Horoscope Today 23rd December 2022: ఈ రాశివారికి ఈ రోజు అన్నింటా విజయమే, డిసెంబరు 23 రాశిఫలాలు
Rasi Phalalu Today 23rd December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 22nd December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
మీ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. బ్యాంకులకు సంబంధించిన లావాదేవీల్లో చాలా జాగ్రత్త అవసరం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టండి
వృషభ రాశి
ఈ రోజు కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేస్తారు. వ్యాపార పనులపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెడతారు. ఉద్యోగులకు మంచి సమయం. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. అదృష్టం కలిసొస్తుంది
మిథునం
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కోపం తగ్గించుకోవడం మంచిది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఎవ్వరి మనసుని గాయపరచకండి. నమ్మకంతో ముందుకు అడుగేస్తే పనులు పూర్తవుతాయి
Also Read: 2023లో అయినా ఈ రాశివారికి ఆహా అనిపించే రోజు ఉంటుందా! వృశ్చిక రాశి వార్షిక ఫలితాలు
కర్కాటక రాశి
ఈ రోజు మరింత ఆశాజనకంగా ఉంటుంది. కొన్నాళ్లుగా మీలో ఉన్న ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు
సింహ రాశి
ఈ రోజు మీ కుటుంబ సమస్యలు పెరుగుతాయి. మితిమీరిన కోపం మీరు చేసిన ఏ పనినైనా చెడగొట్టవచ్చు. వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా చూసుకోవాలి
కన్యా రాశి
ఈ రోజు ప్రారంభం బాగుంటుంది. బాధ్యతలు నిర్వర్తించడంలో సక్సెస్ అవుతారు. చిన్న చిన్న సమస్యలను పక్కనపెడితే రోజంతా అద్భుతంగా అనిపిస్తుంది. పాత మిత్రులను కలుసుకునే అవకాశం కూడా ఉంది.
Also Read: ఈ రాశివారికి కొత్త ఏడాది సమస్యలతో ఆరంభం - ఆ తర్వాత అంతా శుభం, 2023 తులారాశి ఫలితాలు
తులా రాశి
ఇతరులతో సంతోషాన్ని పంచుకోవడం ద్వారా మీ సంతోషం మరింత పెరుగుతుంది. పనిపట్ల మీ అంకితభావానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు గొప్ప రోజు. వ్యాపారంలో ప్రణాళికా బద్ధంగా పనిచేస్తారు. ఆహారం పట్ల ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
మీరు అనుకున్న పని అనుకున్నట్టు పూర్తిచేస్తారు. డబ్బుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మరోసారి ఆలోచించండి. ఈ రోజు కొత్త వాహనం, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబం నుంచి పూర్తి మద్దతు పొందుతారు. వైవాహిక జీవితంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయండి
మకర రాశి
మీ మానసిక బలమే మీకు శ్రీరామరక్ష. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలగుతారు. ఉద్యోగులు పనిపై శ్రద్ద పెడతారు. వ్యాపారం బాగాసాగుతుంది. బ్యాంకులకు సంబంధించిన లావాదేవీల్లో చాలా జాగ్రత్త అవసరం.
కుంభ రాశి
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేస్తారు..అవి కూడా సక్సెస్ అవుతాయి. తలపెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. దాంపత్య జీవితంలో పరస్పర సామరస్యం బాగుంటుంది. ఆరోగ్యం బావుంటుంది
మీన రాశి
ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు ఈ రోజు ఊపందుకుంటాయి. కార్యాలయంలో పనిభారం ఉంటుంది. మీరు మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకుంటే బంధం బావుంటుంది. మీకు అదృష్టం కలిసొస్తుంది. విద్యార్థులు కెరీర్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.