బ్రహ్మరాత ఎవ్వరూ మార్చలేరంటే ఇదే!

ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు అవతారం చాలించేందుకు సమయం దగ్గరపడడంతో యముడు ద్వారకకు చేరుకున్నాడు.

శ్రీ కృష్ణుడికి ఆ విషయం గుర్తుచేసేందుకు లోపలకు వెళుతూ బయట చెట్టుమీదున్న చిలుకను చూసి నవ్వి వెళ్లిపోయాడు.

ప్రాణభయంతో భయపడుతున్న చిలుక దగ్గరకు వెళ్లి భయపడొద్దని అభయం ఇచ్చాడు గరుత్మంతుడు

ఏడు సముద్రాలు దాటి వెళ్లి అక్కడున్న చెట్టు తొర్రలో చిలుకను విడిచిపెట్టి వచ్చాడు గరుత్మంతుడు

కృష్ణుడి దగ్గర నుంచి బయటకు వచ్చిన యముడితో..చిలుకను చూసి ఎందుకు నవ్వారని ప్రశ్నించాడు గరుత్మంతుడు

ఏడు సముద్రాల అవతల ఓ చెట్టు తొర్రలో ఉన్న పాముకి కొన్ని క్షణాల్లో చిలుక ఆహారంగా మారాలని రాసిపెట్టి ఉంది..

ఇక్కడున్న చిలుక అక్కడకు ఎలా వెళుతుంది..అదెలా సాధ్యం అనుకుని నవ్వానని బదులిచ్చాడు యముడు..

బ్రహ్మ రాతను ఎవ్వరూ మార్చలేరని శ్రీ కృష్ణుడు బోధించిన విషయం మరోసారి గుర్తుచేసుకున్నాడు గరత్మంతుడు