అన్వేషించండి

జూన్ 25 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశులవారు మాటలు -ప్రవర్తనలో దూకుడు తగ్గించుకోవాలి

Rasi Phalalu Today June 25th : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

జూన్ 25 రాశిఫలాలు

మేష రాశి
మృదు స్వభావం తో మెలగండి. మాటల విషయంలో సంయమనం పాటించండి. శారీరక మానసిక రుగ్మతలతో కొంచెం ఇబ్బంది పడతారు. శ్రమ కి తగిన ఫలితం దక్కదు.అయినా నిరాశ చెందకుండా ముందుకు సాగండి. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. ఉదర సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడతారు. ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రభుత్వ పనుల్లో విజయం ఉంటుంది.

వృషభ రాశి 
ఈరోజు ఆత్మవిశ్వాసంతో పని చేయగలుగుతారు. తండ్రి తరపున కానీ , పూర్వీకుల తరపున కానీ  వచ్చిన  ఆస్తితో ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వంతో ఆర్థిక వ్యవహారాలు లాభం చేకూరుస్తాయి. విద్యార్థులు తమ చదువుల్లో బాగా రాణించగలుగుతారు. కళాకారులు, క్రీడా, కారులు తమ ప్రతిభను కనబరిచే అవకాశం లభిస్తుంది. ఖర్చుతో కూడిన పనులుంటాయి. 

మిథున రాశి
కొత్త ప్రణాళికలు అమలు చేయడానికి అనుకూలమైన రోజు. ఉద్యోగస్తులుకు  అధికారులు నుంచి కానీ ,  ప్రభుత్వం నుంచి కానీ మంచి ఫలితాలు పొందుతారు., తోబుట్టువులు మరియు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. అదృష్ట వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

Also Read: ఆరుద్ర కార్తె ఆరంభం - ఎర్రటి ఈ పురుగులు కనిపిస్తే వానలు మొదలైనట్టే!

కర్కాటక రాశి 
అపార్థాలు , ప్రతికూల ప్రవర్తన, మీ మనస్సులో అపరాధ భావనను సృష్టిస్తుంది. ముఖ్యంగా నేత్ర  సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. పని విషయంలో సంతృప్తి కలుగుతుంది. ధనం ఖర్చు అవుతుంది. అనైతిక ధోరణుల వైపు వెళుతున్న  మనసును అదుపులో ఉంచుకోవాలి . విద్యార్థులు విద్యావిషయాల్లో నిర్దేశించిన విజయాన్ని అందుకోవటానికి కొన్ని ఆటంకాలుంటాయి. 

సింహ రాశి 
ఈరోజు మీరు ఏ పని విషయంలోనైనా త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తండ్రి, పెద్దల మద్దతు లభిస్తుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మీ స్వభావంలో కోపం,  మీ ప్రవర్తనలో మార్పు ఉంటుంది. దానికి చెక్ పెట్టండి. ఉదర  సంబంధిత ఇబ్బందులు ఉంటాయి. వైవాహిక జీవితంలో సామరస్యం ఉంటుంది.

కన్యా  రాశి 
ఈరోజు మీ అహంకారం వల్ల గొడవలు వచ్చే అవకాశం ఉంది.  శారీరక , మానసిక ఆందోళనతో గడుపుతారు. ప్రకృతిలో వచ్చే మార్పుల వలన మీ పనికి ఆటంకం ఏర్పడుతుంది. కుటుంబ సబ్యులతోనూ, స్నేహితులతో విభేదాలు ఉంటాయి. ధనం ఖర్చు అవుతుంది. ఆధ్యాత్మిక పనుల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. న్యాయపరమైన పనుల్లో జాగ్రత్తగా ఉండండి.

Also Read: మీరు ఈ టైమ్ లో జన్మించినట్టైతే మీ వ్యక్తిత్వం చాలా మంచిది!

తులా రాశి 
ఈరోజు శుభప్రదమైన రోజు. అన్నిటా  ప్రయోజనకరమైన రోజు. స్నేహితులతో సమావేశాల్లో కానీ విహార యాత్ర లో కానీ అందంగా గడుపుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆనందం, సంతృప్తి ఉంటుంది. ఉద్యోగ-వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. అవివాహితులకు వైవాహిక యోగం,  వైవాహిక జీవితంలో ఉత్తమమైన వైవాహిక ఆనందాన్ని పొందగలుగుతారు.

వృశ్చిక రాశి 
ఈ రోజు మీరు జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకుంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. వ్యాపారంలో మంచి అవకాశాలు ఉంటాయి.  ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ నిపుణులకు పురోగతి మార్గం స్టాట్ అవుతుంది. ఉన్నతాధికారులు, వృద్ధుల సహకారం, ప్రోత్సాహం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీరు పిల్లల నుండి సంతృప్తిని పొందుతారు. గౌరవం పెరుగుతుంది.

ధనుస్సు రాశి
ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పనిలో  ఉత్సాహం లోపిస్తుంది. మనసు ఆందోళనలోనే ఉండిపోతుంది. పిల్లల సమస్య దీనికి కారణం కావచ్చు. వ్యాపారం, ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పనిలో విజయం తక్కువగా ఉంటుంది. ప్రత్యర్థులతో, పై అధికారులతో వివాదాలకు దిగకండి.

మకర రాశి
ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ముందుకు పోనీయవు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వలన అనేక సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. భాగస్వాములతో సంబంధాలు చెడతాయి. వలస వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వాటి కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడం లాభదాయకం కాదు. ఆహార పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి, లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. పరిపాలనా  విభాగంలో  మీ నేర్పు కనిపిస్తుంది. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది.

కుంభ రాశి 
ఈరోజు సంతోషకరమైన రోజు అవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది.  కొత్త వ్యక్తులతో పరిచయం పెరగవచ్చు. విహార యాత్ర  నిర్వహిస్తారు. ప్రజా జీవితంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. రుచికరమైన ఆహారం ఆస్వాదిస్తారు.

మీన రాశి 
ఈ రోజు ఆత్మవిశ్వాసం మీ పనిని విజయవంతం చేస్తుంది. కుటుంబంలో సంతోషం, శాంతి,  వాతావరణం ఉంటుంది. కోపం కారణంగా మీ మాటలు,  ప్రవర్తన దూకుడుగా మారకుండా జాగ్రత్త వహించండి.  మీరు ఉద్యోగంలో ఆధిపత్యం చెలాయిస్తారు. ప్రత్యర్థుల ముందు విజయం సాధిస్తారు. అనారోగ్యంతో ఉన్న వారికి  ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Embed widget