By: RAMA | Updated at : 13 Mar 2023 05:33 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pixabay
ఈ రాశివారు ఈ రోజు కొంత గందరగోళంలో ఉంటారు. నిబద్ధత లేకపోవడం ఆర్థిక ప్రతికూల అస్థిరతకు కారణం కావొచ్చు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. ప్రేమ వ్యవహారాలకు ఇది మంచి సమయం.
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు ఆరోగ్య పరంగా ఫిట్‌గా భావిస్తారు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు.
గృహస్థుల మధ్య పరస్పర ప్రేమ ఉంటుంది. మీ కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఈరోజు కార్యాలయంలో ప్రమోషన్ కు సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది కానీ ఆదాయం పరంగా పెద్దగా మార్పులుండవు. లావాదేవీల విషయంలో తొందరపడకండి.
Also Read: ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి శని కరుణించినా గురుబలం లేదు, కొన్ని రంగాలవారికి మాత్రం అద్భుతంగా ఉంది
మీరు ఈ రోజు ఆశించిన విజయాన్ని పొందుతారు. మీ ఆదాయం పెరగవచ్చు. ఆకస్మిక ధన లాభం లేదా బహుమతి ఎక్కడి నుంచైనా అందుకోవచ్చు. ఖర్చులు అదుపులో ఉండాలి. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మనసు ఆనందంగా ఉంటుంది.
ఈ రోజు మీ కెరీర్ కొత్త దిశలో పడుతుంది. కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగుల పురోగతికి అవకాశాలు పొందుతారు. సీనియర్ల సహకారంతో మీ ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మీ ప్రేమ సంబంధం కూడా బలంగా ఉంటుంది.
ఈ రోజు కుటుంబ ఒత్తిడుల కారణంగా మనస్సు చంచలంగా ఉంటుంది. కొన్ని చింతలు మనస్సును ప్రభావితం చేస్తాయి. మీరు మీ ప్లాన్‌లను అందరి ముందూ బహిర్గతం చేయవద్దు..ఫలితంగా మీరు నష్టపోతారు. ముఖ్యమైన పనుల్లో అలసత్వం వహించవద్దు.
Also Read: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో 5 రాశుల వారికి ఆదాయం పెరిగితే , ఈ 3 రాశులవారికి ఖర్చులు పెరుగుతాయి
ఈ రోజు మీ సృజనాత్మకత ఉచ్ఛస్థితిలో ఉంటుంది కానీ ఆర్థిక ఒత్తిడి ఉండొచ్చు. డబ్బు విషయాల్లో తెలివిగా వ్యవహరించాలి. కొన్ని సృజనాత్మక పనులకోసం ఆస్తిని ఉపయోగించవచ్చు. ఆలోచనలను అభివృద్ధి చేయడానికి అవకాశాలను కనుగొనడంలో మీరు సమయాన్ని శక్తిని పెట్టుబడిగా పెట్టండి.
ఈ రోజు తల్లిదండ్రుల సహాయంతో మీ పని పూర్తి అవుతుంది. ఇంటికి స్నేహితుడి రాక ఆకస్మికంగా ఉండవచ్చు. ఈ రాశి విద్యార్థులకు ఈరోజు సాధారణంగానే ఉంటుంది. ఇంట్లో సంతోషం, శ్రేయస్సు పెరిగే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.
ఈ రోజు మీరు వినోద కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఆర్థిక పరిస్థితి వేగంగా బలపడుతుంది. మానసిక కల్లోలం మీకు సమస్యగా మారవచ్చు. రిటైల్, హోల్‌సేల్ వ్యాపారులకు ఈ రోజు మంచిది. కుటుంబంతో గడపడం వల్ల మనసు ఆనందంగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది.
ఈ రోజు మీకు శుభదినం అవుతుంది. సామాజిక , రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కొన్ని ముఖ్యమైన విజయాలు పొందుతారు. మీలో కొందరు కొత్త పరిచయాలను ఏర్పాటు చేసుకోగలరు. సృజనాత్మక రంగాలలో అనూహ్యంగా రాణిస్తారు. పరీక్ష లేదా పోటీ ద్వారా ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు శుభ ఫలితాలను పొందుతారు.
ఈరోజు మీరు పని చేసే విధానంలో మార్పు రావచ్చు. కొన్ని పనుల విషయంలో పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు అందే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారికి శారీరక ఆనందం పెరుగుతాయి. ఆఫీసులో ఏదైనా జటిలమైన విషయం ఈరోజు పరిష్కారం అవుతుంది.
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. చదువు లేదా వృత్తికి సంబంధించి ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. అత్యవసరం అయితే తప్ప ప్రయాణం చేయకపోవడమే మంచిది. చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. గడిచిన అనువాలను పాఠాలుగా భావిస్తారు.
Sri Rama Pattabhishekam 2023: శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా!
Sri Rama Pattabhishekam 2023: పాలకులు ఎలా ఉంటే ప్రజలు అలానే ఉంటారు, కలియుగంలో రామరాజ్యం సాధ్యమా!
మార్చి 31 రాశిఫలాలు, ఈ రాశివారు ఇతరుల మాటకాదు మనసు చెప్పింది వినండి!
Sri Rama Navami 2023: నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం
Sri Rama Navami 2023: ఈ 16 సుగుణాలే రాముడిని ఆదర్శపురుషుడిని చేశాయి!
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు