అక్టోబరు 27 రాశిఫలాలు - ఈ రాశులవారికి నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి!
Dussehra Horoscope 27th October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబరు 27 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. గృహ జీవితంలో జాగ్రత్తగా ఉండండి. సన్నిహితుల నుంచి మీరు బహుమతులు అందుకుంటారు. అనవసరంగా ఇతరుల సలహాలు తీసుకోవద్దు. ప్రేమికులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. కుటుంబ సుఖాల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు. మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది.
వృషభ రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఎవరితోనైనా వాగ్వాదం ఉండవచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో లాభం ఉంటుంది. మీరు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. కోపం తెచ్చుకునే బదులు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. క్రమపద్ధతిలో పని చేయండి. నిర్వహణ సంబంధిత పనులలో లాభాలు ఉంటాయి.
మిథున రాశి
మీ జీవిత భాగస్వామి పట్ల మీ ప్రవర్తనను మెరుగుపరచుకోండి. మీ పనిని సకాలంలో పూర్తి చేస్తారు. తీసుకున్న మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. మీ నుంచి చాలా మంది స్ఫూర్తి పొందుతారు. కొత్త ఆదాయ వనరులను అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలు బలబడతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
Also Read: దక్షిణావర్తి శంఖం - దీపావళి రోజు పూజించాల్సిన అత్యంత విశిష్టమైన వస్తువు ఇది!
కర్కాటక రాశి
ఈ రాశి ఉద్యోగుల ఆదాయం మెరుగుపడుతుంది. వ్యాపార లావాదేవీలు జాగ్రత్తగా చేయండి. పనిలో పారదర్శకత పాటించండి. విద్యార్థులు లాభపడతారు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దు. మీరు ఈరోజు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటారు.
సింహ రాశి
ఈ రోజు ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారిపై పని ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో బదిలీ ఉండవచ్చు. ఈరోజు మీరు ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు.
కన్యా రాశి
ఈ రోజు ఎవరితోనైనా వాగ్వివాదం జరిగే అవకాశం ఉంది. మీ బలహీనతలను అధిగమించేందుకు ప్రయత్నించండి. అధిక శ్రమ కారణంగా కండరాల ఒత్తిడి సంభవించవచ్చు. ధన సమస్యలు ఉంటాయి. మీ మొండి వైఖరి కారణంగా, మీ సన్నిహితులు మిమ్మల్ని విస్మరిస్తారు. తొందరగా కోప్పడతారు.
తులా రాశి
తులారాశి వారికి ఈరోజు మంచి రోజు. ఆర్థికంగా భారీగా లాభపడే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. రోజువారీ దినచర్య మెరుగుపడుతుంది. మీ సహోద్యోగుల పట్ల మంచి ప్రవర్తన కొనసాగించండి. కార్యాలయ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు గొప్ప రోజు. కొత్త వ్యక్తులు కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఆత్మగౌరవం తగ్గుతుంది. ప్రత్యర్థులను ఎక్కువగా నమ్మవద్దు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు పెద్ద పదవులు పొందుతారు.
Also Read: దీపావళి గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 అద్భుతమైన విషయాలు!
ధనస్సు రాశి
ఈ రోజు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తారు. వ్యాపారంలో కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖులతో మీ సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు మీరు ఇంటి పనిలో బిజీగా ఉంటారు
మకర రాశి
ఈ రోజు మీ దినచర్య అస్తవ్యస్తంగా మారుతుంది. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. మీరు మీ ఆర్థిక స్థితి గురించి ఆందోళన చెందుతారు. శత్రు పక్షాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. ఆహారపు అలవాట్లను నియంత్రించండి. పెద్దల ఆశీర్వాదం మీపై ఉంటుంది.
కుంభ రాశి
కొన్ని వ్యాపార విషయాలు చిక్కుముడి పడవచ్చు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. విద్యార్థులు చదువులో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది
Also Read: దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎలా స్వాగతించాలి - పూజలో అనుసరించాల్సిన ప్రత్యేక విషయాలేంటి!
మీన రాశి
ఈ రోజు మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. మీ పనితో పాటు, ఇతర పనులపై ఎక్కువ శ్రద్ధ చూపగలరు. స్థిరాస్తుల క్రయ, విక్రయాల వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.