News
News
X

Horoscope Today 21st September 2022: ఈ రాశివారికి స్నేహితుల ముసుగులో శత్రువులున్నారు అప్రమత్తంగా ఉండండి, సెప్టెంబరు 21 రాశిఫలాలు

Horoscope Today 21 September : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 

Horoscope 21 September 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేషం 
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. చట్టపరమైన పనిలో విజయం సాధించడం వల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఆస్తి సంబంధిత వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. కుటుంబంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయండి.

వృషభం
వృషభ రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కళారంగంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు మంచి రోజు. గతంలో తీసుకున్న అప్పులు చెల్లించేందుకు ప్రయత్నిస్తారు. తలపెట్టిన పనులు సక్సెస్ అవుతాయి. మీ బాధ్యతలు పూర్తిస్థాయిలో నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

మిథునం
మీ విశ్వాసానికి ఫుల్ మార్కులు పడతాయి. కుటుంబంలో కొనసాగుతున్న విభేదాల కారణంగా విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేరు. ఈ రోజు మీ స్నేహితులని కలవడం వల్ల మీ మనస్సు సంతోషంగా ఉంటుంది.కోపం తగ్గించుకోండి లేదంటే బంధాల మధ్య చీలకలు వస్తాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. 

Also Read: ఈ 5 రాశులవారు లైఫ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు

కర్కాటకం
ఈ రోజు మీ రంగంలో మీకు కొంత గందరగోళంగా ఉంటుంది. స్నేహితుల ముసుగులో శత్రువులున్నారు అప్రమత్తం అవండి.   ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే అజాగ్రత్తగా ఉండకండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు ఈ రోజు స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం పొందుతారు. మీ కుటుంబ  సభ్యులతో ఉన్న వివాదాలు పరిష్కరించుకోండి.

సింహం
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. గృహ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటే, ఈ రోజు మీరు వారి కోసం చర్చిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరు మీకు ఈ రోజు అబద్ధం చెబుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రోజు మీరు మీ సోమరితనాన్ని విడిచిపెట్టి పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి.

కన్య 
ఈ రోజు  గృహ వివాదాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెరుగుతున్న ఖర్చుల గురించి మీరు ఆందోళన చెందుతారు. నూతన పెట్టుబడులకు ఈ రోజు మంచి రోజు. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లయితే తీసేసుకోండి. 

తులా
ఈ రోజు మీకు మిశ్రమ రోజుగా ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తును సజావుగా మార్చేందుకు కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వ్యక్తులు ఈ రోజు ప్రయోజనం పొందుతారు. సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తులు ఈరోజు తమ కష్టార్జితంతో మంచి స్థానాన్ని పొందగలరు. నూతన పెట్టుబడులకు ఇది మంచి సమయం.

వృశ్చికం
ఈ రోజు ఆరంభం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. గత కొంతకాలంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయి. నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి. వ్యాపారులకు అవసరానికి డబ్బు చేతికందుతుంది. పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే పూర్తిస్థాయి సమాచారం తీసుకున్న తర్వాతే పెట్టండి. విద్యార్థులు ఈ రోజు చదువులో సమస్యల వల్ల ఇబ్బంది పడతారు.

Also Read: ఎంగిలిపూల బతుకమ్మ అని ఎందుకంటారు, బతుకమ్మలకు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి

ధనుస్సు 
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది..రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు పనిలో వేగం కొనసాగించాలి..లేదంటే ప్రమోషన్ కు ఆటంకాలు తప్పవు.  కుటుంబ సభ్యులు ఈరోజు టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ మాటల్లో మాధుర్యం తగ్గకుండా చూసుకోండి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఓపిక పట్టడం మంచిది.

మకరం
ఈ రోజు మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. మనశ్శాంతిగా ఫీలవుతారు. ఆగిపోయిన పనులు సులభంగా పూర్తవుతాయి. వ్యాపారులు, ఉద్యోగులు లాభాలు పొందుతారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలసమయం. ఈ రోజు మీ మనస్సు ఆధ్యాత్మికంవైపు మళ్లుతుంది. మీ తండ్రి సలహా మేరకు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది.

కుంభం 
ఈ రోజు మీకు మిగిలిన రోజుల కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎవ్వర్నీ నమ్మకండి...మీ నమ్మకాన్ని ఆ వ్యక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులకు గౌరవం పెరుగుతుంది.  ఆరోగ్యంలో  చిన్న సమస్యలు ఉంటే ఈ రోజు మీరు వాటి నుంచి బయటపడతారు..దాని కారణంగా మీ మనస్సు సంతోష పడుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశం వస్తుంది.

మీనం
ఈ రోజు మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం నిర్వహించాలని ప్రణాళికలు వేస్తారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఎగుమతి-దిగుమతి వ్యాపారం చేసేవారు ప్రయోజనం పొందుతారు. కార్యాలయంలో కొన్ని అడ్డంకులు ఉంటే, అవి కూడా తొలగిపోతాయి. మీ సమస్యలను అధికారులతో కూడా మాట్లాడవచ్చు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. 

Published at : 21 Sep 2022 05:20 AM (IST) Tags: Weekly Horoscope september 2022 horoscope today's horoscope 21St september 2022 21St september 2022 horoscope

సంబంధిత కథనాలు

Dussehra Ravan Dahan 2022: దసరా రోజు రావణదహన వేడుకలు ఎందుకు చేస్తారు, దశకంఠుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!

Dussehra Ravan Dahan 2022: దసరా రోజు రావణదహన వేడుకలు ఎందుకు చేస్తారు, దశకంఠుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!

Mahishasura Mardhini Stotram : మహిషాసుర మర్ధిని స్తోత్రం ఎందుకంత పవర్ ఫుల్ తెలుసా!

Mahishasura Mardhini Stotram : మహిషాసుర మర్ధిని స్తోత్రం ఎందుకంత పవర్ ఫుల్ తెలుసా!

Horoscope Today 4th October 2022: ఈ రాశులవారికి విజయం, అభయం - అక్టోబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th  October 2022:  ఈ రాశులవారికి విజయం, అభయం - అక్టోబరు 4 రాశిఫలాలు

Dussehra 2022: నవరాత్రుల్లో ఆఖరి రోజు సకలసిద్ధులనూ ప్రసాదించే సిద్దిధాత్రి దుర్గ

Dussehra 2022: నవరాత్రుల్లో ఆఖరి రోజు సకలసిద్ధులనూ ప్రసాదించే సిద్దిధాత్రి దుర్గ

Horoscope Today 3rd October 2022: ఈ రాశులవారికి దుర్గాష్టమి రోజు కష్టాలు తీరిపోతాయి, అక్టోబరు 3 రాశిఫలాలు

Horoscope Today 3rd October 2022: ఈ రాశులవారికి దుర్గాష్టమి రోజు కష్టాలు తీరిపోతాయి, అక్టోబరు 3 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana :  రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం  - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

In Pics: బ్రహ్మోత్సవాల్లో మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు, భక్తిశ్రద్ధలతో లాగిన భక్తులు

In Pics: బ్రహ్మోత్సవాల్లో మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు, భక్తిశ్రద్ధలతో లాగిన భక్తులు