News
News
వీడియోలు ఆటలు
X

మార్చి 25 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశివారి చుట్టూ పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది

Rasi Phalalu Today 25th March, 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

మార్చి 25 శనివారం రాశిఫలాలు

మేష రాశి 

ఈ రోజు ఆర్థిక పరిస్థితి, దానికి సంబంధించిన సమస్యలు మీ ఒత్తిడికి కారణం కావచ్చు. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ అనకున్న పనులు పూర్తిచేయగలుగుతారు

వృషభ రాశి 

ఈ రోజు మీకు ఒడిదుడుకులతో నిండిన రోజు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. సాయంత్రానికి పరిస్థితి కొంత ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.  ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

మిథున రాశి

ఈ రోజు మీరు మీ దృష్టిని ఆరాధనపై కేంద్రీకరిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు రంగంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈ రాశి విద్యార్థులు కూడా మంచి ఫలితాల కోసం కష్టపడాలి. తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది.

Also Read: ఈ రాశులవారికి సంపాదన కన్నా ఖర్చులెక్కువ

కర్కాటక రాశి 

ఈ రోజు మీరు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులతో నూతన సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. మీరు మీ కోసం కొంత సమయం తీసుకుంటారు. రోజంతా ప్రశాంతంగా ఉంటారు. మీ ప్రణాళికలపై పని చేస్తారు.

సింహ రాశి

సింహ రాశివారికి ఈ రోజు ఆరోగ్యం కొంత బలహీనంగా అనిపిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు తమ వ్యవహారాలపై శ్రద్ధ చూపలేరు.  వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. ప్రేమికులకు కూడా మంచి రోజు.

కన్యా రాశి

కన్యా రాశికి చెందిన ఉద్యోగులు మంచి అవకాశం పొందుతారు. ఏదైనా ప్రత్యేకమైన పని చేయాలని ఆలోచిస్తుంటే, ఈ రోజు శుభదినం. పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు. కార్యాలయంలో సీనియర్లను మీ పనితో ఇంప్రెస్ చేస్తారు.  ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగుపడుతుంది. 

Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం

తులా రాశి

ఈ రోజు తులా రాశివారికి పరిస్థితి అంత అనుకూలంగా లేదు. ఏదో విషయంలో భావోద్వేగానికి లోనవుతారు. ఆరోగ్యం కూడా కొంత బలహీనంగా అనిపిస్తుంది. ప్రేమికులకు మంచి రోజు. వివాహితులకు జీవిత భాగస్వామితో వివాదం తలెత్తే అవకాశం ఉంది. 

వృశ్చిక రాశి

ఈ రోజు మీకు మంచి రోజు . మీరు ఎదుర్కొనే సవాళ్లు మధ్యాహ్నానికి ఓ కొలిక్కివస్తాయి. కొంతవరకూ ప్రశాంతంగా ఉంటారు. మీ ఆదాయం బావుంటుంది. ఖర్చులు తగ్గుతాయి. ప్రత్యర్థులు యాక్టివ్ గా ఉన్నారు..మీరు అప్రమత్తంగా ఉండడం మంచిది.

ధనుస్సు రాశి 

ఈ రోజు మీరు రోజంతా రిఫ్రెష్ గా ఉంటారు. అనుకున్న పనులు పూర్తిచేయడంతో సంతోషంగా ఉంటారు. మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీ చుట్టూ ఉండేవారు కూడా సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం బావుంటుంది

మకర రాశి 

కొన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు కనుక్కొంటారు. మనసులో కొంత ఆందోళన ఉంటుంది. సంతానం కారణంగా కొంత ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యులు, బంధువులతో వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండండి. మీలో ఆత్మవిశ్వాసం తగ్గనీయొద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 

కుంభ రాశి 

కుంభ రాశివారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీ వాక్చాతుర్యం కారణంగా చాలా పనుల్లో విజయవంతమవుతారు. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ మనసులో మాటను చెప్పేందుకు మంచిరోజు.

మీన రాశి

ఈ రాశివారు ఈ రోజు ఏం చెప్పాలి అనుకున్నారో ఆ విషయం క్లియర్ గా చెప్పగలుగుతారు. ఉద్యోగులకు మంచి రోజు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞల సలహా తీసుకోవడం మంచిది. ఈ రాశివారికి సమాజిక సేవలో పాల్గొనే అవకాసం వస్తుంది. జీవితంలో పురోగతి సాధిస్తారు.

Published at : 25 Mar 2023 05:32 AM (IST) Tags: Astrology rasi phalalu Horoscope Today Today Rasiphalalu astrological prediction today Sri Sobhakritu Nama Samvatsara uadi Ugadi Predictions 2023-2024 March 25th Horoscope 25th March Astrology Horoscope for 25th March 25th March Horoscope

సంబంధిత కథనాలు

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలివి!

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

జూన్ 3 రాశిఫలాలు, ఈ రెండు రాశులవారికి ఈ శనివారం చాలా ప్రత్యేకం

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి