Horoscope Today 27th December 2022: ఈ రాశివారు పెద్ద తప్పుచేసే అవకాశం ఉంది -జాగ్రత్త, డిసెంబరు 27 రాశిఫలాలు
Rasi Phalalu Today 27th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 27th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు మేష రాశివారికి లాభదాయకమైన రోజు. వ్యాపార రంగంలో ఉన్నతాధికారుల దయతో మీ పురోగతికి మార్గం సుగమం అవుతుంది. వ్యాపారంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు.
వృషభ రాశి
ఈ రాశివారికి జీవిత భాగస్వామితో సమన్వయం పెరుగుతుంది. ఉద్యోగులు పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. శారీరక అనారోగ్యం, మానసిక ఆందోళన అలాగే ఉంటాయి. వ్యాపారంలో అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఆర్థికపరంగా బాగానే ఉంటుంది
మిథున రాశి
ఈ రాశి వారు ఈ రోజు తమకు తెలియకుండా పెద్ద తప్పు చేయవచ్చు. అందువల్ల అనవసర ప్రసంగాలు వద్దు, కోపం తెచ్చుకోవద్దు. సంయమనం పాటించడం చాలా మంచిది. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు, ప్రభుత్వ వ్యతిరేక ధోరణులకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళన వెంటాడుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు రావొచ్చు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి.
కర్కాటక రాశి
జరగాల్సిన సమయానికి అన్నీ జరుగుతాయి..మీ సమయం వచ్చేవరకూ వేచి ఉండడం మంచిది. భాగస్వాములతో సంబంధాలు బాగుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి కానీ ఆర్థిక లాభం మీ ఆందోళన తగ్గిస్తాయి.
Also Read: న్యూ ఇయర్ వచ్చేస్తోంది, కొత్త క్యాలెండర్ వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశగా పెట్టాలంటే!
సింహ రాశి
ఈ రోజు దైవదర్శనం మీకు మేలు చేస్తుంది. దృఢమైన నైతిక స్థైర్యం,ఆత్మవిశ్వాసంతో మీ రోజు మీరు తలపెట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. కుటుంబ జీవితంలో శాంతి, సంతోషం ఉంటుంది. మాటలపై సంయమనం పాటించాలి.
కన్యా రాశి
ఈ రోజు కన్యారాశి వారు భావోద్వేగంలో ఉంటారు. విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటి వాతావరణంలో శాంతి, ఆనందం ఉంటుంది. ఈ రాశివ్యాపారులు లాభాలు సాధిస్తారు
తులా రాశి
కుటుంబంలో ప్రశాంతంత ఉండాలంటే అర్థరహితమైన చర్చలకు దూరంగా ఉండాలి. ఈ రోజు తల్లి ఆరోగ్యం బాగా ఉండదు. ఈ రోజు తులా రాశివారు డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంది జాగ్రత్త. ఎవ్వరి విషయాల్లోనూ జోక్యం చేసుకోవద్దు
Also Read: దేవుడి మందిరంలో విగ్రహాలొద్దు, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచొద్దు-వాస్తు నిపుణులు ఇంకా ఏం చెప్పారంటే!
వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారు ఈ రోజు బంధువులను కలుసుకుంటారు. ఈ రోజు మీరు స్నేహితులు లేదా ప్రియమైన వారిని కలిసే అవకాశం ఉంది. సోదరులతో మంచి సంబంధాలుంటాయి. ఏదో విషయంలో విచారంగా ఉంటారు.
ధనుస్సు రాశి
ఈ రోజు ధనుస్సు రాశి వారు చేసే పనులు అంత సంపూర్ణంగా పూర్తికావు. మీరు కోపం, మీ మాటలపై సంయమనం పాటించాలి. ప్రతికూల ఆలోచనలు మనసులోకి రానివ్వకండి. అన్నపానీయాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ ఓర్పు మీకు ఆలస్యంగా అయినా విజన్నానిస్తుంది.
మకర రాశి
మీరు తొందరగా ఇతరుల వైపు ఆకర్షితులవుతారు. ఈ రోజు మీకు శుభదినం. కొత్త పనిని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మతపరమైన పనులకు ఖర్చు అవుతుంది. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.
కుంభ రాశి
ఈ రాశికి చెందిన వ్యక్తులు కష్టపడి పనిచేస్తేనే ఫలితాలను పొందే అవకాశం ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందాలనే ఆలోచనలో చిక్కుకోకుండా జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండండి. మానసిక ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, డబ్బు సంబంధిత లావాదేవీల పట్ల జాగ్రత్త వహించండి.
మీన రాశి
ఈ రాశివారు ఈ రోజు తెలియని వ్యక్తులను నమ్మకూడదు. ఈ రోజు ఓ శుభవార్త వింటారు. చిన్ననాటి స్నేహితులను కలవడం వల్ల మనస్సులో సంతోషం ఉంటుంది. మీరు కొత్త స్నేహితులను కూడా పొందవచ్చు. వ్యాపారం, ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టొచ్చు.