News
News
X

Horoscope Today 11th February 2023: ఫిబ్రవరి, 11 రాశిఫలాలు - ఓ రాశివారు ప్రేమలో విఫలమవుతారు, మరొకరికి డబ్బే డబ్బు!

Rasi Phalalu Today 11th February 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 11 ఫిబ్రవరి 2023, శనివారం చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజున మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యారాశితో సహా అన్ని రాశుల వారు ఆనందం, శ్రేయస్సు పొందుతారు. శనివారం చాలా పవిత్రమైన రోజు, మరి ఈ రోజు ఏయే రాశులవారు ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూడండి. 

మేషరాశి

ఈ రాశివారికి ఈ రోజు మంచి రోజు. వ్యాపారం చేసే వారు తమ వ్యాపారంలో ఏదైనా కొత్త పని చేయవచ్చు. పూర్వీకుల వ్యాపారంలో కొన్ని మార్పులు చేయడానికి, మీరు మీ కుటుంబ పెద్దలను సంప్రదిస్తారు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు. పని చేసే వ్యక్తులు తమ పని ప్రాంతంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. విద్యార్ధులు విద్య కోసం ఒక నగరం నుండి మరొక నగరానికి వెళ్ళవచ్చు. రాజకీయాల్లో కెరీర్‌ను కొనసాగించాలనుకునే వారికి ఇది మంచి రోజు. దాంపత్య సుఖం లభిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమపూర్వక క్షణాలను గడుపుతారు. సోదరుడి వివాహానికి వచ్చే ఆటంకాలు స్నేహితుని ద్వారా తీరుతాయి. ఈ రోజు మీరు ప్రేమిస్తున్న వ్యక్తికి మనసులో మాట చెప్పే అవకాశం ఉంది.

వృషభ రాశి

ఈ రాశివారు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు మంచి రోజు. రేపు ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లో విశేష విజయం సాధిస్తారు. ఆగిపోయిన ధనం చేతికి అందవచ్చు. మీ న్యాయపరమైన వ్యవహారాలు కూడా ఈ రోజుతో ముగియనున్నాయి. ఉద్యోగంలో మార్పుపై ఆలోచిస్తారు. కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ ఉంటుంది. అందులో ఆదాయం ఎక్కువగా ఉంటుంది. పదోన్నతి కూడా లభిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. ఇందుకు మీరు మంచి వైద్యుడిని సంప్రదిస్తారు. వ్యాపారస్తులు ఈ రోజు వ్యాపారంలో వృద్ధిని చూస్తారు. మీరు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని కూడా ప్లాన్ చేస్తారు. స్నేహితుల మద్దతు లభిస్తుంది. మంచి వ్యక్తితో సమావేశం అవుతారు. దాని వల్ల నిలిచిపోయిన పని కూడా పూర్తవుతుంది. మీరు అనేక పథకాల ప్రయోజనాలను కూడా పొందుతారు. ఆర్థిక స్థితి బలపడుతుంది. పిల్లల నుంచి కొన్ని సంతోషకరమైన వార్తలు వినవచ్చు.

మిధున రాశి

ఈ రాశివారికి ఈ రోజు ఆహ్లాదకరంగా సాగుతుంది. ఉద్యోగస్తులు తమ పనిలో పురోగతిని చూస్తారు. మీరు అన్ని రంగాలలో సులభంగా విజయం సాధిస్తారు. ఉద్యోగ మార్పుకు సంబంధించిన ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోండి. కొత్త వ్యాపార ప్రాజెక్ట్ వైపు వెళ్లవచ్చు. ఆగిపోయిన మీ ప్లాన్‌లను రీస్టార్ట్ చేయడంలో మీరు బిజీగా ఉంటారు. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని మార్పులు చేస్తారు. కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కానీ పెద్దల ఆశీర్వాదంతో అన్ని సమస్యలు తీరుతాయి. మీరు కుటుంబ అభివృద్ధి కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. మీ ఫ్రెండ్ మిమ్మల్ని కలవడానికి మీ ఇంటికి వస్తారు. ఆ ఫ్రెండ్ ద్వారా శుభవార్త వింటారు. ఇది మీ మనస్సును సంతోషపరుస్తుంది. మీ ఆర్థిక స్థితి బలపడుతుంది.

కర్కాకట రాశి

ఈ రాశివారికి కూడా ఈ రోజు మంచిదే. రాజకీయాల్లో రాణించాలనుకొనే యువతకు ఈ రోజు శుభప్రదం. పలు సభల్లో ప్రసంగించే అవకాశం లభిస్తుంది. అందరూ మెచ్చుకుంటారు. మీ ప్రేమ వ్యవహారం చెడిపోతుంది. దాని కోసం మీరు తర్వాత పశ్చాత్తాపపడతారు. మీరు ప్రతికూల ఆలోచనలు, ఆగ్రహానికి దూరంగా ఉండాలి. అప్పుడే మీరు అనేక సమస్యల నుంచి రక్షించబడతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి కుటుంబంలో వాదోపవాదాలు కనిపించినా సీనియర్‌ సభ్యుల వల్ల ముగుస్తుంది. విద్యార్థులకు ఉపాధ్యాయుల మద్దతు లభిస్తుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక స్థలాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తారు.  

