Also Read: పాములను పూజించడం మూఢనమ్మకమా, పుట్టలో పాలు పోయకూడదా - ఏది నిజం!
వృశ్చిక రాశి
సమయం కలసి రాక కొంత ఇబ్బంది పడతారు. కుటుంబలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మీడియా రిలేటెడ్ వ్యక్తులకు ఈరోజు ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగులు పని ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ఈ రాశివారు...తెలియని వ్యక్తులను నమ్మొద్దు. తలపెట్టిన పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతాయి. ఆహారంపై నియంత్రణ ఉండేలా చూసుకోండి. ఆకస్మిక వ్యయం కారణంగా మీ బడ్జెట్ ప్రభావితం అవుతుంది. కారణం లేకుండా ఎవ్వరితోనూ వాగ్వాదం పెట్టుకోవద్దు.
మకర రాశి
వ్యాపారాల్లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. పని ప్రదేశంలో వచ్చే ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. అవసరం అయినవారికి సహాయం చేయండి
కుంభ రాశి
కాస్త ఓపికగా వ్యవహరించండి. వ్యాపారంలో , ఉద్యోగంలో తొందరపడితే నష్టపోకతప్పదు. చట్టపరమైన పనుల్లో పాల్గొంటారు. చిన్న చిన్న విషయాలపై వివాదాలుజరిగే అవకాశం ఉంది. తోబుట్టువులతో సరదా సమయం గడుపుతారు.
మీన రాశి
పని ప్రదేశంలో వచ్చే సమస్యను పరిష్కరించడానికి...కార్యాలయంలో వాస్తు ప్రకారం మార్పులు చేస్తే ప్రయోజనాలు ఉంటాయి. విమాన ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. ధార్మిక కార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలమైన రోజు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.