అన్వేషించండి

Rath Yatra 2024 Dates and Details: జూలై 7న పూరీ జగన్నాథుడి రథయాత్ర..ఐదు దశాబ్దాల తర్వాత ఒకేరోజు మూడు వేడుకలు!

Rath Yatra 2024 : ఏటా ఆషాడ శుద్ధ విదియ నాడు జరిగే పూరీ రథోత్సవాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఈ ఏడాది జూలై 7 న రథయాత్ర జరగనుంది. ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే 3 ఉత్సవాలు ఒకే రోజు జరగనున్నాయి..

Rath Yatra 2024 Dates and Details: 2024 జూలై 7 న పూరీ జగన్నాథుడి రథయాత్ర

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పూరీ ద్వారావతీచైవ సప్తైతే మోక్షదాయకా!

ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటి పూరీ. పురుషోత్తముడు కొలువైన ఈ క్షేత్రాన్నికి  శ్రీ క్షేత్రం, శంఖ క్షేత్రం, నీలాద్రి , నీలాచలం అనే పేర్లతోనూ పిలుస్తారు. సంవత్సరం పాటూ గర్భాలయంలో ప్రత్యేక పూజలందుకునే జగన్నాథుడు.. ప్రతి సంవత్సరం  ఆషాడ శుద్ధ విదియ రోజు సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలసి బయటకు అడుగుపెడతాడు. 1078 లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ఈ ఆలయ నిర్మాణం ప్రారంభిస్తే.. ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్‌ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించారు.

Also Read:  యక్షిణిలు ఎవరు ? భూమ్మీద ఉన్నారా - యక్షిణి సాధన ఎందుకు చేస్తారు..ఎవరు చేస్తారు!

అద్భుతమైన ఆధ్యాత్మిక సంబరం

పూరీ జగన్నాథుడి రథయాత్ర కేవలం ఓ ఒడిశా వాసులకు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉండే ప్రతి భక్తులు చూసి తీరాల్సిన అద్భుతమైన ఆధ్యాత్మిక సంబరం. ఈ రథయాత్ర ప్రత్యేకతలపై ఎన్నో గాథలున్నాయి. వాటి మహిమల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా నిత్యనూతనమే. ఏటా ఆషాడంలో జరిగే  రథయాత్ర చూసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.  ఈ ఏడాది జూలై 7న ప్రధాన రథయాత్ర జరగనుంది. అయితే ఇదే రోజు మరో రెండు విశిష్టతలున్నాయి...

మూడు ఉత్సవాలు ఒకేరోజు

సాధారణంగా జగన్నాథుడి నవయవ్వనరూపం, నేత్రోత్సవం, రథయాత్ర వేర్వేరు రోజుల్లో జరుగుతాయి. కానీ ఈ ఏడాది ఈ మూడు ఉత్సవాలు ఒకే రోజు జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఈ 3 ఉత్సవాలు ఒకే రోజు నిర్వహిస్తున్నారు.  1971లో నవయవ్వనరూపం, నేత్రోత్సవం, రథయాత్ర ఒకేరోజు చేశారు..ఈ ఏడాది కూడా అదే విధానం అనుసరించాలని నిర్ణయించింది అధికార యంత్రాంగం. జూలై 6 అర్థరాత్రి నుంచి గర్భగుడిలో జగన్నాధ, బలభద్ర, సుభద్రకు ప్రత్యేక సేవలు మొదలువుతాయి. తెల్లవారు జామున నవయవ్వన అవతార అలంకరణం, ఆ తర్వాత నేత్రోత్సవం,  గోప్య సేవలు నిర్వహించిన తర్వాత విగ్రహాలను రథం వద్దకు తీసుకొస్తారు.   పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌  బంగారు చీపురుతో రథం ముందు ఊడ్చిన తర్వాతే రథం ముందుకు సాగుతుంది.

Also Read: అశ్వత్థామ మంచివాడా - చెడ్డవాడా..అత్యంత శక్తిమంతుడైన బ్రాహ్మణ పుత్రుడికి ఎందుకీ శాపం!

జగన్నాథస్వామి ఆలయం నుంచి బయలుదేరే 3 రథాలు అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచాదేవి ఆలయం దగ్గరకు వెళ్లగానే ఆగిపోతాయి.  అక్కడే వారంపాటూ ఆతిథ్యం స్వీకరించి ఆ తర్వాత తిరుగుపనయం అవుతాయి. మళ్లీ జగన్నాథ ఆలయానికి చేరుకున్నాక విగ్రహాలను తీసుకెళ్లి తిరిగి గర్భగుడిలో ప్రతిష్టిస్తారు. ఆ ఘట్టంతో ఉత్సవం ముగుస్తుంది. అయితే ఈ సంవత్సరం రథయాత్ర సాయంత్రం మొదలవుతుంది.. మొదట బలభద్రుడు..ఆ తర్వాత సుభద్ర..ఆఖర్లో జగన్నాథుడి రథాలు బయలుదేరుతాయి. అంటే బలభద్రుడి రథం బయలుదేరేసరికే చీకటి పడుతుంది...అందుకే జూలై 8 న రథాలు బయలుదేరి గుండిచా సన్నిధికి చేరుకుంటాయి.

Also Read: శంబల నగరం ఎక్కడుంది , ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లొచ్చారు - శంబల గురించి ఆశ్చర్యపోయే విషయాలివే!


 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget