News
News
వీడియోలు ఆటలు
X

Horoscope Today 9th February 2023: ఫిబ్రవరి 9 రాశిఫలాలు - ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే, ప్రేమ ఫలిస్తుంది కూడా!

Rasi Phalalu Today 9th February 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

మేష రాశి

ఈ రోజు కలలు సాకరమయ్యే అవకాశాలున్నాయి. అయితే, అత్యుత్సాహం పనికిరాదు. అది మీమ్మల్ని సమస్యల్లోకి నెట్టేయవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారికి ఈరోజు నష్టాలు తప్పకపోవచ్చు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి, స్నేహితులకు సమయం కేటాయించడం కష్టమే. అయితే, మీ లైఫ్ పార్టనర్‌‌తో ఈ రోజు సంతోషంగా ఉంటారు. అనుకోని అతిథులు మీ ఇంటి తలుపు తట్టే అవకాశం ఉంది. 

వృషభ రాశి

ఆర్థికంగా మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. మొండి బకాయిలు లేదా మీకు రావల్సిన సొమ్ము లభించే అవకాశం ఉంది. మీ కోపం లేదా మాటల వల్ల ఇబ్బందులు రావచ్చు. మీరు ఉద్యోగస్తులై ఉంటే.. ఆఫీసులో మీకు మంచి వాతావరణం ఉంటుంది. ఈ రోజు మీ సహుద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ శ్రమను మెచ్చుకొనే అవకాశాలున్నాయి. మీరు వ్యాపారస్తులై ఉంటే మంచి లాభాలు పొందుతారు. ఈ రోజు మీరు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. 

మిథున రాశి

అనుకోని సమస్యలు మీపై ఒత్తిడి పెంచుతాయి. మీరు పొదుపు చేసిన సొమ్ము అవసరానికి ఉపయోగపడుతుంది. కానీ, ఖర్చులు మాత్రం అంతకుమించి ఉంటాయి. మీ మనస్తత్వం మీ చుట్టూ ఉన్నవారికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీ మనసుకు దగ్గరైన వ్యక్తికి దూరంగా ఉండాల్సి రావచ్చు. అది మీకు కాస్త భారంగా అనిపిస్తుంది. చిన్న వ్యాపారస్తులు నష్టాలు చూసే అవకాశం ఉంది. దీనిపై ఆందోళన పెట్టుకోకుండా బాగా కష్టపడితే ఫలితం ఉంటుంది.

కర్కాటక రాశి 

ఈ రోజు ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. వృత్తిలో మీ నైపుణ్యానికి సవాళ్లు ఎదురు కావచ్చు. మంచి ఫలితాల కోసం ఏకాగ్రతతో కష్టపడాలి. మీ తెలివితేటలకు పనిచెప్పాల్సిన సమయం ఇదే. మీరు తీసుకొనే తెలివైన నిర్ణయాలే మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తాయి. క్రియేటివ్ వర్క్స్‌పై ఆధారపడి పనిచేసేవారికి సమస్యలు ఎదురుకావచ్చు. వస్తువులపై జాగ్రత్త అవసరం. లేకపోతే అవి చోరీకి గురికావచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు సహకరించకపోవచ్చు. దానివల్ల మీరు ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యే అవకాశాలున్నాయి. 

సింహ రాశి

మీరు కాస్త ఉత్సాహంగా ఉండాలి. అప్పుడే మీరు ఏ రంగంలోనైనా చురుగ్గా రాణించగలరు. ఈ రోజు మీరు ల్యాండ్‌పై పొదుపు చేస్తే తప్పకుండా భవిష్యత్తులో లబ్ది పొందుతారు. వెలంటైన్స్ డే నేపథ్యంలో మీ ప్రేమకు ఈ రోజు మంచి రోజే. ఈ రోజు ప్రపోజ్ చేస్తే.. సానుకూల స్పందన రావచ్చు. తలపెట్టిన పనులు పూర్తి కావాలంటే మీరు మరింత శ్రమించాలి. ఓర్పుతో పనిచేయాలి. ఈ రోజు మీరు పట్టిందల్లా బంగారమే. మీరు మీ జీవిత భాగస్వామితో హాయిగా గడుపుతారు. 

కన్య రాశి 

మీ మనసుకు నచ్చిన పనులు మొదలుపెట్టడానికి ఇదే మంచి రోజు. మీరు ఈ రోజు అప్పు చేసే అవకాశం ఉంది. అయితే, అది భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులకు కారణం కావచ్చు. తీసుకున్న అప్పును అనవసరంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. దానివల్ల మీ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. పెద్దలు చెప్పే మాటలు వినండి. మొండి వైఖరి వద్దు. ఈ రోజు మీరు మీ భాగస్వామితో రొమాంటిక్‌గా గడుపుతారు. వ్యాపారస్తులు, ఉద్యోగులకు ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. 

తులా రాశి

ఈ రోజు ఎంతో కాలంగా అనుభవిస్తున్న టెన్షన్ల నుంచి రిలీఫ్ దొరకవచ్చు. జీవితాన్ని రీఫ్రెష్ చేసుకొనేందుకు ఇదే తగిన రోజు. ఈ రోజు మొండి బకాయిలను వసూలు చేసే అవకాశం ఉంది. డబ్బు మీ చేతికి అందుతుంది. కుటుంబ బాధ్యతలు కాస్త భారంగా అనిపిస్తాయి. ఈ రోజు మీరు ఏదైనా ఆధ్యాత్మిక ప్రాంతంలో ప్రశాంతంగా గడిపేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. మీ భాగస్వామికి తగిన సమయం కేటాయించలేరు. దానివల్ల స్పర్థలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆఫీసులో జాగ్రత్తగా పనిచేయండి. ఉన్నతాధికారులతో వాదన వద్దు. వ్యాపారాస్తులు అరువులు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. 

