అన్వేషించండి

Horoscope Prediction in Telugu 6 july 2024: ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కరుణా కటాక్షాలుంటాయి - జూలై 06 రాశిఫలాలు

Horoscope Prediction 6th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జూలై 06 రాశిఫలాలు

మేష రాశి

ఈ రాశికి చెందిన మార్కెటింగ్, సేల్స్ రంగాలకు చెందినవారు ఈరోజు దూరప్రాంత ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కార్యాలయంలో రాజకీయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి కానీ మీరు దూరంగా ఉండడం మంచిది. బంగారం ,  వజ్రాల మీద పెట్టుబడి పెట్టేవారికి కలిసొచ్చే సమయం ఇది. వృత్తిపరమైన ,  వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తికోసం అన్వేషిస్తారు.  

వృషభ రాశి

మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇదే సమయం. మీపై మీరు విశ్వాసం కలిగి ఉండండి.  ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించండి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే కార్యకలాపాలలో పాల్గొనండి. పనివిషయంలో నిర్లక్ష్యం వహించవద్దు. మీ ప్రియమైనవారి నుంచి మంచి బహుమతులు పొందుతారు.   

మిథున రాశి

మీ ప్రేమ జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం , ఆర్థిక సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు.  వీటిని జాగ్రత్తగా నిర్వహించవలసి ఉంటుంది. మీరు మీ వృత్తి జీవితంలో చాలా పురోగతిని పొందుతారు. అత్యవసర పనులను జాగ్రత్తగా నిర్వహించండి.  నిబద్ధత గురించి చర్చించడానికి ఉత్తమ సమయం ఇది. వైవాహిక జీవితం బావుంటుంది

Also Read: పవన్ కళ్యాణ్ సూర్యారాధన - ఇది మామూలు సాధన కాదు మనలో శక్తిని తట్టి లేపే అద్భుత ప్రక్రియ!

కర్కాటక రాశి

కర్కాటక రాశికి చెందిన కొందరు వ్యక్తులు సంభాషణ సమయంలో వారి నిగ్రహాన్ని కోల్పోవచ్చు..దాని కారణంగా సమస్యలు పెరుగుతాయి. కార్యాలయంలో తెలివిగా పని చేయండి.. రాజకీయాలకు దూరంగా ఉండండి. ఎవరితోనూ, ముఖ్యంగా మీ సహోద్యోగులతో ఆఫీసు గాసిప్‌ల గురించి చర్చించకండి. వ్యాపారంలో భాగస్వాముల మద్దతును పొందడం వలన ఎటువంటి సమస్యలు ఉండదు. ఈ రోజు పెట్టుబడులకు అనుకూల సమయం. వ్యక్తిగత జీవితంలో ఉండే సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. 

సింహ రాశి

ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. జీవిత బాగస్వామితో బంధం బలపడుతుంది.  కార్యాలయంలో కొన్ని మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది, కానీ ఈ మార్పులు పురోగతికి మార్గాలను నిర్ధారిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మిమ్మల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే కార్యకలాపాలలో పాల్గొనండి. సంపద , శ్రేయస్సు కోసం ఊహించని అవకాశాలు ఉంటాయి.  

కన్యా రాశి

ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మీరు మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఈ డబ్బును ఉపయోగించవచ్చు.  మీ జీవితంలోకి కొత్త వ్యక్తులను స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం మీ విజయానికి కీలకం అవుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమఫలితాలుంటాయి.

తులా రాశి 

కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఉద్యోగులు పనిలో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది ..దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. నూతన పెట్టుబడులకు ఈ రోజు మంచి రోజు.  అనేక ఆదాయ వనరుల నుంచి డబ్బు పొందుతారు. కొందరు వ్యక్తులు  చెల్లింపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో ఎవ్వరి జోక్యాన్ని సహించవద్దు.  

Also Read: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్.. పూరీ రథయాత్ర గురించి మీకు తెలియని ఆసక్తికర విశేషాలివి!

