అన్వేషించండి

Horoscope Today 17th November 2023:ఈ శుక్రవారం ఈ రాశులవారికి ఆదాయం,అదృష్టం - నవంబరు 17 రాశిఫలాలు

Rasi Phalalu in Telugu: దిన ఫలాలు నవంబర్ 17, 2023: మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today Telugu 17th November (దిన ఫలాలు నవంబర్ 17, 2023)

మేష రాశి (Aries Horoscope in Telugu)
మీరు వృత్తిపరమైన , వ్యక్తిగత జీవితంలో  విజయానికి చేరువలో ఉంటారు. ప్రతి అడుగు జాగ్రత్తగా ముందుకు వేయాలి. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ప్రతిదీ క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రేమ కోసం చూస్తున్న వ్యక్తులకు ఇది చాలా మంచి సమయం. వైవాహిక జీవితం బావుంటుంది. ఉన్నతాధికారులను కలుస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. 

వృషభ రాశి  (Taurus Horoscope in Telugu)
ఈ రాశివారు నాయకుడిగా ఎదిగే సమయం ఇది. పోటీని తట్టుకుంటూ ముందుకు సాగడం మంచిది. ఆదాయాన్ని మించి ఖర్చులుంటాయి. రుణ చెల్లింపుల కోసం కొంత నగదును చేతిలో ఉంచుకోండి. విశ్రాంతి అవసరం అవుతుంది. ఉన్నంతలో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి. కోపం తగ్గించుకోవాలి

మిథున రాశి (Gemini Horoscope in Telugu)
ఉద్యోగం, వ్యాపారంలో మీరు చేసే ప్రయత్నాలు కొనసాగించడం మంచిది.  సందర్భానికి తగినట్టు మిమ్మల్ని మీరు మలుచుకుంటే మంచిది. కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు, అభినందనలు దక్కుతాయి. మీ సన్నిహిత వ్యక్తుల నుంచి మీకు అవసరమైన ప్రోత్సాహం లభిస్తుంది.  మీ భాగస్వామి ప్రేమ లోతును తెలుసుకంటే సంతోషంగా ఉంటారు. వ్యాయామం చేయడంపై శ్రద్ధ పెట్టండి.

Also Read: కార్తీక పూర్ణిమ ఎందుకు ప్రత్యేకం - ఈ రోజు దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే

కర్కాటక రాశి  (Cancer Horoscope in Telugu)
ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కృషి ఫలిస్తుంది..అదృష్టం కలిసొస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వివిధ వనరుల నుంచి  ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీ ఉన్నతాధికారులు మీకు అప్పగించిన పనిని పూర్తిస్థాయిలో స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు.  కుటుంబానికి సమయం కేటాయిస్తారు. కోపం తగ్గించుకోవాలి.

సింహ రాశి ( Leo Horoscope in Telugu)
ఈ రాశివారి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రియమైనవారితో బలమైన సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబానికి సమయం కేటాయించాలి. ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ఆస్తికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే మంచి సమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది

కన్యా రాశి (Virgo Horoscope in Telugu)
ఈ రాశివారు వృద్ధి చెందుతారు. కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఉంటాయి. అవివాహితులకు ఈ వారం మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం, ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్థిరాస్తి లావాదేవీలు ఆశాజనకంగా ఉన్నాయి. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.

Also Read: కార్తీకస్నానం ఆంతర్యం భక్తి మాత్రమే అనుకుంటున్నారా!

తులా రాశి (Libra Horoscope in Telugu)
మీరు ఊహించని ఖర్చుల కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. పరిమిత నిధుల కారణంగా డబ్బు నిర్వహణ కష్టంగా ఉంటుంది. కెరీర్ చాలా బాగుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని సాల్వ్ చేయగలుగుతారు. ప్రయాణాలు కలిసొస్తాయి. ఆస్తి కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు

వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu)
ఈ రాశివారు వ్యక్తిగత జీవితంలో కొన్ని ప్రతికూల అంశాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కెరీర్ ఆశాజనకంగా సాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రణాళికలపై దృష్టి సారించవచ్చు. ఆరోగ్యం బావుంటుంది. బంధాలను పటిష్టం చేసుకునేందుకు ప్రయత్నించాలి. కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటేనే సక్సెస్ అందుకుంటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. 