సింహ రాశి

ఈ రాశివారికి ఈ రోజు బాగుంటుంది. వ్యాపారస్తులు లాభాలు పొందడం ద్వారా ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. శ్రామిక ప్రజలు తమ పనులను సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. తండ్రి ఆశీర్వాదం తీసుకుని ఇల్లు వదిలి వెళితే ధనలాభం కలుగుతుంది. ఇంట్లో అందరితో సంబంధాలు దృఢంగా ఉంటాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. సమాజానికి మేలు చేసే అవకాశం ఎక్కువ వస్తుంది. వివాహితులు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇది మీ మనస్సును సంతోషపరుస్తుంది. పిల్లల గురించి గర్వపడతారు. విద్యార్థులు కూడా ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్లి చదువుకోవచ్చు. విదేశాల నుంచి దిగుమతి-ఎగుమతి పనులు చేసే వారు కొన్ని శుభవార్తలు వింటారు. 

కన్య రాశి

ఈ రాశివారు ఈ రోజు సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తిగా మద్దతు లభిస్తుంది. అన్నదమ్ముల మధ్య కొనసాగుతున్న విభేదాలకు నేటితో తెరపడనుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యా కార్యాలలో విజయం ఉంటుంది. పోటీలకు సిద్ధమవుతున్న విద్యార్థులు నేడు విజయం సాధిస్తారు. విద్యార్థులు కొన్ని సబ్జెక్టులపై తమ ఆసక్తిని తెలుసుకుంటారు. ఇది రాబోయే కాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు పెట్టుబడి పెడతారు. మీరు స్నేహితుల ద్వారా ఆదాయ అవకాశాలను పొందుతారు. దాని నుంచి మీరు లాభం పొందుతారు. మీరు తల్లిదండ్రులతో కొంత సమయం గడుపుతారు. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడటం కనిపిస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందవచ్చు. ఆర్థిక సమస్యలేవీ ఉండవు. 

తులారాశి

ఈ రాశివారికి కూడా ఈ రోజు బాగుంటుంది. ఉద్యోగంలో పురోగతిని చూసి సంతోషిస్తారు. ఆరోగ్యం మెరుగుపడటం కనిపిస్తుంది. ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. మీరు మీ జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారు. మీ స్నేహితులు మిమ్మల్ని మీ ఇంటికి కలవడానికి వస్తారు. విద్యా కార్యాలలో విజయం ఉంటుంది. వ్యాపారంలో క్రమేణా పెరుగుదల ఉంటుంది. మీ ఆగిపోయిన డబ్బును కూడా తిరిగి పొందుతారు. మీరు కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. ఇల్లు, ప్లాట్లు కొనాలనే కోరిక నెరవేరే అవకాశం ఉంది. అమ్మ ఆశీర్వాదం తీసుకొని మీరు ఏ పని చేసినా, మీ పనులన్నీ పూర్తవుతాయి. కోపం తెచ్చుకోవడం మానుకోండి, లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు.

వృశ్చిక రాశి

ఈ రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీనివల్ల కొంత ఆందోళన చెందుతారు. మీ సమస్యను పరిష్కరించడానికి మీరు మీ స్నేహితులతో మాట్లాడవచ్చు. శ్రామిక ప్రజలు తమ పనిలో పురోగతిని చూస్తారు, దాని కారణంగా వారు చాలా సంతోషంగా ఉంటారు. మీరు ఆచితూచి మాట్లాడటం సముచితం. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే యువకులు మంచి డీల్‌ను పొందవచ్చు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. పిల్లల తప్పు సహవాసం గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. సృజనాత్మక, కళాత్మక రంగాలలో ఉన్నవారికి ఈ రోజు మంచిదే. సమాజాభివృద్ధికి పాటుపడే వారికి గౌరవం పెరుగుతుంది. ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులు తమ ప్రేమికుడిని వారి కుటుంబ సభ్యులకు పరిచయం చేయవచ్చు.

