By: ABP Desam | Updated at : 18 Jan 2023 06:16 AM (IST)
Edited By: RamaLakshmibai
Horoscope Today 18th January 2023 (Image Credit: freepik)
18th January 2023 Horoscope Today: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశివారు ఈ రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. ఏదైనా కొత్త లేదా ప్రణాళికకు మంచి రోజు. కొత్తగా ఏదైనా ట్రై చేయండి. ఓ శుభవార్త వింటారు. ఇల్లు-కార్యాలయం మధ్య సమన్వయం సృష్టించగలుగుతారు. వ్యాపారంలో లాభాలకు అవకాశంఉంది.
వృషభ రాశి
ఈ రోజు మీకు చాలా సంతోషకరమైన రోజు. మానసికంగా బావుంటారు. కొన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. తలపెట్టిన పనిలో చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి. ఉద్యోగులు పనిపై పూర్తిస్థాయి శ్రద్ధ పెట్టాలి.
మిథున రాశి
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఇంట్లోకి వస్తూనే ఉంటారు. ఈ రాశి విద్యార్థులు వృత్తిలో సానుకూల ఫలితాలను పొందుతారు. ఇతరులకు సహాయం చేసే అవకాశం లభిస్తుంది. వినాయకుడికి హారతి ఇస్తే అందరితో సంబంధాలు మెరుగవుతాయి.
Also Read: ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడొచ్చింది, సూర్యుడిని ఎందుకు ఆరాధించాలి
కర్కాటక రాశి
ఈ రోజు మనస్సులో అధిక ఆలోచనల కారణంగా కొంత అలజడి ఏర్పడుతుంది. మీరు మర్చిపోయిన పాత లావాదేవీల నుంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో తండ్రి నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. మీ సన్నిహిత మిత్రుడి సహాయం ప్రయోజనకరమైన ఒప్పందం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది.
సింహ రాశి
మీ పాత పనిని సెటిల్ చేసుకోవడానికి ఈ రోజు మంచి రోజు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. పని పరంగా మెరుగ్గా ఉంటుంది . వ్యాపారులు లాభాలు పొందుతారు.
కన్యా రాశి
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు. ఆగిపోయిన పనిలో స్నేహితుడి సహకారం లభిస్తుంది. కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. కొన్ని కొత్త ఆలోచనలు మీ మదిలోకి వస్తాయి. సూర్యభగవానుడికి నీటిని సమర్పించడం వల్ల జీవితంలో ఇతరుల మద్దతు లభిస్తుంది.
తులా రాశి
మీ చుట్టూ కొన్ని సానుకూల మార్పులు మీ జీవితాన్ని మెరుగుపరుస్తాయి. కొంతమంది కొత్త వ్యక్తులు మీతో కలసి పనిచేస్తారు. కొత్తగా ఏదైనా పని ప్రారంభించాలనే కోరిక ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది..ధైర్యంగా ముందుకు సాగాలి. కష్టపడి పనిచేయండి. కుటుంబం నుంచి పూర్తి మద్దతు మీకు ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉంటారు. ప్రేమికులకు అనుకూలమైన రోజు.
ధనుస్సు రాశి
ఈ రోజు మీకు చాలా మంచి రోజు. స్నేహితులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
మకర రాశి
ఈ రాశివిద్యార్థులు చదువులో మెరుగైన ఫిలితాలు పొందుతారు. లావాదేవీల్లో తొందరపాటు తగదు. విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోండి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రోజు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచండి. మీరు పనిచేసే విధానాన్ని మార్చుకోండి, అంతా బాగుంటుంది.
Also Read: దశాబ్దాల తర్వాత కలసిన శుక్రుడు-శని, ఈ నాలుగు రాశులవారి జీవితంలో ఊహించని మార్పులు
కుంభ రాశి
పనులు పూర్తవ్వాలంటే మీరు కాన్సన్ ట్రేట్ చేయాలి. తొందరపడండి లేదంటే పని వాయిదా పడుతూనే ఉంటుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి ఆశ ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ జీవితంలో కొంత టెన్షన్ ఉంటుంది, కానీ ప్రేమ జీవితంలో ఉన్నవారు ఈ రోజు సౌకర్యవంతంగా ఉంటారు.
మీన రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. మీరు ఒక నిర్దిష్ట వ్యక్తి నుంచి పెద్ద ప్రయోజనాన్ని పొందవచ్చు. ఉద్యోగులు మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఏ పని మొదలు పెట్టినా సకాలంలో పూర్తిచేస్తారు.
Christmas Celebrations 2023: క్రిస్మస్ వేడుకలలో ఈ రంగులు చాలా ప్రత్యేకం - ఎందుకంటే!
Chanakya's 31 Member Cabinet: చాణక్యుడి హయాంలో 31 మంది మంత్రులు - వారి శాఖలు ఇవే!
Chanakya Niti In Telugu: చాణక్య నీతి: ఈ ముగ్గురికి ఎప్పుడూ సహాయం చేయకూడదు!
Astrology: ఈ రాశులవారు రహస్యాన్ని రహస్యంగా ఉంచలేరు!
Daily Horoscope Today Dec 7, 2023 : మీ జీవిత భాగస్వామి మాటలను తేలికగా తీసుకోకండి, డిసెంబర్ 7, 2023 రాశిఫలాలు
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
New Officers in Tealngana: కొత్త ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి.శివధర్ రెడ్డి - సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి
revanth reddy take oath as telangana cm : మేం పాలకులం కాదు మీ సేవకులం - ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం
/body>