అన్వేషించండి

Pawan Kalyan Surya Aradhana Deeksha: పవన్ కళ్యాణ్ సూర్యారాధన - ఇది మామూలు సాధన కాదు మనలో శక్తిని తట్టి లేపే అద్భుత ప్రక్రియ!

Surya Aradhana Deeksha Pawan Kalyan: వారాహి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూర్యారాధన క్రతువులో పాల్గొన్నారు. ఇంతకీ ఏంటీ సూర్యారాధన? ఈ ఆరాధన వల్ల ఉపయోగాలేంటి?

Surya Aradhana Deeksha:  వారాహి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ సూర్యారాధన క్రతవులో పాల్గొన్నారని ఆ పార్టీ ప్రకటనలో పేర్కొంది. సూర్యారాధన చేస్తే ఏమవుతుంది? దీనివల్ల ఉపయోగం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం...

లోకానికి వెలుగులు ప్రసాదించి జీవుల ఉనికికి కారణం అవుతున్న ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. ఆదిత్యుడిని కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ ప్రత్యేకంగా ఆరాధిస్తారు. అయితే భారతీయులు సూర్యభగవానుడికి ఇచ్చిన ప్రాముఖ్యత చాలా గొప్పది.  

గ్రహనక్షత్ర యోగాశ్చరాశయః కరణానిచ 
ఆదిత్యా వసవో రుద్రా అశ్వినౌ వాయు 
వోనలః శక్రః ప్రజాపతిః సర్వే భూర్భువః స్వస్థ దైవచ 
లోకాః సర్వేనగాః సరితః సాగర స్తథాః 
భూత గ్రామస్య సర్వస్య స్వయం హేతు ర్దివాకరః

అంటే...గ్రహాలు, నక్షత్రాలు, రాశులు, వసు, రుద్ర, ఆదిత్య, అశ్వినులు, వాయువు, అగ్ని, ఇంద్రుడు, ప్రజాపతులు, వ్యాహృతలు, సమస్తలోకాలు, పర్వతాలు, సర్పాలు, భూమి, నదులు, సముద్రాలు, జీవులు, గ్రామాలు ఇవన్నీ ప్రత్యక్ష దైవం అయిన సూర్యుడి స్వరూపాలే అని అర్థం 

Also Read: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్.. పూరీ రథయాత్ర గురించి మీకు తెలియని ఆసక్తికర విశేషాలివి!

నెలకో సూర్యుడి ఆరాధన

జగత్తుకి వెలుగులు ప్రసాదించే ఆదిత్యుడిని నెలకో పేరుతో ఆరాధిస్తారు. 12 నెలల్లో ఒక్కో నెలలో ఒక్కో పేరుతో పూజిస్తారు. ఇలా కాలాన్ని అనుసరించి సూర్యుడిని ఆరాధించే రూపాలనే ద్వాదశ ఆదిత్యులు అని చెబుతారు.  చైత్రమాసంలో ధాత, వైశాఖంలో అర్యముడు, జ్యేష్ఠమాసంలో మిత్ర,  ఆషాడమాసంలో వరుణుడు, శ్రావణంలో ఇంద్రుడు, భాద్రపదమాసంలో వివస్వంతు, ఆశ్వయుజ మాంలో త్యష్ట, కార్తీమాసమంలో విష్ణువు, మార్గశిరమాసంలో అంశుమంతుడు, మాఘమాసంలో పూష, ఫాల్గుణమాసంలో క్రతువు పేర్లతో ఆరాధిస్తారు.  

సూర్యారాధన పద్ధతులెన్నో ఉన్నాయి

ఆదిత్యుడిని ఆరాధించేందుకు ఎన్నో పద్ధతులున్నాయి. వాటిలో అర్చన, జపం, ప్రదక్షిణ, నమస్కారం, అర్ఘ్యం, ధ్యానం, నిష్ఠ అనే ఆరు పద్ధతులు అత్యంత ముఖ్యమైనవి. నిత్యం సూర్యుడికి ఆరు పద్ధతులు భక్తిప్రపత్తులతో నిర్వహించేవారికి సర్వకార్యాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యానికి సూర్యారాధనను మించిన దివ్యమైన ఔషధం లేదు. అందుకే అంటారు 'ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్' అని. ముఖ్యంగా కంటికి సంబంధించిన ఎలాంటి అనారోగ్యం అయినా సూర్యరాధనతో నయమవుతుందంటారు. ఇంటి మధ్యలో కానీ ఈశాన్య భాగంలో కానీ సూర్యారాధన చేస్తారు. 40 రోజులు, 20 రోజులు, 12 రోజులు ఆరాధన నిర్వహిస్తారు..ఏకాదశ అంటే 11 రాత్రులు పూర్తయ్యాక 12 వ రోజు దీక్ష విరమిస్తారు.  