Also Read: పాములు, నాగులు, సర్పాలు - మీరు వేటిని పూజిస్తున్నారు!

ధనుస్సు రాశి (Sagittarius Horoscope in Telugu)
ఈ రాశివారి కెరీర్ బావుంటుంది. నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. సహోద్యోగులు, ఉన్నతాధికారులతో సంబంధాలు ఫలవంతంగా ఉంటాయి. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థిక స్థితి గందరగోళంగా ఉంటుంది. అనారోగ్యానికి సంబంధించిన కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండాలి..మాట జాగ్రత్త. ప్రయాణాలు కలిసొస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. 

మకర రాశి (Capricorn Horoscope in Telugu)
ఈ రాశివారికి సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. ప్రాజెక్టులు సులభంగా పూర్తవుతాయి. ప్రేమ జీవితం, వైవాహిక జీవితం బావుంటుంది. ఆరోగ్యం , ఆదాయం స్థిరంగా ఉంటుంది. వెంటనే రాబడిని ఇచ్చే పథకాలవైపు మొగ్గుచూపొద్దు. ఆస్తి వ్యవహాహాలు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. నిరుద్యోగులు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. 

కుంభ రాశి (Aquarius Horoscope in Telugu)
 అనుకున్న లక్ష్యాలు చేరుకునే దిశగా అడుగులు వేస్తారు. ఆర్థికంగా అబివృద్ధి చెందుతారు. వృత్తి పరంగా కొన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. పనులు వాయిదా వేయడం వల్ల నష్టపోతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం స్పెండ్ చేస్తారు.

Also Read: మనిషిలో విషసర్పం శేతత్వం పొందేందుకే నాగుల ఆరాధన, పుట్టలో పాలు పోసే టైమ్ ఇదే!

మీన రాశి (Pisces Horoscope in Telugu)
మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ప్రేమపూర్వక సంబంధాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. వృత్తి పరంగా సవాళ్లు ఎదురవుతాయి కానీ మీ కృషితో సక్సెస్ అందుకుంటారు. వ్యక్తి జీవితం అంత మెరుగ్గా ఉండదు కానీ సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నించాలి. విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hydra : హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
Jagan Comments  On Balineni: బాలినేని ఎవరు? సీనియర్ ఎవరు? పార్టీ మారుతున్న నేతలపై జగన్ వింత రియాక్షన్
బాలినేని ఎవరు? సీనియర్ ఎవరు? పార్టీ మారుతున్న నేతలపై జగన్ వింత రియాక్షన్
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
TTD Controversy : టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?
టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hydra : హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
హైడ్రాకు చట్టబద్ధతకు మరో అడుగు మాత్రమే - ఇక మార్కింగ్ చేసిన వాటిపై దండెత్తడమే మిగిలిందా ?
Jagan Comments  On Balineni: బాలినేని ఎవరు? సీనియర్ ఎవరు? పార్టీ మారుతున్న నేతలపై జగన్ వింత రియాక్షన్
బాలినేని ఎవరు? సీనియర్ ఎవరు? పార్టీ మారుతున్న నేతలపై జగన్ వింత రియాక్షన్
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
TTD Controversy : టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?
టీటీడీలో రాజకీయ జోక్యం వల్లనే వివాదాలు - జవాబుదారీతనం ఎలా వస్తుంది ?
Weather Latest Update: తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్- ఏపీకి పొంచి ఉన్న తుపాను ప్రమాదం 
తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్- ఏపీకి పొంచి ఉన్న తుపాను ప్రమాదం 
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Tirumala Laddu: తిరుమల లడ్డూ 3 రకాలు.. ఏ సందర్భంలో ఏమిస్తారు - మీరు తీసుకున్న ప్రసాదం ఏ రకం!
తిరుమల లడ్డూ 3 రకాలు.. ఏ సందర్భంలో ఏమిస్తారు - మీరు తీసుకున్న ప్రసాదం ఏ రకం!
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Embed widget