వృశ్చిక రాశి

జూదానికి దూరంగా ఉండండి. పొరపాటున వాటిలో డబ్బు పెట్టారో తీవ్రంగా నష్టపోతారు. మీ జీవిత భాగస్వామితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. మీ మాటలు మీ భాగస్వామిని బాధపెట్టే అవకాశం ఉంది.   మీ స్వీట్ హార్ట్ యొక్క పరుషమైన మాటలవలన మీమనసు కలత చెంది ఉండవచ్చును. టీవీ,మొబైల్ ఎక్కువగా వాడటమువలన మీయొక్క సమయము వృధా అవుతుంది. మీ వైవాహిక జీవితం ఈ రోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీపరం చేయనుంది. వ్యాపారులు అనవసర ఖర్చులకు డబ్బును వేస్ట్ చేయకూడదు. ఉద్యోగస్తులు కూడా ఆర్థిక అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. 

ధనుస్సు

మీ దగ్గర డబ్బులు తీసుకుంటూ తిరిగి ఇవ్వకుండా మోసం చేసే స్నేహితులకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తుల శ్రమ ఫలిస్తుంది. మీకు ఈ రోజు ఒక సర్‌ప్రైజ్ బహుమతి లభించే అవకాశం ఉంది. మీరు ప్రేమలో ఉన్నట్లయితే.. ఈరోజు మీకు మంచిదే. ఒక వేళ మీరు వివాహితులై ఉంటే.. మీ భాగస్వామితో రొమాంటిక్‌గా గడుపుతారు. ఉద్యోగులు, వ్యాపార వేత్తలు ఆర్థిక అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదమరిచి ఉంటే మోసపోతారు. 

మకర రాశి

ఈ రోజు మీకు సరదాగా గడుస్తుంది. అయితే, అత్యుత్సాహంతో దుబరా ఖర్చులు చేయొద్దు. శ్రమ, ఓర్పుతో మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఈ రోజు కాస్త మీకు విశ్రాంతి తీసుకొనే సమయం దొరుకుతుంది. అయితే, మీ భాగస్వామితో ఈ రోజు వాదోపవాదాలు జరుగుతాయి. అయితే, రాత్రికి ఇద్దరు శాంతించి సంతోషంగా గడిపే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారాలు పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. 

కుంభ రాశి 

ఈ రోజు మీరు డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తారు. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే, కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీరు ప్రేమలో ఉన్నట్లయితే.. మీ లవ్ స్టోరీ అనుకోని మలుపు తిరుగుతుంది. మీరు ప్రేమించే వ్యక్తి మీతో పెళ్లికి అంగీకారం తెలిపే అవకాశం ఉంది. అయితే, మీరు అన్నివిధాలా ఆలోచించిన తర్వాతే మీ నిర్ణయాన్ని తెలపాలి. ఈ రోజు ఏ పనులను వాయిదా వేయొద్దు. మీరు వివాహితులై ఉంటే.. ఈ రోజు మీరు మీ భాగస్వామితో ప్రేమతో గడుపుతారు. ఖర్చుల విషయంలో ఉద్యోగస్తులు, వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. 

మీన రాశి

వివాహితులకు ఈ రోజు వారి అత్తమామల నుంచి ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. మీకు కావాల్సిన వ్యక్తులతో ఆవేశంగా మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత అవన్నీ తలచుకుని బాధపడతారు. కాబట్టి, కాస్త ఆలోచించి విచక్షణతో మాట్లాడండి. మీరు మీ బెస్ట్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడే అవకాశం ఉంది. కొందరు మీ అమాయకత్వాన్ని వాడుకోవాలని ప్రయత్నిస్తారు. కాబట్టి, వారి మాటలను గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. మీరు వివాహితులై ఉంటే.. మీ భాగస్వామితో ఈ రోజు విహారానికి వెళ్లి హాయిగా గడుపుతారు. ఉద్యోగస్తులు, వ్యాపారాలకు ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. 

Also Read: గరుడ పురాణం - ఆలస్యంగా నిద్రలేస్తే అన్ని కష్టాలా? లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఏం చేయాలి?

Published at : 09 Feb 2023 05:55 AM (IST) Tags: rasi phalalu Horoscope Today Horoscope for Feb 9th Feb 9th Horoscope 9th feb Astrology 9th feb Horoscope Today Rasiphalalu astrological prediction today

సంబంధిత కథనాలు

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి  ఎప్పుడొచ్చింది,  ప్రత్యేకత ఏంటి!

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Shukra Gochar 2023: నెల రోజుల పాటూ ఈ 4 రాశులవారికి అంత బాలేదు!

Shukra Gochar 2023: నెల రోజుల పాటూ ఈ 4 రాశులవారికి అంత బాలేదు!

మే 31 రాశిఫలాలు, ఈ రాశులవారు శత్రువులపట్ల జాగ్రత్త వహించాలి

మే 31 రాశిఫలాలు, ఈ రాశులవారు శత్రువులపట్ల జాగ్రత్త వహించాలి

Laxmi Yog:ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం

Laxmi Yog:ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !