మార్చి 20 రాశిఫలాలు, ఈ రాశివారు ఇతరుల ఆలోచనల ప్రభావానికి లోనుకావొద్దు - మీ మనసు చెప్పింది ఫాలో అవండి
Rasi Phalalu Today 20th March, 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మేష రాశి
ఈ రోజు మీరు మీ నిర్ణయాలపై దృఢంగా ఉండాలి. ఇతరుల ఆలోచనల ప్రభావానికి లోనవకండి. మీ మనసు చెప్పింది వినడం మంచిది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. మీరు స్నేహితులతో టైమ్ స్పెండ్ చేస్తారు.
వృషభ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. పనిపై దృష్టి సారిస్తారు అంతలోనే పరధ్యానంలో ఉంటారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి ఉంటుంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం క్షీణించవచ్చు
మిథున రాశి
ఈ రోజు మీరు ప్రత్యేక పనిలో అనుభవజ్ఞుల నుంచి సహాయం పొందుతారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. జరిగిపోయిన విషయాలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టొద్దు. మీరు ఈ రోజు లావాదేవీలు చేయకుండా ఉండడమే మంచిది.
Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి మహోన్నత యోగం, ఇంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు!
కర్కాటక రాశి
పని ఒత్తిడి పెరుగుతుంది. ఇంటికి అతిథులు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులకు చెక్ పెట్టండి. శనిదేవుని అనుగ్రహంతో అకస్మాత్తుగా పెద్ద ప్రయోజనం పొందవచ్చు.
సింహ రాశి
ఈ రోజు మీకు సాధారణమైన రోజు. ఆరోగ్యం జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త..ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు తమ పనులపై తాము శ్రద్ధ పెట్టడం మంచిది. విద్యార్థులు చదువుపైనుంచి దృష్టి మరల్చొద్దు.
కన్యా రాశి
ఈ రోజు విద్యార్థుల కెరీర్‌లో కొత్త మార్పు ఉంటుంది...ఇది వారి భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీడియా రంగంలో పనిచేసే ఈ రాశివారు ఈ రోజు ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
Also Read: ఈ రాశివారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఆరంభం అంతంతమాత్రం - ద్వితీయార్థం సరిలేరు మీకెవ్వరు!
తులా రాశి
తులా రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎవరితో ఆర్థిక లావాదేవీలు చేస్తున్నారో జాగ్రత్తగా ఉండండి. సంతోషకరమైన జీవితానికి సంబంధించిన సూచనలు కనిపిస్తున్నాయి..ఆ దిశగా అడుగేయండి. నిన్న మొన్నటి వరకూ వెంటాడిన కష్టాలన్నీ తొలగిపోతాయి
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీరు కుటుంబంపై పూర్తి శ్రద్ధ చూపుతారు. పిల్లలతో సమయం గడపాలని కోరుకుంటారు.ప్రేమ జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీ ప్రియమైనవారి మానసిక స్థితి సరిగా ఉండకపోవడంతో మీరు కొంత ఇబ్బంది పడతారు.
ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశివారు తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశాలన్నాయి. మీకు అదృష్టం కలిసొస్తుంది. మీ పనితీరుతో ఇంటిపెద్దలను ఆకట్టుకుంటారు.
మకర రాశి
ఈ రోజు విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు కొంచెం కష్టపడాల్సి రావచ్చు. అయితే ఈ కష్టానికి వారు ఆశించిన ఫలితాన్ని కూడా పొందుతారు. కొత్త పనులను విజయవంతంగా నిర్వహించగలుగుతారు. ప్రేమ విషయంలో కుటుంబ సభ్యులతో కలహాలు రావచ్చు.
కుంభ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఏ పని చేసినా విజయవంతం అయ్యేలా కృషి చేస్తారు. ఆదాయం పెరగడం వల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది. పని భారం మీపై ఉండదు
మీన రాశి
ఈ రోజు మీరు కుటుంబ విషయాలకు సంబంధించి కొంత హడావుడి పడతారు. కార్యాలయంలో పనులు నిదానంగా పూర్తవుతాయి. ఏదో విషయంలో తోడబుట్టినవారితో తగాదాలుంటాయి. వివాదాల్లో చిక్కుకోకుండా ఉండేలా జాగ్రత్తపడండి.