News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Horoscope Today :ఈ రాశివారిపై శివానుగ్రహం ఉంటుంది, సెప్టెంబరు 12 రాశిఫలాలు

Horoscope Today : మేష రాశి నుంచి మీన రాశివరకూ ఈ రోజు మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

FOLLOW US: 
Share:

Horoscope Today  September 12, 2023: (సెప్టెంబరు 12 రాశిఫలాలు)

మేష రాశి

ఈ రోజు ఈ రాశివారిని సోమరితనం ఆవహిస్తుంది. మీరు కొన్ని ముఖ్యమైన పనుల గురించి ఆందోళన చెందుతారు. మీ బాధ్యతలను నెరవేర్చడానికి కృషి చేస్తారు. ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. వైవాహిక జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తారు. 

వృషభ రాశి

ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలోని సహోద్యోగుల నుంచి సహకారం అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు చక్కగా నిర్వహిస్తారు.  మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా విస్తృతమైనవిగా నిరూపితమవుతాయి. మనసు చాలా ఆనందంగా ఉంటుంది. పిల్లల వృత్తిపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. 

మిథున రాశి

ఈ రోజు కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. మీ సమర్థతతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈ రోజు మీరు సృజనాత్మక పనిని పూర్తి చేయడానికి సమయాన్ని వెచ్చిస్తారు. బంధువులను కలుస్తారు. ఆర్థిక విషయాల్లో కొంత ఆందోళన చెందుతారు.

Also Read: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో సానుకూల మార్పులుంటాయి

కర్కాటక రాశి

ఈ రాశివారు ఈ రోజు ఏదో పని గురించి ఆందోళన చెందుతారు. పెద్ద వ్యాపార ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇదే మంచి సమయం. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి.  మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే సక్సెస్ అవుతారు. సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారం పెరుగుతుంది. 

సింహ రాశి 

అనుభవజ్ఞుల సలహాలు తీసుకోకుండా నూతన పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయవద్దు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఒకరి పనిలో జోక్యం చేసుకోవడం తగదు.  అజాగ్రత్త , అతి విశ్వాసం కారణంగా మోసపోవచ్చు. ప్రభావవంతమైన వ్యక్తులు తమ ప్రతిష్ట గురించి ఆందోళన చెందుతారు. 

కన్యా రాశి 

ఈ రాశివారికి ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు. రాజకీయ వ్యక్తులకు ముఖ్యమైన పదవులు దక్కవచ్చు.  పెద్ద పని ప్రారంభించడానికి నగదు సమస్య పరిష్కారం అవుతుంది. దంపతులు అన్యోన్యంగా ఉంటారు

తులా రాశి

ఈ రాశివారు తెలియని వ్యక్తులను ఎక్కువగా నమ్మొద్దు. చేసే పనుల్లో ఆటంకాలు ఎదురుకావొచ్చు. మీ ఇంట్లో ఉన్న వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. ఈ రాశి ఉద్యోగులు  కార్యాలయంలో ఓవర్ టైం పని చేయాల్సి ఉంటుంది. పొట్టకు సంబంధించిన సమస్య ఉండొచ్చు. ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం సహాయం తీసుకోండి. 

వృశ్చిక రాశి 

ఈ రాశివారు చేసే ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజు మీరు పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుతారు. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. వ్యాపారానికి కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. మీ జీవిత భాగస్వామి మద్దతు మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. 

ధనుస్సు రాశి 

ఈ రాశివారు ఒత్తిడికి లోనవుతారు. బంధువులు ఇంటికి రావొచ్చు. ఇంటా బయటా మీ గౌరవం తగ్గొచ్చు. సహోద్యోగులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది.  కీళ్ల నొప్పులు, రక్తపోటు సమస్యలు తలెత్తవచ్చు.

Also Read: శివుడికి పంచారామ క్షేత్రాల్లా గణేషుడికి అష్టవినాయక ఆలయాలు, వీటి విశిష్టత ఏంటంటే!

మకర రాశి

ఈ రోజు ఈ రాశివారి పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది.  మీరు కొత్త పని కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మీ దినచర్యలో మార్పుులు ఉంటాయి. వివాదాల పరిష్కారానికి రోజు చాలా మంచిది. పూర్వీకుల వ్యాపారంలో లాభం ఉంటుంది. 

కుంభ రాశి 

ఈ రోజు మీరు స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రయాణం చేయాల్సిన అవసరం రావొచ్చు.  ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఉంటాయి.మారుతున్న వాతావరణం వల్ల అనారోగ్యం పాలవుతారు. కాస్త ఎమోషనల్ గా ఉంటారు.   మీకు తలనొప్పి సమస్య రావచ్చు.ఎమోషనల్ గా ఉంటారు. 

మీన రాశి

ఈ రాశివారు కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండాలి. రోజంతా కొంత గందరగోళంగా ఉంటుంది కానీ సాయంత్రానికి పరిస్థితి ప్రశాంతంగా మారుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. ఈ రాశి విద్యార్థులకు చదులుపై శ్రద్ద పెరుగుతుంది.

Published at : 12 Sep 2023 04:26 AM (IST) Tags: daily horoscope Horoscope Today astrological prediction Today Horoscope 12th September 2023 Horoscope

ఇవి కూడా చూడండి

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

ఈ రాశులవారు చెడు సహవాసాలను వదులుకుంటే మంచిది, సెప్టెంబరు 27 రాశిఫలాలు

ఈ రాశులవారు చెడు సహవాసాలను వదులుకుంటే మంచిది, సెప్టెంబరు 27 రాశిఫలాలు

Chanakya Niti In Telugu : మీ జీవితంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 8 మంది వీళ్లే!

Chanakya Niti In Telugu : మీ జీవితంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 8 మంది వీళ్లే!

Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!

Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయ‌ణం చేయాల్సిన సందర్భాలివే!

టాప్ స్టోరీస్

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్