Horoscope Prediction in Telugu 5 july 2024: ఈ రాశులవారు గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఇదే - 2024 జూలై 05 రాశిఫలాలు
Horoscope Prediction 5th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
జూలై 05 రాశిఫలాలు
మేష రాశి
ఈ రాశివారి మాటలో, ప్రవర్తనలో సంయమనం పాటించాలి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వాయిదా వేయడం మంచిది.. లేదంటే నష్టపోతారు. మీ పనులను పూర్తి చేయడానికి ఇతరులపై ఆధారపడొద్దు. సోమరితనం వీడడం మంచిది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి.
వృషభ రాశి
ఈ రాశివారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేస్తారు. వ్యాపారులకు మంచి రోజు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి జరుగుతున్న వివాదాల్లో మీరు విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ముఖ్యమైన ఒప్పందాలు కుర్చుకుంటారు. మీ చుట్టూ ఉండే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి
మిథున రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యం వద్దు. వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపశమనం పొందుతారు. మీ ప్రత్యర్థులతో ఎలాంటి సమాచారాన్ని పంచుకోవద్దు.
Also Read: జూలై 16 నుంచి నెలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే - అన్నింటా విజయం!
కర్కాటక రాశి
ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ఆలోచనాత్మక మార్పులు చేయాల్సిన రోజు. మీ జీవిత భాగస్వామితో అనవసర వివాదాలు పెట్టుకోవద్దు. అప్పులు తీసుకోవద్దు..ఇవ్వొద్దు. వాహనం నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు విడిపోయే అవకాశం ఉంది. నూతన ఆస్తులు కొనుగోలు చేస్తారు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ రోజు చాలా ఫలవంతమైన రోజు. శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. పాత స్నేహితులను కలుస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదం నుంచి బయటపడతారు. గత తప్పుల నుంచి పాఠం నేర్చుకుని ముందడుగు వేయడం మంచిది.
కన్యా రాశి
కన్యా రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేస్తే..అవి మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యాపార కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. తల్లిదండ్రుల సహకారం మీకు ఉంటుంది.
తులా రాశి
ఈ రాశివారు ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు బంధువుల నుంచి కొన్ని నిరుత్సాహకరమైన వార్తలు వినొచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని బాధపడతారు. ఇన్నాళ్లూ మీరు ఏదైనా దాచినట్టైతే..అది ఈ రోజు కుటుంబ సభ్యుల ముందు బయటపడుతుంది.
Also Read: మేషం, కన్యా, కుంభం, మీనం సహా ఈ 7 రాశులవారికి జూలై నెలంతా దశ తిరిగిపోతుంది!
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యాపార ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఒకరి సూచనపై ఎలాంటి పనులు చేపట్టొద్దు. జీవిత భాగస్వామిపై మీకున్న అనవసర కోపం తగ్గుతుంది. భవిష్యత్ కోసం పెట్టుబడులు తెలివిగా ప్లాన్ చేసుకోవాలి. మీ స్నేహితుడి మాట మిమ్మల్ని బాధపెడుతుంది.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. నూతన వెంచర్ ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది. గతంలో తీసుకున్న అప్పులు చెల్లించాల్సి ఉంటుంది. మీ పిల్లల కెరీర్ కి సంబంధించిన నిర్ణయాలను తెలివిగా తీసుకోండి. జీవిత భాగస్వామితో చర్చించి మంచి నిర్ణయాలు తీసుకోండి.
మకర రాశి
ఈరోజు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పిల్లల చదువుపై పూర్తి శ్రద్ధ వహిస్తారు. భవిష్యత్ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. చాలాకాల నుంచి ఏదైనా పని పెండింగ్ లో ఉంటే ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు. రాజకీయాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి.
Also Read: ఆషాఢ అమావాస్య రోజు ఈ ఒక్కటీ చేస్తే మీ కుటుంబానికి ఉన్న పితృదోషం తొలగిపోతుంది!
కుంభ రాశి
ఈ రోజు మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు...వారిని ఎక్కువగా విశ్వశించవద్దు...మీ నమ్మకాన్ని వారు నిలుపుకోలేరు. ఎవ్వరి దగ్గరా అప్పులు చేయొద్దు. ఉద్యోగులు కార్యాలయంలో తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ మాటలు, ప్రవర్తనలో సంయమనం పాటించండి.
మీన రాశి
వివాదాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు కొత్త కోర్సులపట్ల ఆసక్తి చూపిస్తారు. కార్యాలయంలో ప్రత్యర్థుల వ్యూహాలను ముందుగా అర్థం చేసుకుని ముందుకు సాగాలి. కుటుంబంలో మీ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తారు. ఆస్తుల కొనుగోలు చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.
Note:ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసోత్సవాలు ..నెలరోజుల పాటూ దుర్గమ్మ సన్నిధిలో పండుగ వాతావరణమే!