News
News
వీడియోలు ఆటలు
X

ఏప్రిల్ 22 రాశిఫలాలు, ఈ రాశులవారిని కోపం డామినేట్ చేసేస్తుంది

Rasi Phalalu Today 22nd April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

ఏప్రిల్ 22 శనివారం రాశిఫలాలు

మేష రాశి

ఈ రాశివారికి రోజు ఉత్సాహంగా ప్రారంభమవుతుంది.  స్నేహితులు, బంధువుల రాక వల్ల ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుంది.  ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. రిలాక్స్ అయ్యే మూడ్ లో ఉంటారు. మీకున్న కొన్ని బలహీనతలను మార్చుకోవడం మంచిది.

వృషభ రాశి

ఈ రాశివారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. కోపం మిమ్మల్ని డామినేట్ చేస్తుంది. అనారోగ్య సూచనలున్నాయి. కుటుంబం, ఆర్థిక విషయాలలో ఆందోళన ఉంటుంది. ఎవరితోనైనా మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. మీరు కష్టపడినా ఫలితం లభించదు. మీ పనిని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఖర్చులు తగ్గించుకోవాలి. వేరేవారి మాటల మధ్యలోకి మీరు వెళ్లొద్దు. 

మిథున రాశి

ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీ పని తీరుకి ప్రశంసలు అందుకుంటారు. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. స్నేహితుల కారణంగా లాభపడతారు. మీ ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఇంటి మరమ్మతు పనులు ప్రారంభిస్తారు. దంపతుల మధ్య సంతోషం పెరుగుతుంది.

Also Read: అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా కొనాల్సిన 10 వస్తువులు

కర్కాటక రాశి

ఈ రోజు సమయం మరియు డబ్బు రెండూ అధికంగా ఖర్చు చేస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనిని పూర్తి చేయడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కుటుంబంలో శాంతి, ఆనంద వాతావరణం ఉంటుంది. ప్రభుత్వ పనుల్లో లాభాలు పొందగలుగుతారు. మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. ఈ రోజున మీరు మీ పనులన్నింటినీ పూర్తి చేయగలుగుతారు.

సింహ రాశి

ఈ రోజు మీకు ఏ పని చేయాలనే భావన ఉండదు. వివాదాల వల్ల సన్నిహితులపై కోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారం లేదా ఉద్యోగంలో ఇబ్బంది ఉంటుంది. ఆశించిన ఫలితాలు రావు. మతపరమైన ప్రదేశాన్ని సందర్శిస్తారు. ప్రభుత్వ పనులకు ఆటంకాలు కలుగుతాయి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో సందేహం నెలకొంది. వైవాహిక జీవితంలో ఒత్తిడి ఉంటుంది

కన్యా రాశి

ఈరోజు కొత్త బాధ్యతలు తీసుకోవద్దు. మీ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వ్యాపారులకు రోజు సాధారణంగా ఉంటుంది. బయటి ఆహారం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలంటే మౌనంగా ఉండటమే సరైనది. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. రహస్య శత్రువులు మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావచ్చు.

Also Read: అక్షయ తృతీయ ఎప్పుడు (ఏప్రిల్ 22 or ఏప్రిల్ 23) జరుపుకోవాలి, ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి!

తులా రాశి 

ఈ రోజంతా సరదాగా ఉంటాకు. మీకు గౌరవం లభిస్తుంది కీర్తి పెరుగుతుంది. వ్యాపారంలో పురోగమించే రోజు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. అందమైన దుస్తులు లేదా ఆభరణాల కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. స్నేహితులతో కలిసి విందులో పాల్గొంటారు.

వృశ్చిక రాశి 

ఈ రోజు మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ శరీరాన్ని మరియు మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుంది. చేయాలనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగంలో తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది....మీ లక్ష్యాన్ని సులభంగా పూర్తి చేస్తారు. ప్రత్యర్థులు, శత్రువుల కుయుక్తులు ఫలించవు. బంధువర్గం నుంచి ప్రయోజనం ఉంటుంది. ఆకస్మికంగా ఏదో ఒక పనిలో డబ్బు ఖర్చు అవుతుంది. ఈరోజు పెట్టుబడి విషయంలో ఒత్తిడికి గురికాకండి. మీరు మీ కెరీర్‌కు సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించుకోవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ధనుస్సు రాశి 

ఈ రోజు మీరు సంయమనం పాటించాలి. ఉదర సంబంధమైన జబ్బుల వల్ల సమస్యలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఏ పనిలోనైనా విజయం సాధించలేకపోవడం నిరాశకు దారితీస్తుంది. సాహిత్యం లేదా మరేదైనా సృజనాత్మక పని మీద ఆసక్తి పెరుగుతుంది. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేయండి. ఉద్యోగులు ఈరోజు తమ పనిని మాత్రమే పట్టించుకోవాలి. పనికిరాని వాదనలలో సమయాన్ని వృథా చేయకండి.

మకర రాశి

ఈరోజు మీ ఆరోగ్యం బాగా ఉండదు. కుటుంబంలో కలహాల వాతావరణం ఉంటుంది. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. మీ విషయంలో ప్రతికూలత పెరుగుతుంది. రోజంతా ఆందోళనగా ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికీ హామీలు ఇవ్వకండి. 

కుంభ రాశి

ఈ రోజు ఆర్థికపరమైన ఆందోళనలు తగ్గుతాయి. మానసికంగా సంతోషాన్ని అనుభవిస్తారు. శారీరకంగా బాగుంటుంది. వాతావరణం ఆనందంగా ఉంటుంది. లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు.

మీన రాశి 

ఈ రోజు మీ మాటల విషయంలో సంయమనం పాటించండి. వివాదాలకు అవకాశం ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆర్థిక  లావాదేవీలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం క్షీణించవచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. తొందరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. మీ పనుల పట్ల అలసత్వం వహించకండి.

Published at : 22 Apr 2023 05:32 AM (IST) Tags: Astrology rasi phalalu Horoscope Today Aaj Ka Rashifal Today Rasiphalalu astrological prediction today 20th APril Horoscope Horoscope for 22nd April 22nd April Astrology

సంబంధిత కథనాలు

Laxmi Yog:ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం

Laxmi Yog:ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం

Ganga Dussehra 2023: పది రకాల పాపాలను తొలగించే రోజు దశపాపహర దశమి ప్రత్యేకత ఇదే!

Ganga Dussehra 2023: పది రకాల పాపాలను తొలగించే రోజు  దశపాపహర దశమి ప్రత్యేకత ఇదే!

మే 30 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశివారు ఎవర్నీ అతిగా నమ్మొద్దు

మే 30 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశివారు ఎవర్నీ అతిగా నమ్మొద్దు

మే 29 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు

మే 29 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు

Weekly Horoscope 29 May to 04 June: జూన్ మొదటివారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!

Weekly Horoscope 29 May to 04 June:  జూన్ మొదటివారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!

టాప్ స్టోరీస్

AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

AP Cabinet Meeting :  ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

NBK 108 Movie Title : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ 'బ్రో' కాదు - బర్త్ డే గిఫ్ట్ రెడీ!

NBK 108 Movie Title : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ 'బ్రో' కాదు - బర్త్ డే గిఫ్ట్ రెడీ!

Andhra Politics : వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

Andhra Politics :  వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?