Horoscope Today 27th September 2022: మేషం, సింహం సహా ఈ రాశులవారిపై బాలాత్రిపుర సుందరి ఆశీస్సులు ఉంటాయి, సెప్టెంబరు 27 రాశిఫలాలు
Horoscope Today 27 September :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 27 September : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు మేషరాశి వారికి సంతోషకరమైన రోజు. ఆర్థిక పథకాల ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ బలాలతో పాటు, మీ లోపాలను కూడా మీరు గుర్తించగలగాలి. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది.
వృషభ రాశి
ఈ రోజు ఖాళీ సమయాల్లో సృజనాత్మక పని వైపు మొగ్గు చూపుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులు పనిలో బిజీబిజీగా ఉంటారు. కొన్ని విషయాలు మీ మనసుకు అనుగుణంగా ఉండవు. కుటంబంతో సమయం గడుపుతారు.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశికి చెందిన వృద్ధులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.వ్యాపారులకు ఈరోజు శుభదినం. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకున్న పనులున్నీ సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు.
కర్కాటక రాశి
ఈ రోజు మీఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. వ్యాపార పనుల కారణంగా మీరు ఆకస్మిక ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మాటతీరు మార్చుకోండి..మీ మనసులో ఉద్దేశం ఒకటి మీరు బయటకు మాట్లాడే మాట ఒకటి అవడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. మీ బాధను ఎవ్వరికీ చెప్పొద్దు.
Also Read: దసరాల్లో పిల్లలకు పూజ చేస్తుంటారు కదా - ఏ వయసు పిల్లల్ని పూజిస్తే ఎలాంటి ఫలితం!
సింహ రాశి
ఈ రోజు ముఖ్యమైన ప్రణాళికలు ఊపందుకుంటాయి. ఆర్థిక లాభం ఉంటుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు ఏదో ఒక విషయంలో బాధపడతారు కానీ త్వరలోనే ఆ బాధనుంచి ఉపశమనం పొందేలా చేస్తారు. విదేశాల్లో వ్యాపారం చేసే వారికి చాలా లాభాలు వస్తాయి.
కన్యా రాశి
జరిగిపోయిన ఘటనలు గుర్తుచేసుకుని బాధపడొద్దు..ఇకపై గతాన్ని మర్చిపోయి ముందుకు సాగాలి. ఒంటరితనాన్ని అధిగమించడానికి, మీ మనసును కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఆఫీసులో సహోద్యోగుల సహకారం వల్ల పని బాగుంటుంది.
తులా రాశి
కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ ఉత్సుకత మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇంటికి అతిథి రాక వల్ల పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.
వృశ్చిక రాశి
సరైన నిర్ణయం తీసుకోవడానికి మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచండి. ఒకరి సలహా మేరకు డబ్బు పెట్టుబడి పెట్టొద్దు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. వైవాహిక జీవితం బావుంటుంది.
Also Read: శరన్నవరాత్రుల్లో పాడ్యమి నుంచి దశమి వరకూ అమ్మవారికి రోజుకో రంగు ప్రత్యేకం
ధనుస్సు రాశి
ఆర్థిక పరంగా మరింత ముందుకు సాగేందుకు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమికుడితో ఏదో విషయంలో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఉద్యోగులు కార్యాలయంలో తమ ప్రతిభను కనబర్చేందుక పుష్కలమైన అవకాశాలు లభిస్తాయి.
మకర రాశి
ఈ రోజు ఆస్తి పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఎవరితోనూ వాదించవద్దు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఒంటరిగా గడపడం కూడా అవసరం. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి నుంచి ఎక్కువ ప్రేమను పొందుతారు.
కుంభ రాశి
ఈ రోజంతా మీరు సరదా సరదాగా ఉంటారు. పిల్లలు తమ పనిలో మెరుగైన పనితీరును కనబరుస్తారు. ప్రేమికుల మధ్య విభేదాలుంటాయి. కాస్త ఓపికగా వ్యవహరించండి. మీ జ్ఞానాన్ని ఇతరులతో కూడా పంచుకోండి.
మీన రాశి
ఈ రాశివారికి ఈ రోజు ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధనలాభంతో పాటు పొదుపు కూడా ఉంటుంది. రోజువారీ జీవితంలో పనులతో పాటు, మీ అభిరుచికి సంబంధించిన పనిపై ఆసక్తి పెరుగుతుంది. కార్యాలయంలో సహోద్యోగులకు మద్దతు లభిస్తుంది.