News
News
X

Horoscope Today 20 September 2022: ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి, సెప్టెంబరు 20 రాశిఫలాలు

Horoscope Today 20 September : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 

Horoscope 20 September 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేషం
ఈరోజు వ్యాపారులు ఊహించినదానికన్నా ఎక్కువ లాభాలు పొందుతారు. కార్యాలయంలో మీ సీనియర్లతో మాట్లాడటం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. మీ మాటల్లో సున్నితత్వాన్ని జోడిస్తే మీ గౌరవం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలు తగ్గుతాయి.

వృషభం
ఈ రోజు మీ చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోని పార్టీ నిర్వహిస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోకుంటే అది పెద్ద వ్యాధిగా మారుతుంది. 

మిథునం
కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులకు ఈరోజు పెద్ద అవకాశం వస్తుంది. ఉద్యోగులు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో సమస్యలుంటే మరో అవకాశం వెతుక్కునేందుకు ఇదే మంచి సమయం. ఈ రోజు కార్యాలయంలో మీ శత్రువులు మీకు తప్పు సమాచారం అందించడం వల్ల మీరు తప్పుడు నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉంది. ఈ రోజు మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు.

కర్కాటకం
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. అనుకున్న పని పూర్తవుతుంది..ఆనందంగా ఉంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు కార్యాలయంలో మీ కీర్తి మరింత పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందుతారు. ఆగిపోయిన పనులు పూర్తయ్యేందుకు మీ స్నేహితులు మీకు సహాయం చేస్తారు.

సింహం
ఈ రోజు మీరు చదువు, ఆధ్యాత్మిక పనుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థిక ప్రణాళికలలో చాలా పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్ ఆందోళనలు తొలగించుకోవచ్చు.కొత్త వ్యాపారం కోసం ప్లాన్ చేసే వారికి అనుభవజ్ఞుడైన వ్యక్తి నుంచి సలహా అవసరం. మీరు ఇచ్చిన సూచనలను కుటుంబ సభ్యులు స్వాగతిస్తారు. 

కన్య 
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు..తమ వ్యాపారాన్ని మెరుగుపర్చుకునేందుకు కొత్త ఆలోచనలు చేస్తారు. గృహ జీవితంలో కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు ఈరోజు మంచి పేరు సంపాదిస్తారు. ఈ రోజు మీరు ఇంటికి కొత్త వాహనం తీసుకువస్తారు.

తుల 
ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది. ఆగిపోయిన ప్రణాళికలను పునఃప్రారంభించడం ద్వారా, వ్యాపారంలో పురోగతి ఉంటుంది, ఆర్థిక స్థితి బలపడుతుంది. మీరు కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఎవరికైనా అప్పులిస్తారు. ప్రత్యర్థుల కారణంగా కార్యాలయంలో కొంత అసౌకర్యాన్ని కలిగి ఉంటారు

వృశ్చికం
ఈ రోజు మీకు మంచి రోజు. మీ చుట్టూ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మీరు ఒకదాని తర్వాత ఒకటి మంచి వార్తలు వింటూనే ఉంటారు. పెళ్లికాని వారికి మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మీరు పిల్లల వృత్తిలో సమస్యలను అధిగమించడానికి కొంత డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. ఏవైనా వాదోపవాదాలు జరిగినప్పుడు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

Also Read: శరన్నవరాత్రుల్లో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలివి!

ధనుస్సు 
ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు.  కుటుంబంలో జరిగే కొన్ని శుభ సంఘటనల వల్ల మీ ఆనందం పెరుగుతుంది.  ఆరోగ్యంలో కొంత క్షీణత ఉంటే అది కూడా ఈ రోజు మెరుగుపడుతుంది. కార్యాలయంలో కూడా, మీరు మీ అన్ని పనులను సకాలంలో పూర్తి చేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారం చేసేవారు శుభఫలితాలు పొందుతారు. తల్లిదండ్రుల నుంచి సహాయం అందుతుంది.

మకరం
ఈ రోజు మీరు పనిచేసే రంగంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిజాయితీగా పని చేయడం వల్ల ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు.  స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బు పెట్టుబడి పెట్టేవారు వారు ఈ రోజు మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలోని వ్యక్తుల సహకారంతో మీ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ఈ రోజు మీరు స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

కుంభం 
ఈ రోజు మీరు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు పెరుగడం మీకు సమస్యగా మారుతుంది. టెన్షన్ పడేకన్నా ఖర్చులు ఎలా తగ్గించాలో ప్రణాళిక వేసుకోవడం మంచిది. మీ రంగంలో కొంత నష్టాన్ని చవిచూడాల్సి రావచ్చు. కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు. 

మీనం
ఈ రోజు మీకు కొంత ఒత్తిడి ఉంటుంది... ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు కార్యాలయంలో కొంత అసౌకర్యాన్ని ఫీలవుతారు.  కొత్త ఆదాయ వనరులను పొందుతారు కానీ మీ కోపం ప్రభావం మీ పనులపై పడుతుంది. జీవిత భాగస్వామితో వివాదం పెట్టుకోవద్దు.

------------

Published at : 20 Sep 2022 05:09 AM (IST) Tags: Weekly Horoscope september 2022 horoscope 20th september 2022 horoscope today's horoscope 20th september 2022

సంబంధిత కథనాలు

Horoscope Today 25th September 2022:  ఈ రాశివారికి గుడ్ డే అయినప్పటికీ ఏదో నిరాశతో ఉంటారు,సెప్టెంబరు 25 రాశిఫలాలు

Horoscope Today 25th September 2022: ఈ రాశివారికి గుడ్ డే అయినప్పటికీ ఏదో నిరాశతో ఉంటారు,సెప్టెంబరు 25 రాశిఫలాలు

Zodiac Signs: జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి

Zodiac Signs:  జీవిత భాగస్వామితో గొడవలు రాకుండా ఉండాలంటే మీ రాశి ప్రకారం ఇలా చేయండి

Dussehra 2022: దసరాల్లో పిల్లలకు పూజ చేస్తుంటారు కదా - ఏ వయసు పిల్లల్ని పూజిస్తే ఎలాంటి ఫలితం!

Dussehra 2022: దసరాల్లో పిల్లలకు పూజ చేస్తుంటారు కదా - ఏ వయసు పిల్లల్ని పూజిస్తే ఎలాంటి ఫలితం!

Dussehra 2022: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారం రోజు ఏ నైవేద్యం సమర్పించాలి!

Dussehra 2022: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారం రోజు ఏ నైవేద్యం సమర్పించాలి!

Horoscope Today 24th September 2022: ఈ రాశివారికి స్నేహితుల నుంచి ధనసహాయం అందుతుంది, సెప్టెంబరు 24 రాశిఫలాలు

Horoscope Today 24th September 2022:  ఈ రాశివారికి స్నేహితుల నుంచి ధనసహాయం అందుతుంది, సెప్టెంబరు 24 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?