అన్వేషించండి

Horoscope Today 27th june 2024: ఈ రాశులవారికి స్థిరాస్తులలో పెట్టుబడులు కలిసొస్తాయి - ఆదాయం పెరుగుతుంది!

Horoscope Prediction 27th june 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope Predictions in Telugu

మేష రాశి

ఈ రాశి అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది.  కష్టపడి పని చేస్తే అందుకు తగిన ఫలితం తప్పనిసరిగా పొందుతారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత పదవులు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. మీ ఆలోచనల్లో స్పష్టత లభిస్తుంది. ఓ గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. 

వృషభ రాశి

ఈ రాశి వ్యాపారులు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది కానీ ఎదురైన సమస్యలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఇంకొంతకాలం వెయిటింగ్ తప్పదు. ఆస్తి నుంచి లాభాలు పొందుతారు. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు ఇదే మంచి సమయం. 

మిథున రాశి

ఈ రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కొందరికి వారసత్వంగా ఆస్తి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల పట్ల మొరటుగా ప్రవర్తించవద్దు. ఈ రాశి విద్యార్థులు చదువులో రాణిస్తారు. 

Also Read: బోనాలు, రథయాత్ర, తొలి ఏకాదశి, గురుపూర్ణిమ సహా జూలై నెలలో ఎన్ని పండుగలో!

కర్కాటక రాశి

ఈ రాశివారికి గ్రహాలు అనుకూల ఫలితాలనిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో కీర్తి పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితులను కలుస్తారు. నూతన ఆస్తులపై పెట్టే పెట్టుబడులు కలిసొస్తాయి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఎవరి భావాలను అగౌరవపరచొద్దు. 

సింహ రాశి

ఈ రాశివారికి ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరమైన నిర్ణయాలు కలిసొస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఎక్కడున్నా మీరు సెంటరాఫ్ అట్రాక్షన్ గా ఉండాలని ఆలోచిస్తారు. 
 
కన్యా రాశి 

ఖర్చులు తగ్గించుకోవాలంటే ఆర్థిక నిర్వహణ అవసరం. అవసరమైతే ఆర్థిక సలహాదారునుంచి సలహాలు తీసుకోండి. చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేసేందుకు ప్రయత్నించాలి. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అప్పులు ఇవ్వొద్దు..తీసుకోవద్దు.  కుటుంబ సభ్యుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. 

తులా రాశి

ఈ రోజు  కుటుంబానికి సమయం కేటాయించాలి. కొత్త ప్రణాళికల గురించి స్నేహితులతో చర్చించవచ్చు. మీ వ్యాపారంలో పెట్టుబడి అద్భుతమైన రాబడిని ఇస్తుంది. ఉద్యోగులు పనిలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం. 
 
వృశ్చిక రాశి
 
ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నించాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. కుటుంబంలో శుభకార్య నిర్వహణ కోసం ఆలోచిస్తారు. గుండెకు సంబంధించిన సమస్యలున్నవారు ఒత్తిడికి దూరంగా ఉండాలి. మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. వైవాహిక జీవితంలో కమ్యూనికేషన్ లోపం ఉండనివ్వవద్దు.  

Also Read:  యక్షిణిలు ఎవరు ? భూమ్మీద ఉన్నారా - యక్షిణి సాధన ఎందుకు చేస్తారు..ఎవరు చేస్తారు!

ధనుస్సు రాశి

ఈ రాశివారు ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. ఆస్తి కొనుగోలుకు ఇదే సరైన సమయం. వ్యాపారులు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కార్యాలయంలో వాతావరణం మీకు అనుకూల ఫలితాలనిస్తుంది. ఇంట్లో వాతావారణం ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణపై ఆసక్తి చూపిస్తారు. 

మకర రాశి

చేతిలో డబ్బు లేకపోవడంతో ఆగిపోయిన పనులు ఈ రోజు తిరిగి ప్రారంభమవుతాయి. సృజనాత్మక పనిలో చాలా చురుకుగా ఉంటారు. కుటుంబ బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తిస్తారు. ఉద్యోగులు పనిలో వేగాన్ని కొనసాగిస్తారు.నూతన ఆస్తులు కొనుగోలులో పెట్టుబడులు పెట్టేందుకు తగిన సమయం ఇది. ప్రేమ సంబంధాలలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. 

కుంభ రాశి
 
మీ మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలు తొలగించుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. వృత్తిపరమైన రంగంలో మీ సీనియర్లను ఆకట్టుకోవడానికి  చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ప్రియమైన వారితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడపుతారు. భూమి క్రయ విక్రయాలలో నిమగ్నమైన వారికి ఈ రోజు మంచిది. 

 Also Read: జూలై 7న పూరీ జగన్నాథుడి రథయాత్ర..ఐదు దశాబ్దాల తర్వాత ఒకేరోజు మూడు వేడుకలు!

మీన రాశి

ఈ రాశివారు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. నూతన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారి నిరీక్షణ ఫలిస్తుంది. స్థిరాస్తులలో పెట్టుబడులు పెడతారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అనవసరమైన ఆలోచనలు మనసుపై ఒత్తిడిని కలిగిస్తాయి. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

Also Read: అశ్వత్థామ మంచివాడా - చెడ్డవాడా..అత్యంత శక్తిమంతుడైన బ్రాహ్మణ పుత్రుడికి ఎందుకీ శాపం!

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. 

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

వృశ్చిక రాశి వారఫలాలు అక్టోబర్ 12 to 18 : శరన్నవరాత్రి వారం సవాళ్లు, కీలక నిర్ణయాలకు సిద్ధంగా ఉండండి!
వృశ్చిక రాశి వారఫలాలు అక్టోబర్ 12 to 18 : శరన్నవరాత్రి వారం సవాళ్లు, కీలక నిర్ణయాలకు సిద్ధంగా ఉండండి!
తులా రాశి వారఫలాలు అక్టోబర్ 12 To 18 : శరన్నవరాత్రి వారం మీపై సూర్యుని సంచార ప్రభావం, ఆర్థిక సవాళ్లు!
తులా రాశి వారఫలాలు అక్టోబర్ 12 To 18 : శరన్నవరాత్రి వారం మీపై సూర్యుని సంచార ప్రభావం, ఆర్థిక సవాళ్లు!
కన్యా రాశి వారఫలాలు అక్టోబర్ 12 to 18 : శరన్నవరాత్రి వారం ఆర్థికం, సంబంధాలపై గ్రహాల ప్రభావం!
కన్యా రాశి వారఫలాలు అక్టోబర్ 12 to 18 : శరన్నవరాత్రి వారం ఆర్థికం, సంబంధాలపై గ్రహాల ప్రభావం!
ఏలినాటి శని 2026: శని నక్షత్ర మార్పుతో కుంభం, మీనం, మేషంపై ఎలాంటి ప్రభావం?
ఏలినాటి శని 2026: శని నక్షత్ర మార్పుతో కుంభం, మీనం, మేషంపై ఎలాంటి ప్రభావం?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
Embed widget