Also Read: బోనాలు, రథయాత్ర, తొలి ఏకాదశి, గురుపూర్ణిమ సహా జూలై నెలలో ఎన్ని పండుగలో!

యుగయుగాలుగా ఆదిత్యుడి అభయం

శత్రువులను వణికించే చక్రయుధాన్ని శ్రీ మహావిష్ణువు సూర్యుడి నుంచే స్వీకరించాడు. అరణ్యవాసంలో ఉన్న సమయంలో ధర్మరాజు.. సూర్యభగవానుడిని ప్రార్థించి అక్షయపాత్ర పొందాడు. ద్వారపయుగంలోనే సత్రాజిత్తుడు ఆదిత్యుడి నుంచి శ్యమంతకమణిని వరంగా పొందాడు. సప్త చిరంజీవులలో ఒకడైన ఆంజనేయుడు సూర్యుడి దగ్గరే వేదశాస్త్రాలను అభ్యసించాడు.

సూర్యారాధన వల్ల ఎన్నో ఉపయోగాలు

సకల కార్యాలకు సూర్యారాధన అత్యుత్తమం అని ధర్మశాస్త్రాల్లో ఉంది. ఆదిత్యుడిని నిత్యం పూజిస్తే పూర్వజన్మ పాపాలన్నీ నశిస్తాయి. దీర్ఘకాల అనారోగ్యం సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. మనసులో కోరుకున్న మంచి కోర్కెలన్నీ నెరవేరుతాయి. అపమృత్యు భయం తొలగిపోతుంది. మూడు రకాల కర్మలుగా చెప్పుకునే ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అంతరిస్తాయి. ఇంకా జ్ఞానం , విజ్ఞానానికి , మానసిక ప్రశాంతత సాధించేందుకు ఉత్తమమార్గం సూర్యారాధన. మన కర్మలను మనసు నియంత్రిస్తే..ఆ మనసుని నియంత్రించేది చంద్రుడు.. ఆ చంద్రుడికి కూడా వెలుగును అందిచేది సూర్యుడు. వీటన్నింటికి కారకుడైన సూర్య భగవానుడిని ఆరాధించి ఎందరో ఋషూలు, యోగులు మంచి ఫలితాలు పొందారు. 

Also Read: ఆషాఢ అమావాస్య రోజు ఈ ఒక్కటీ చేస్తే మీ కుటుంబానికి ఉన్న పితృదోషం తొలగిపోతుంది!

భోగశరీరం యోగ శరీరంగా మార్చే సూర్యారాధన

నిత్యం సూర్య కాంతిలో సూర్యనమస్కారాలు చేయడం వల్ల ఆ కాంతిని శరీరం నేరుగా స్వీకరిస్తుంది. తద్వారా సూర్యకాంతి శరీరంలో ఉండే శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిగిస్తుంది. శరీరం, ప్రాణం, మనస్సులను విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెట్టి మనలో అంతర్గతంగా ఉండే శక్తి కేంద్రాలు తెరుచుకునేందుకు సహకరిస్తుంది. అంటే భోగశరీరాన్ని యోగ శరీరంగా మార్చేస్తుంది. అప్పుడే అపారమైన శాంతి, సమస్థితి లభిస్తుంది. 
 
ఏడు రంగులు ఏడు రుగ్మతలకు ఔషధం

సూర్యకిరణాలలో ఉండే ఏడు రంగుల ఆధారంగా  చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆరెంజ్ కలర్ శరీరంలో వేడిని వృద్ధి చేసి పైత్య సంబంధిత రుగ్మతలను నివారించి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. గ్రీన్ కలర్ కండపుష్టిని ఇస్తూ మెదడుని పటిష్టంగా మారుస్తుంది. బ్లూ కలర్ పిత్తదోషాలను తొలగిస్తుంది. అత్యంత ప్రధానమైన ఈ మూడు రంగులను స్వీకరించి వీటిలో ఇథర రంగులను మిళితం చేసి చికిత్సలో వినియోగిస్తారు. ఇవన్నీ శరారానికి ఒకేసారి అందాలంటే సూర్య నమస్కారాలు, సూర్యారాధన చేయడం ప్రధానం...

Also Read: జూలై 7న పూరీ జగన్నాథుడి రథయాత్ర..ఐదు దశాబ్దాల తర్వాత ఒకేరోజు మూడు వేడుకలు!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Gig Workers Strike : గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
India Tour of Bangladesh 2026:బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
Pariksha Pe Charcha 2026: పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
CBSE Practical Examinations :సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు! ఆ మార్పులేంటో తెలుసుకోండి!
సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు! ఆ మార్పులేంటో తెలుసుకోండి!
Embed widget