అన్వేషించండి

మార్చి 23 రాశిఫలాలు, ఈ రాశివారు మాటలు తగ్గించి పనిపై దృష్టిపెట్టడం మంచిది

Rasi Phalalu Today 23rd March, 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

మేష రాశి 

ఈ రోజు ఈ రాశివారికి మానసిక ఇబ్బందులుంటాయి. సోమరితనంగా వ్యవహరిస్తారు. నూతన సంబంధాలు లాభిస్తాయి.మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా బలంగా ఉంటుంది. కొన్ని విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలి. 

వృషభ రాశి 

ఈ రోజు మీకు ఒడిదుడుకులతో నిండిన రోజు అవుతుంది. ఖర్చులు పెరుగుతాయి..కొంచెం జాగ్రత్త వహించండి. ఆదాయం స్వల్పంగా పెరుగుతుంది.. ఆర్థిక పరిస్థితిపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

మిథున రాశి

ఈ రోజు ఈ రాశివారికి మునుపటి కన్నా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మీ మనోధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అయితే మాట్లాడడం కన్నా మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. మీకు అకస్మాత్తుగా బంధువు నుంచి సర్ప్రైజ్ లభిస్తుంది.

Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు

కర్కాటక రాశి

ఈ రోజు ఈ రాశివారు జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి..మీరు అత్యంత విశ్వసనీయులు అనుకున్నవారు మీకు తెలియకుండా మమ్మల్ని ముంచేస్తున్నారని గమనిస్తే తొందరగా ఒడ్డునపడతారు. మీ పని సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది..అధికారులు మెచ్చేలా ఉంటుంది. సామాజిక హోదా పెరుగుతుంది..కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. 

సింహ రాశి

ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు. ఆదాయం పెరుగుతుంది..మీలో ఆత్మవిశ్వాసాన్ని పెరుగుతుంది. కొత్తగా ప్రారంభించాలి అనుకున్న పనులకు ఈ రోజే శ్రీకారం చుట్టడం మంచిది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు మంచి సమయం. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. 

కన్యా రాశి 

ఈ రోజు మీ సంతోషం రెట్టింపు అవుతుంది. వ్యాపారులు పలు సమావేశాలకు హాజరుకావాల్సి రావొచ్చు. నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగులు చాలా విషయాల్లో ప్రాక్టికల్ గా ఉంటారు.

తులా రాశి  

ఈ రోజు మీరు పనిచేసే రంగంలో పురోగతి కోసం మీ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం లభిస్తుంది. ఊహాగానాలకు అవకాశం ఇవ్వకండి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీ మనసంతా ఆత్మవిశ్వాసం నిండి ఉంటుంది. 

Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలవారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే శూన్య ఫలితం

వృశ్చిక రాశి 

ఈ రోజు మీకు కొంచెం బలహీనంగా ఉంటుంది. మీరు మీ వంతు ప్రయత్నం చేస్తారు కానీ ఫలితం మాత్రం తక్కువగానే ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి...ఇది మీకు ఆందోళన కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి కాస్త బలహీనంగా ఉంటుంది. ఆదాయంలో క్షీణత ఉండవచ్చు. ప్రత్యర్థులు యాక్టివ్ గా ఉంటారు..మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి

ధనుస్సు రాశి 

ఈ రోజు మీ మనస్సు కొత్త ఆశలతో నిండి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని మీతో పంచుకోవాలని కోరుకుంటారు. ఆఫీసులో మీ హోదా కొనసాగుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. మీ సమావేశం ప్రయోజనకరంగా ఉంటుంది.

మకర రాశి

ఈ రోజు మీకు మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మీ మంచి ప్రవర్తన మీ వ్యక్తిగత సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఖర్చులు తగ్గించుకోవడం అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రోజు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది.

కుంభ రాశి

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ తెలివితేటలు మీకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. అనుకున్న పనిని సులభంగా పూర్తిచేస్తారు. కానీ ఈ రోజు మీరు మరింత కష్టపడవలసి ఉంటుంది.

మీన రాశి 

ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి అమ్మవారి ఆలయానికి వెళతారు. ఏ పని ప్రారంభించినా సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తికి సంబంధించిన కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి వారికి ఈ రోజు సరదాగా గడిపే అవకాశం లభిస్తుంది.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
Embed widget