వృశ్చిక రాశి

వృశ్చిక రాశివారు ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు కలిసొస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి.  ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు

ధనస్సు రాశి

ఒంటరి వ్యక్తులు ఆకర్షణీయమైన వ్యక్తితో ప్రేమలో పడవచ్చు.  సంభాషణ ద్వారా మీ భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడుతుంది.   కార్యాలయంలో చాలా ఉత్తేజకరమైన మార్పులు ఉంటాయి. వ్యాపారంలో కొన్నాళ్లుగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

మకర రాశి

మీ సంబంధాలలో చాలా మార్పులను చూస్తారు. ఇంటర్యూలకు హాజరయ్యేవారు విజయం సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బావుంటుంది. నూతన స్నేహాలు ఏర్పడతాయి. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నించండి 

Also Read: బోనాలు, రథయాత్ర, తొలి ఏకాదశి, గురుపూర్ణిమ సహా జూలై నెలలో ఎన్ని పండుగలో!

కుంభ రాశి

ఈ రోజు మీ ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగం,వ్యాపారంలో పురోగతికి కొత్త అవకాశాలుంటాయి. వృత్తి జీవితంలో   ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి. కార్యాలయంలోని సవాళ్లు మరియు అడ్డంకులను అధిగమించడానికి మీపై విశ్వాసం కలిగి ఉండండి. ప ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పురోగతికి కొత్త అవకాశాలు ఉంటాయి.  అధిక ఖర్చు  నియంత్రించేందుకు ప్రయత్నించండి.

మీన రాశి

ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపార ఆలోచనలు ప్రారంభిస్తారు. మీపై లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి.  ఆరోగ్యం బాగుంటుంది. జీవనశైలి మెరుగుపడుతుంది. వ్యాపారవేత్తలు ఆర్థిక నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోవాలి.  

Note:ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Also Read: ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసోత్సవాలు ..నెలరోజుల పాటూ దుర్గమ్మ సన్నిధిలో పండుగ వాతావరణమే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
Sunrisers Hyderabad: బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
MEGA157: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కొత్త మూవీ ప్రారంభం - ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు కూడా..
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కొత్త మూవీ ప్రారంభం - ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు కూడా..
Venkaiah Naidu: మోదీ కొత్తగా తేలేదు, జమిలి ఎన్నికలపై వెంకయ్య నాయుడు కీలక వాఖ్యలు
మోదీ కొత్తగా తేలేదు, జమిలి ఎన్నికలపై వెంకయ్య నాయుడు కీలక వాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP DesamHardik Pandya captaincy IPL 2025 | టీమ్ సెలక్షన్ లోనూ పాండ్యా తప్పిదాలు | ABP DesamGT vs MI 197 Target Match Highlights IPL 2025 | మొన్న చెన్నై, నిన్న ముంబై సరిగ్గా అలాగే ఓడిపోయాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
Sunrisers Hyderabad: బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
బాంబ్ పేల్చిన సన్ రైజర్స్ ఫ్రాంచైజీ, HCA మీద సంచలన ఆరోపణలతో లేఖ
MEGA157: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కొత్త మూవీ ప్రారంభం - ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు కూడా..
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కొత్త మూవీ ప్రారంభం - ముఖ్య అతిథిగా రాఘవేంద్రరావు, ఇతర ప్రముఖులు కూడా..
Venkaiah Naidu: మోదీ కొత్తగా తేలేదు, జమిలి ఎన్నికలపై వెంకయ్య నాయుడు కీలక వాఖ్యలు
మోదీ కొత్తగా తేలేదు, జమిలి ఎన్నికలపై వెంకయ్య నాయుడు కీలక వాఖ్యలు
TGPSC Group1 Results: గ్రూప్‌-1 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ, డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి
గ్రూప్‌-1 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ, డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి
LRS In Telangana: సెలవు దినాలైనా.. నేడు, రేపు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఆస్తి పన్ను చెల్లింపులకు అవకాశం
సెలవు దినాలైనా.. నేడు, రేపు ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఆస్తి పన్ను చెల్లింపులకు అవకాశం
Happy Ugadi  Shubh Muhurat 2025: ఉగాది పచ్చడి ఏ సమయానికి తినాలి.. ముహూర్తం ఎప్పుడు.. ఈ శ్లోకం చదివి ఉగాది ప్రసాదం తీసుకోండి!
ఉగాది పచ్చడి ఏ సమయానికి తినాలి.. ముహూర్తం ఎప్పుడు.. ఈ శ్లోకం చదివి ఉగాది ప్రసాదం తీసుకోండి!
Happy Ugadi Wishes in Telugu 2025: మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి!
మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి!
Embed widget