ధనుస్సు రాశి

ఈ రాశివారికి ఇది అనుకూలమైన రోజు కానుంది. కుటుంబ జీవితం గురించి మాట్లాడితే అంతా బాగానే ఉంటుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీ పొరుగువారికి సహాయం చేస్తారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. మీరు మీ సమయాన్ని గడపడానికి షాపింగ్ చేస్తారు. కానీ మీరు బడ్జెట్‌లో ఉంటూ అన్ని వస్తువులను కొనుగోలు చేయాలి, లేకపోతే ఆర్థిక పరిస్థితిలో బలహీనత ఉంటుంది. నిలిచిపోయిన డబ్బును మీరు ఈ రోజు పొందే అవకాశం ఉంది. ఈ రోజు మీకు ఆర్థికంగా బాగుంటుంది. అయితే, ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వకుండా ఉండాలి, లేకపోతే మీ డబ్బు మునిగిపోవచ్చు.  
బంధువులతో కొనసాగుతున్న వైరం నేటితో ముగియనుంది. శ్రామిక ప్రజలు తమ పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సీనియర్లు, జూనియర్ల మద్దతు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. వ్యాపారంలో డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి.

మకర రాశి

ఈ రాశివారికి కూడా ఈ రోజు సాఫీగా సాగిపోతుంది. ఈ రాశివారు ఫుల్ ఎనర్జీతో ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు.  ఇతరులకు సహాయం చేయడానికి కూడా ముందుకు వెళతారు. వ్యాపారానికి సంబంధించి కొన్ని పెద్ద పనులు ఉండవచ్చు. స్నేహితుల నుంచి ప్రయోజనాలు పొందుతారు. మీరు చేసిన పనిని అందరూ మెచ్చుకుంటారు. మీరు ఆఫీసులో అందరి మన్ననలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్యిక ప్రదేశానికి తీర్థయాత్రకు వెళ్లవచ్చు. విద్యార్థులు పోటీలలో విజయం సాధిస్తారు. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే, మీరు మంచి వైద్యుడిని సంప్రదించడం మీకు మంచిది. మీరు ఉద్యోగంలో విజయం సాధిస్తారు. అవివాహితులకు మంచి సంబంధం రావచ్చు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు ఆదాయ వనరులు కూడా లభిస్తాయి.  

కుంభ రాశి

ఈ రోజు అదృష్టం మీతోనే ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. రాజకీయాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. కొత్త జాబ్ ఆఫర్ కూడా ఉంటుంది. మంచి ఆదాయం, పదోన్నతి లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో మీరు ఆశించిన లాభం పొందే అవకాశం ఉంది. మీరు కొన్ని కొత్త వ్యాపారాలు చేయాలని నిర్ణయించుకుంటారు. ఇంట్లో పెద్దల సహాయం లభిస్తుంది. మీరు మీ పాత స్నేహితుడిని కలుస్తారు. మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు. సీనియర్ సభ్యుల ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. ఆగిపోయిన డబ్బు కూడా అందుతుంది.

మీన రాశి

మీన రాశి వారికి కూడా ఈ రోజు బాగుంటుంది. వ్యాపారస్తులు తమ బిజినెస్ పెంచుకొనేందుకు చురుగ్గా ప్లాన్ చేస్తారు. మాటతీరులో కాఠిన్యం కార్యాలయంలో ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది. ఇచ్చిన పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరిగే పరిస్థితి రావచ్చు. బయటకు వెళ్లేప్పుడు తండ్రి ఆశీర్వాదం తీసుకుంటే.. మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఉద్యోగంలో పురోభివృద్ధి కోసం శ్రమించక తప్పదు. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు పెట్టుబడి పెడతారు. ఇల్లు కొనుక్కోవాలనే కోరిక ఈ రోజు నెరవేరే అవకాశం కనిపిస్తోంది. 

Also Read: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?

Published at : 11 Feb 2023 07:03 AM (IST) Tags: rasi phalalu Horoscope Today Today Rasiphalalu astrological prediction today Horoscope for Feb 11th Feb 11th Horoscope 11th feb Astrology 11th feb Horoscope

సంబంధిత కథనాలు

Ramadan 2023: రంజాన్‌ ఉపవాస దీక్షలు ఎందుకంత కఠినంగా ఉంటాయి, దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!

Ramadan 2023: రంజాన్‌ ఉపవాస దీక్షలు ఎందుకంత కఠినంగా ఉంటాయి, దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!

మార్చి 24 రాశిఫలాలు, ఈ రాశివారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి

మార్చి 24 రాశిఫలాలు, ఈ రాశివారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి

Srirama Navami Special 2023: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!

Srirama Navami Special 2023: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!

Saturn Transit 2023: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!

Saturn Transit 2023: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!

Sobhakritu Nama Samvatsara(2023-2024): ఈ ఏడాది ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం ఉన్న రాశులివే!

Sobhakritu Nama Samvatsara(2023-2024): ఈ ఏడాది ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం ఉన్న రాశులివే!

టాప్ స్టోరీస్

TSPSC Exams : రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?

TSPSC Exams :  రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?

Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల

Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