అన్వేషించండి

రాశిఫలాలు (18/05/2024) ఈ రాశులవారు ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధి సాధిస్తారు

Daily Horoscope: మే 18న ఏ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి...ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...

Daily Horoscope -  రాశిఫలాలు (18-05-2024)

మేష రాశి
ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఊహించని ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపారం బాగానే సాగుతుంది.  ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. భాగస్వామితో మానసిక బంధం బలంగా ఉంటుంది. 

వృషభ రాశి
ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. సంబంధాలలో పరస్పర అవగాహన  ఉంటుంది. కుటుంబ సమేతంగా సెలవులను ఎంజాయ్ చేస్తారు. ఇంటికి అతిధుల రాక వల్ల సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ప్రారంభమవుతాయి. వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి.  వైవాహిక జీవితం బావుంటుంది. భాగస్వామికోసం అన్వేషణలో ఉన్నవారి నిరీక్షణ ఫలిస్తుంది. 

మిథున రాశి
మిథున రాశివారు ఈ రోజు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు. మీరు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అవకాశం ఉంటుంది. పాత ఆస్తులను అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. వృత్తి జీవితంలో మీ కృషి అంకితభావం మంచి ఫలితాలను ఇస్తాయి.  జీవితంలో పూర్తి శక్తి   ఉంటుంది. పనిలో ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. 

కర్కాటక రాశి
కెరీర్‌లో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. జీవితంలో కొత్త అనుభవాలను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. ఆస్తి కొనుగోలు లేదా అమ్మకానికి ఈ రోజు మంచి రోజు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. జీవిత భాగస్వామికి సమయం కేటాయించండి. 

సింహ రాశి
ఈ రోజు సింహరాశి వ్యక్తుల జీవితాల్లో ముఖ్యమైన మార్పులు ఉంటాయి. ఉద్యోగులు సీనియర్ల సలహాలతో పనులు పూర్తిచేసుకుంటారు. సీనియర్ల సలహాతో పనిలో సవాళ్లను నిర్వహించడంలో విజయం సాధిస్తారు.  ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత , వృత్తి జీవితంలో ఎదుగుదలకు  మంచి అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితం బావుంటుంది

కన్యా రాశి
ఈ రోజు మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బావుంటుంది. డబ్బు ఆదా చేసేందుకు అవకాశాలుంటాయి. ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించండి. మీ బంధంలో మూడో వ్యక్తి జోక్యం వల్ల సమస్యలు ఎదురవుతాయి.  

తులా రాశి
ఈ రోజు కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. కెరీర్‌లో పురోభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కార్యాలయంలో మీ గుర్తింపు పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలుంటాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. 

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఈరోజు రుణ విముక్తి పొందుతారు. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది.  ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  కుటుంబానికి కొంత సమయం కేటాయించండి.  కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. ఒంటరిగా ఉండే వ్యక్తులు జంటను వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. 

ధనస్సు రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  అప్పుల నుంచి విముక్తి పొందుతారు. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. మీ లక్ష్యాలు సాధించే దిశగా అడుగేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది.  ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం  ఉంటుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి.  

మకర రాశి
మకర రాశి వారు ఈరోజు పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కెరీర్ వృద్ధికి కొత్త అవకాశాలపై దృష్టి పెట్టండి. కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీ కెరీర్‌లో అఖండ విజయాన్ని పొందుతారు. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.  భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు.

కుంభ రాశి
కెరీర్‌లో సక్సెస్ అవుతారు. ఆర్థిక విషయాలలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. పాత ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. కెరీర్ వృద్ధికి లెక్కలేనన్ని అవకాశాలు ఉంటాయి. కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. 

మీన రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. అంకితభావంతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. మీరు కుటుంబం లేదా స్నేహితులతో ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది.  ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న

వీడియోలు

AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Affordable Cars in India: భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
KL Rahul Century: గిల్ హాఫ్ సెంచరీ, శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాజ్‌కోట్‌లో కివీస్ టార్గెట్ ఎంతంటే
గిల్ హాఫ్ సెంచరీ, శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాజ్‌కోట్‌లో కివీస్ టార్గెట్ ఎంతంటే
New scam: రీఫండ్ స్కామ్- రూ.5 కోట్లు కొల్లగొట్టిన టీనేజర్ - షాక్‌లో ఈ-కామర్స్ సంస్థలు
రీఫండ్ స్కామ్- రూ.5 కోట్లు కొల్లగొట్టిన టీనేజర్ - షాక్‌లో ఈ-కామర్స్ సంస్థలు
Chennai sanitation worker: జీవితాంతం రోడ్లు ఊడ్చినా రానంత సొమ్ము ఒకే సారి దొరికింది - కానీ ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఏం చేసిందో తెలుసా?
జీవితాంతం రోడ్లు ఊడ్చినా రానంత సొమ్ము ఒకే సారి దొరికింది - కానీ ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఏం చేసిందో తెలుసా?
Embed widget