రాధాకృష్ణులు ఎందుకు పెళ్లి చేసుకోలేదు!

భూమిని భరించేవాడు ధర్మాన్ని నిలబెట్టేవాడు శ్రీ మహా విష్ణువు

ఆ భూమికి ప్రతిరూపం రాధ..భరించేవాడే భర్త..అందుకే విష్ణువు అంటే ఆమెకు అత్యంత ఆరాధనా భావం

రాధ..కృష్ణుడి మనసు, వాళ్లు ఇద్దరు కాదు ఒక్కరే అందుకే రాధాకృష్ణుల పేర్లుకూడా విడదీసి పలకరు

రాధ... కృష్ణుడిని లౌకికంగా కాదు తత్వంగా మాత్రమే కోరుకుంది

రాధ ప్రేమ తత్త్వం కృష్ణుడు అయితే..శ్రీ కృష్ణుడి సర్వగత చైతన్యం రాధ..

రాధా కృష్ణుల ప్రేమ ఇహలోకానికి సంబంధించింది కాదు..వీరి రాసలీల మోక్షానికి మార్గం చూపేది మాత్రమే

‘ప్రియే చారుశీలే’ అష్టపదిలో ‘స్మర గరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవమ్‌ ఉదారం’ అని రాశాడు జయదేవుడు

నా తలపై నీ చిగురుటాకుల లాంటి పాదాలు ఉంచమని రాధను కృష్ణుడు ప్రాధేయ పడుతున్నాడని దీని అర్థం..

భగవంతుడు కూడా ప్రేమకు కట్టుబడినంత త్వరగా దేనికీ తలొంచడని చెప్పేందుకు ఇదే నిదర్శనం
Images Credit: playground.com