ఏప్రిల్ 23 రాశిఫలాలు, ఈ రాశివారి మాట-ప్రవర్తన అపార్థాలకు దారితీస్తుంది
Rasi Phalalu Today 23rd April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
ఏప్రిల్ 23 ఆదివారం రాశిఫలాలు: ఏప్రిల్ 23న వృషభం, కర్కాటక, మీన రాశి వారికి శుభఫలితాలున్నాయి. మకర రాశి వారు ఏదో ఒక సందిగ్ధంలో పడతారు. కుంభ రాశివారు పనులు వాయిదాలు వేస్తారు.మొత్తం రాశుల ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి
మేష రాశి
ఈ రోజు ఈ రాశివారికి ఖర్చులు పెరుగుతాయి..కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా ఆర్థికంగా వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సాధారణ సంభాషణ వాదనగా మారకూడదని గుర్తుంచుకోండి. మీ మాటల వల్ల స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు బాధపడవచ్చు. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నందున ఆహార పానీయాల విషయంలో జాగ్రత్త వహించండి.
వృషభ రాశి
ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఏదో సందిగ్ధత నుంచి విముక్తి పొందుతారు. చేపట్టిన పనిని దైర్యంగా పూర్తిచేస్తారు. ఆర్థిక ప్రణాళికను విజయవంతం అవుతాయి. ఆనందం కోసం ఎక్కువ ఖర్చుచేస్తారు. కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెద్ద చింత దూరమవుతుంది.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశివారికి మానసిక అశాంతి ఉంటుంది. మీరు మాట, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. కంటి నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులు లేదా బంధువులతో వివాదాలు ఉండవచ్చు.మీ ప్రవర్తన కారణంగా మీపై అపార్థాలు ఏర్పడతాయి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనూ గొడవలు రాకుండా చూసుకోవాలి. భగవంతుని పట్ల భక్తి మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
కర్కాటక రాశి
ఈ రోజు మీ మనస్సు చింతల నుంచి విముక్తి పొందుతుంది. స్నేహితులను కలుస్తారు. మిత్రుల నుంచి విశేష లాభం ఉంటుంది. సాధారణ ఆదాయం పెరగడంతో పాటు ఇతర మార్గాల్లో ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. వృద్ధులు ఆరోగ్యంగా ఉంటారు. ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశానికి ప్రయాణం మీ ఆనందాన్ని పెంచుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది.
సింహ రాశి
ఈ రోజు మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. వ్యాపారంలో విజయం సాధిస్తారు. చాలా కాలం పాటు అసంపూర్తిగా ఉన్న పనిని పూర్తికావడంతో మీరు సంతోషంగా ఉంటారు. అవసరమైన ఖర్చు చేయడంలో అలసత్వం వహించవచ్చు. మీ ఆధిపత్యం పెరుగుతుంది. క్రయ విక్రయాల ద్వారా లాభాలు వచ్చే సూచనలున్నాయి. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతుంది. పిల్లలతో సంతోషంగా ఉంటారు. కుటుంబ అవసరాలకు డబ్బు ఖర్చు చేయడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు. ఇంటికి అవసరమైన ఏవైనా వస్తువులు కొనుగోలు చేస్తారు.
కన్యా రాశి
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు. స్నేహితులు, ప్రియమైన వారితో ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది. మతపరమైన పనులపై బయటకు వెళ్లవలసి రావచ్చు. సామాజిక సేవలో డబ్బు ఖర్చు చేస్తారు. తోబుట్టువుల నుంచి ప్రయోజనం ఉంటుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగులకు ఈరోజు మంచి రోజు అవుతుంది.
Also Read: రియల్ మాహిష్మతిని జయించిన వీరుడి జయంతి ఈ నెలలోనే, ఎప్పుడో తెలుసా?
తులా రాశి
ఈరోజు ఏ కొత్త పనిని ప్రారంభించవద్దు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రువుల నుంచి నష్టం ఉంటుంది. ఎవరినీ విమర్శించవద్దు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆధ్యాత్మిక విషయాల పట్ల మొగ్గు ఉంటుంది. భగవంతునిపై శ్రద్ధ పెట్టడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు కొత్తగా ఏదైనా చేయాలని భావిస్తారు. మీ కోసం సమయం కేటాయించండి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వాహన సుఖం పొందుతారు. బంధువులను కలుసుకోవడం ఆనందంగా ఉంటుంది. వింత అనుభవాలు ఎదురవుతాయి.అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి.
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు పెద్ద లాభం పొందగలుగుతారు. ఉద్యోగులు శుభవార్త వింటారు. అధికారులు మీ పని పట్ల సంతోషిస్తారు.మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. స్నేహితులతో కలిసి ఉంటే బాగుంటుంది. కుటుంబంలో ఆనందం శాంతి ఉంటుంది. మీ ప్రత్యర్థుల ఎత్తుగడలు ఏవీ మీకు వ్యతిరేకంగా విజయవంతం కావు. మీరు చేసే తప్పులను పునరావృతం చేయొద్దు. సానుకూల ఆలోచనలను కొనసాగించండి.
మకర రాశి
ఈ రోజు మీరు డైలమాలో ఉంటారు. నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోలేరు. తల్లిదండ్రులతో సమయం గడపండి.పిల్లల ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల అసంతృప్తిని భరించాల్సి వస్తుంది. డబ్బును తప్పు స్థలంలో ఖర్చు చేయవచ్చు. సన్నిహితులతో పెద్ద వివాదం ఉండొచ్చు జాగ్రత్త.
Also Read: సింహాచలంలో చందనోత్సవం ఎలా జరుగుతుందో తెలుసా!
కుంభ రాశి
సోమరితనం పెరుగుతుంది. ఆకస్మికంగా కొన్ని పనులు వాయిదా పడడంతో నిరాశ చెందుతారు. పనివిషయంలో మందకొడిగా సాగుతారు. వ్యాపారంలో లాభాల కోసం చాలా కష్టపడాలి. కుటుంబంలో విభేదాలు, సన్నిహితులతో వివాదాలు ఉండవచ్చు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల చిరాకు పెరుగుతుంది. నిద్ర పట్టదు. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. ఎవరైనా విమర్శించవచ్చు.
మీన రాశి
ఈ రోజు కొత్త పనులు ప్రారంభించగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. సంతానానికి సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యులను కలుసుకున్న తర్వాత మీరు సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో మీ లక్ష్యాలను సమయానికి పూర్తిచేస్తారు. విద్యార్థులకు మంచి రోజు.