Horoscope Today 26th April 2024: ఏప్రిల్ 26 రాశిఫలాలు - ఈ రాశివారు ఎవ్వరినీ అతిగా నమ్మొద్దు!
Daily horoscope: ఏప్రిల్ 26 ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...
![Horoscope Today 26th April 2024: ఏప్రిల్ 26 రాశిఫలాలు - ఈ రాశివారు ఎవ్వరినీ అతిగా నమ్మొద్దు! Horoscope Today 26th April 2024 aries gemini and other zodiac signs check astrological prediction in telugu Horoscope Today 26th April 2024: ఏప్రిల్ 26 రాశిఫలాలు - ఈ రాశివారు ఎవ్వరినీ అతిగా నమ్మొద్దు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/25/707f6022073aa9d924585960a7227f351714061683087217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Horoscope Today 26th April 2024
మేష రాశి
మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు చేయాల్సిన పని విషయంలో ఇతరులపై ఆధారపడొద్దు. చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోయేఅవకాశం ఉంది. అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు..ఇవి మీ బంధాల మధ్య చీలిక పెంచుతాయి. వైవాహిక జీవితం బావుంటుంది.
వృషభ రాశి
అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారు ఆర్థికంగా లాభపడతారు. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం.
Also Read: చీకటి పడగానే నగర పర్యటన చేస్తూ సంహారానికి పాల్పడే అమ్మవారి గురించి విన్నారా!
మిథున రాశి
మీ పనితీరు మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ గౌరవం పెరుగుతుంది.
కర్కాటక రాశి
కుటుంబంతో ఆహ్లాదకర సమయం గడుపుతారు. మీ మాటలతో ఎవ్వరినైనా ప్రభావితం చేయగలరు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పొట్టకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందిపడతారు. విద్యార్థులకు కొత్త అధ్యయనాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
సింహ రాశి
పనిలో ఒత్తిడి మీ ఇంటిపైనా ప్రభావం చూపుతుంది. ఎవ్వరినీ అతిగా నమ్మొద్దు. అనుకోని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దినచర్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణ ఫలితాలుంటాయి.
Also Read: అక్షయ తృతీయ ఎప్పుడు - ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి , ఈ రోజు ఏం చేయాలి!
కన్యా రాశి
నిరుద్యోగులు మంచి అవకాశాలు పొందుతారు. రాజకీయాల్లో ఉన్నవారికి శుభఫలితాలున్నాయి. భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది. మీకు నచ్చింది చేయండి..ఎవ్వరి సలహాలు పాటించకూడదు. కొత్త స్నేహితులు ఏర్పడతారు.
తులా రాశి
రోజు ప్రారంభం ఇంత ఇబ్బందిగా మొదలవుతుంది కానీ రోజు గడిచేకొద్దీ ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో మంచి పనితీరు కనబరుస్తారు. వ్యాపారం బాగానే సాగుతుంది. పిల్లల పురోగతి వల్ల సంతోషంగా ఉంటారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం చేయాల్సిన ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చిక రాశి
అనుకోని బంధువులు ఇంటికి రావొచ్చు. ఎప్పటి నుంచో చేతికందాల్సిన డబ్బులు వస్తాయి. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు ఉంటాయి. పూర్వీకుల ఆస్తులు పొందే అవకాశం ఉంది. మీరు కమిషన్ సంబంధిత పని నుంచి ప్రయోజనాలను పొందుతారు
Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా!
ధనుస్సు రాశి
అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. విదేశాల్లో ఉండేవారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణ ఫలితాలున్నాయి.
మకర రాశి
మీ కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. దాన ధర్మాలు చేస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. మీ మాటలతో ఎవ్వరినైనా ప్రభావితం చేస్తారు.
కుంభ రాశి
కష్టానికి తగిన ఫలితం పొందుతారు. తల్లిదండ్రుల కారణంగా మీ మనోధైర్యం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటారు. పిల్లలు కెరీర్లో విజయం సాధిస్తారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి.
Also Read: మేష రాశిలో శుక్ర సంచారం - ఈ 7 రాశులవారికి ఆర్థికలాభం, ఆనందం!
మీన రాశి
అడగకుండా ఎవ్వరికీ సలహాలు ఇవ్వొద్దు. అనుకున్న పనులు సమయానికి పూర్తిచేస్తారు. పాతరుణాలు తీరుస్తారు. మీ ఆలోచనా విధానం మెచ్చుకోలుగా ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)