ఏప్రిల్ 20 రాశిఫలాలు, ఈ రాశివారు కొన్ని విషయాల్లో అయినా గోప్యత పాటించాలి!
Rasi Phalalu Today 20th April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
ఏప్రిల్ 20 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు ఈ రాశివారు వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకునేందుకు మంచిరోజు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అందర్నీ కలుపుకుని వెళ్తే మీరు సక్సెస్ అవుతారు.చాలా కాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుంచి కొంతవరకూ రిలీఫ్ ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆస్తులకు సంబంధించిన విషయాలపై ఈరోజు చర్చలు పెట్టుకోవద్దు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మంచిరోజు.
వృషభ రాశి
ఈ రాశివారు ఈరోజు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు తమ వ్యాపారంలో కొన్ని స్మార్ట్ పాలసీలు తీసుకోవచ్చు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా ఓపికగా వ్యవహరిస్తే మంచిది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనిని ఈరోజు పూర్తిచేయవచ్చు. విదేశాలలో నివసిస్తున్న కుటుంబ సభ్యుల నుంచి కొంత సమాచారం వింటారు. బంధువుల నుంచి మద్దతు పుష్కలంగా లభిస్తుంది. మీరు మీ ఆదాయానికి - ఖర్చులకు మధ్య సమతుల్యతను కాపాడుకోవడం మంచిది. పెరుగుతున్న ఖర్చులను నియంత్రించగలుగుతారు.
మిథున రాశి
ఈ రోజు మీరు ఒక పెద్ద లక్ష్యాన్ని నెరవేర్చుకోవాల్సిన రోజు..ఆ దిశగా శ్రమించండి. మీలో ప్రతిభ బయటకు వస్తుంది. మీరు కొన్ని సందర్భాల్లో గోప్యత పాటించాలి. కొంతమంది కొత్త వ్యక్తులను కలుస్తారు. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనిని పూర్తిచేసేందుకు అడుగుపడుతుంది. విద్యార్థులు ఉన్నత విద్యలో ఎదురయ్యే సమస్యల గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. ఆరోగ్యం బావుంటుంది.
Also Read: ఏప్రిల్ 20న సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది, హైబ్రిడ్ సూర్యగ్రహణం అంటున్నారెందుకు!
కర్కాటక రాశి
ఈ రోజు మీ నిర్ణయాధికారం వల్ల పూర్తి ప్రయోజనం పొందుతారు. సామాజిక రంగాలలో పనిచేసే వారికి ఈ రోజు పెద్ద పదవి దక్కడం సంతోషంగా ఉంటుంది. మీవ్యాపార ప్రణాళికలు ఆలోచించి వేస్తే వాటివల్ల లాభాలు పొందుతారు. న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగుల ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఏదో ఒక చర్చ ఉంటుంది. మీ ప్రవర్తనను అంతా మెచ్చుకుంటారు.
సింహ రాశి
ఈ రోజు ఈ రాశి నిరుద్యోగుల కల ఫలిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. ధార్మిక పనులపై మీ విశ్వాసం మరింత పెరుగుతుంది. మీ పాత తప్పులపై చర్చ జరుగుతుంది. వ్యాపారులు ఆలోచించి అడుగేయడం మంచిది. మీ పలుకుబడి, కీర్తి పెరుగుతుంది.
కన్యా రాశి
ఈ రోజు ఈ రాశివారు అన్ని విషయాల్లో దూసుకుపోతారు. సలహాలను పాటిస్తారు. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. రక్త సంబంధాలు బలపడతాయి కానీ మీరు ఒకరి తప్పును క్షమించవలసి ఉంటుంది. ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తారు. మీ దినచర్యలో మార్పులు మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి. కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం ద్వారా మీకు మంచి జరుగుతుంది.
Also Read: గంగా పుష్కరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, పుష్కరాలు ఎలా ప్రారంభమయ్యాయి!
తులా రాశి
ఈ రోజు ఈ రాశివారి వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ ప్రణాళికలను రూపొందించడంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన లక్ష్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. గ్రూపుగా పనిచేయడం వల్ల విజయం సాధిస్తారు. ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే ఈ రోజు మీకు మీ తోబుట్టువుల సహాయం అవసరం.ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య అనుబంధం బావుంటుంది. మాటపై సంయమనం పాటించండి.
వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశివారు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. మీ ప్రత్యర్థులలో కొందరు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు కానీ వారు మిమ్మల్ని దాటలేరు. దానధర్మాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు లావాదేవీల విషయంలో సందిగ్ధత పాటించండి. ఎవరినీ మోసం చేయకండి. భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలను రూపొందించడానికి ఇదే మంచి సమయం .
ధనుస్సు రాశి
గడిచిన రోజుకన్నా ఈరోజు మీకు మంచిరోజు అవుతుంది. అతిగా ఉత్సాహపడాల్సిన అవసరం లేదు...దేనికీ నిరుత్సాహం అవసరం లేదు. మీ మనసు చెప్పింది ఫాలో అయితేనే అనుకున్న పనులు పూర్తిచేయగలరు. ఉద్యోగులు ఎవ్వరినీ అతిగా విశ్వశించవద్దు. మీరు మీ తెలివితేటలు విచక్షణతో నిర్ణయం తీసుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
మకర రాశి
మీరు మీ ప్రియమైన వారి మాటలను విస్మరించకుండా ఉండాలి. విలాసవంతమైన వస్తువుల కోసం షాపింగ్ చేయవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓపికగా పనిచేస్తేనే దాని నుంచి సులువుగా బయటపడవచ్చు. మీ ఆస్తికి సంబంధించిన కొన్ని విషయాలలో వివాదం జరుగుతున్నట్లయితే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది.
కుంభ రాశి
రోజు మీకు చాలా లాభదాయకమైన రోజు. కుటుంబ సంబంధాలు బావుంటాయి.ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. మాటపై సంయమనం పాటించండి. ఉద్యోగులు, వ్యాపారులకు ఇబ్బందులు తొలగిపోతాయి. సామాజిక రంగాలలో పనిచేసే వారికి పెద్ద స్థానం లభిస్తుంది. మీ విశ్వాసం బలపడుతుంది మరియు అందరినీ కలుపుకుపోవడానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి.
మీన రాశి
ఈ రోజంతా మీరు బిజీబిజీగా ఉంటారు. పొదుపు ప్రణాళికలపై పూర్తి శ్రద్ధ వహించాలి. కుటుంబంలో అందరిని కలుపుకుపోయే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఈరోజు సన్నిహితులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి కొన్ని విలువైన వస్తువులను బహుమతిగా పొందుతారు. ఉద్యోగులకు మంచి సమయం. ఎవరి పనుల్లో జోక్యం చేసుకోకండి.