ఫిబ్రవరి 16 రాశిఫలాలు , ఈ రాశివారు వ్యక్తిగత విషయాలు, రహస్యాలు ఎవ్వరికీ చెప్పొద్దు
Rasi Phalalu Today 16th February 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు సానుకూలతలతో నిండి ఉంటుంది. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి, మీరు పెట్టుబడిపై శ్రద్ధ చూపుతారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు. వ్యాపారం బాగాసాగుతుంది. విద్యార్థులకు శుభసమయం.
వృషభ రాశి
ఈ రోజు మీరు అనేక కొత్త ఆర్థిక ప్రణాళికలను ఎదుర్కొంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మంచి, లోటుపాట్లను జాగ్రత్తగా పరిశీలించండి. ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పటి వరకూ ఆలోచించని మూలం నుంచి డబ్బు సంపాదిస్తారు.
మిథున రాశి
ఈ రోజు మీ ఆరోగ్యం, అదృష్టానికి సంబంధించిన విషయాలు మెరుగుపర్చుకునేందుకు తగినంత సమయం ఉంటుంది. నిర్ణయం తీసుకునేముందు ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో పిల్లల ఆరోగ్యానికి వైద్య సంరక్షణ అవసరం అవుతుంది.
కర్కాటక రాశి
మీ రోజంతా మీరు బిజీగా ఉంటుంది. కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన పనిని సెటిల్ చేసే బాధ్యతను పొందుతారు. ఉద్యోగంలో మీ ఒప్పందాన్ని పునరుద్ధరించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి.
సింహ రాశి
ఈ రోజు మీ ప్రవర్తనను సానుకూలంగా ఉంచుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో లాభాలుంటాయి. ఎవరైనా ఇబ్బందులతో మీ వద్దకు వస్తే వారిని ఎంకరేజ్ చేయవద్దు. మీ మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లే పనులు అస్సలు చేయొద్దు. మీ వ్యక్తిగత భావాలను, రహస్యాలను మీ ప్రియమైనవారితో పంచుకునేందుకు ఇది సరైన సమయం కాదు.
కన్యా రాశి
మీరు వేగవంతంగా చేసే పని మీకు స్ఫూర్తినిస్తుంది. విజయాన్ని సాధించడానికి మీ ఆలోచనలను కాలక్రమేణా మార్చుకోండి. ఇది మీ దృక్పథాన్ని విస్తృతం చేస్తుంది, అవగాహన పరిధిని పెంచుతుంది, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. మీ మనస్సును అభివృద్ధి చేస్తుంది. ఎవరైనా పెద్ద ప్రణాళికలు ఆలోచనల ద్వారా మీ దృష్టిని ఆకర్షించవచ్చు...ఆలోచించి అడుగేయండి.
Also Read: తత్పురుషం,అఘోరం, సద్యోజాతం, వామదేవం మీరు పూజించే రూపం ఏది - శివతత్వం ఏం చెబుతోంది!
తులా రాశి
ఈ రోజు మీ మనస్సు రాజకీయాలవైపు మళ్లుతుంది. రాజకీయ విషయాల్లో ఆహ్లాదకరమైన ప్రయాణం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలమైన రోజు. ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారు కుటుంబంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. దేవునిపై పూర్తి విశ్వాసం ఉంచండి..మీ పని కచ్చితంగా విజయవంతమవుతుంది. కొంతకాలంగా మీ సంబంధం సరిగా సాగకపోవడానికి కారణమైన అపార్థాలను ఈ రోజు అధిగమించవచ్చు.
ధనుస్సు రాశి
మీ అంచనాలు అన్ని సందర్భాల్లో నిజం అవుతాయని ఆలోచించవద్దు. అడుగేసేముందు ఆలోచించండి. నూతన పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. మీ వ్యక్తిగత జీవితం, ఉద్యోగంలో వేరేవారి జోక్యాన్ని సహించవద్దు. మీ జీవిత భాగస్వామితో వివాదానికి దూరంగా ఉండడం మంచిది.
Also Read: శ్మశానంలో ఉంటారెందుకు స్వామి అని పార్వతి అడిగిన ప్రశ్నకు శివుడు ఏం చెప్పాడో తెలుసా!
మకర రాశి
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు. వ్యాపారులు పెద్ద ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారికి ఈరోజు శుభదినం,బహుళజాతి సంస్థ నుంచి ఆఫర్ పొందుతారు.
కుంభ రాశి
ఈ రోజు మీ ప్రయాణ పరిస్థితి ఆహ్లాదకరంగా, ప్రోత్సాహకంగా ఉంటుంది. రిస్క్ చేస్తేనే సక్సెస్ అవుతారని గుర్తించాలి. అనవసర తిండి తినడం తగ్గించండి. అకస్మాత్తుగా మీరు కొత్త వనరుల నుంచి ధనాన్ని పొందుతారు. గృహోపకరణాలు పెరుగుతాయి.
మీన రాశి
ఈ రోజు ఇంటి పని భారం, డబ్బుపై ఒత్తిడి మీ వైవాహిక జీవితంలో సమస్యలను సృష్టిస్తుంది. ప్రేమ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకండి.కోపం తగ్గించుకుంటే మంచిది...మాట తూలొద్దు. ఆరోగ్యం జాగ్రత్త.