మే 18 రాశిఫలాలు, ఈ రాశుల వారికి ఆర్థిక పురోభివృద్ధి!
Rasi Phalalu Today 18th May: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మే 18 రాశిపలాలు
మేష రాశి
అనుకోని ప్రమాదాలు వల్ల కొంత నష్టం కలుగుతుంది . ఏ పనిలోనూ తొందరపడకండి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి . తలపెట్టిన పనులు సక్రమంగా పూర్తికావు. కుటుంబ సభ్యులతో వివాదాలు రావచ్చు. ఖర్చులు తక్కువ ,ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగులు నుంచి నిరసనలు వ్యక్తం అవుతాయి. ఆపదలు పొంచి ఉన్నాయి అప్రమత్తం గా ఉండండి . కాస్త ఓరిమితో వ్యవహరించండి.
వృషభ రాశి
ఆర్థిక పురోభివృద్ధి. ఉద్యోగంలో ప్రశాంతత ఉంటుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి, ఎవరికీ సలహాలు ఇవ్వకండి. ఆనందంగా గడుపుతారు. ఇతరులు ఎదో చేస్తారని ఆశించవద్దు, మీరు చేసిన దానికి ప్రతిఫలం ఆశించకండి. కుటుంబం లో కొన్ని చికాకులు, తెలియని ఆందోళన . భయం భయంగా ఉంటుంది. శత్రువులు వల్ల హాని . ప్రయత్నిస్తే వ్యాపారం లాభసాటిగా ఉంటుంది.
మిధున రాశి
కాంట్రాక్టర్ లకు అనుకూల సమయం. ఆదాయం బాగుంటుంది. మంచి లాభాలు గడిస్తారు. ప్రగతి పథం వైపు అడుగులు వేస్తారు. ఉపాధి కోసం చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు బాగా రాబడి ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. కలిసి పని చేసేవారి మద్దతు లభిస్తుంది. రుణ భాధలు తొలగుతాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. చురుకుగా ఉంటారు . పెట్టుబడులకు శుభప్రదంగా ఉంటుంది.
కర్కాటక రాశి
ఆర్ధిక లావాదేవీలు విజయవంతమవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శత్రు జయం. వ్యాపారం బాగా అభివృద్ధి లోకి వస్తుంది . పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. విలువైన వస్తువులను భద్రంగా ఉంచండి. మాటల విషయంలో సంయమనం పాటించండి. అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆనందంగా ఉంటారు.
సింహ రాశి
మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కొన్ని విచారకరమైన వార్తలు వైన్ అవకాశం ఉంది . ఆశించిన పనులు కొన్ని ఆటంకాల వల్ల సకాలంలో నెరవేరవు. భాగస్వాములతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో వేగం మందగిస్తుంది. ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. ఇతరుల పనిలో జోక్యం చేసుకోవద్దు. సలహా ఇవ్వడం మానుకోండి. ప్రమాదకర పనులు చేయవద్దు. చెడు వ్యక్తులు హాని కలిగించవచ్చు.
Also Read: శుక్రుడు-కుజుడి సంచారం ఈ 4రాశులవారికి అస్సలు బాలేదు!
కన్యా రాశి
శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. గౌరవం దక్కుతుంది. పెట్టుబడులు శుభప్రదంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. కొత్త పనులు చేయాలనే కోరిక ఉంటుంది. ఆనందంగా ఉంటారు. కుటుంబ సహాయ సహకారాలు ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రమాదకర పనులు అస్సలు చేయకండి.
తులా రాశి
విలువైన సమాచారం అందుతుంది. అనవసర ఖర్చులుంటాయి . పాత సహోద్యోగులను కలుస్తారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పెట్టుబడి శుభప్రదంగా ఉంటుంది. శత్రువులు ఓడిపోతారు. పనిని వాయిదా వేయవద్దు. సోమరితనం విడిచి చలాకీగా ఉండండి .
వృశ్చిక రాశి
జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. బహుమతులు అందుకుంటారు. ప్రయాణాలు సౌఖ్యంగా, సజావుగా సాగుతాయి . ఉద్యోగస్తులకు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ సూచనలున్నాయి.పెద్ద పెద్ద సమస్యలు ఓ కొలిక్కి వొచ్చి పరిష్కారమవుతాయి. ఆనందం గా ఉంటారు. ఒత్తిడి తగ్గుతుంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ సలహాలు ఇవ్వకండి.. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
ధనుస్సు రాశి
ప్రయాణాలలో ఖర్చు లు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ పనులను శ్రద్దగా చేయండి. విజ్ఞతతో మెలగండి. ఆశించిన స్థాయిలో లాభాలు ఉండవు . ఉద్యోగస్తులకు పనిభారం ఉంటుంది. కారణం లేకుండా ఎవరితోనైనా గొడవలు జరగవచ్చు. తోటి ఉద్యోగులతో సరదాగా గడుపుతారు.
మకర రాశి
పాత బాకీలు వసూలు అవుతాయి . కొత్తగా చేపట్టిన పనులు వల్ల లాభం చేకూరుతుంది. బంధువులతో సమావేశాలు వల్ల ఆర్ధిక లాభాలు. సమస్యలను ఎదుర్కోవచ్చు. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. భాగస్వాముల మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రశాంతత ఉంటుంది. వ్యాపారంలో ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంటుంది. సన్నిహితుల ప్రవర్తన బాధిస్తుంది. చట్టపరమైన అడ్డంకులు ఉండవచ్చు.
Also Read: రోజూ ఈ 4 నియమాలు పాటిస్తే మోక్షం పొందుతారు!
కుంభ రాశి
సమాజం లో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. ప్రణాళిక లు విజయవంతం అవుతాయి. సమస్యల పరిష్కారానికి అనుకూలమైన సమయం. ఆనందం గా గడుపుతారు. అనుకున్నది సాదించటానికి గట్టిగా ప్రయత్నము చేయాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. భౌతిక వనరుల పెరుగుదల ఉంటుంది. విందు వినోదాలకు ఖర్చు చేస్తారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
మీన రాశి
ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి . తంత్ర-మంత్రాలపై ఆసక్తి పెరుగుతుంది. దైవ భక్తి వలన ప్రయోజనం పొందుతారు. షేర్ మార్కెట్ లో పెట్టుబడులకు అనుకూలం . ఇంటా బయట వివాదాలు ఉంటాయి. వ్యాపారాభివృద్ది . అదృష్టం మీ వెంటే ఉంటుంది. కొంత అనారోగ్య సూచనలున్నాయి. అనవసర పనులకు సమయాన్ని వెచ్చించకండి.