Horoscope Today 29th April 2024: రాశి ఫలాలు 29 ఏప్రిల్ 2024 - ఈ రాశివారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు!
Daily horoscope: ఏప్రిల్ 29 సోమవారం ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...
Horoscope Today 29th April 2024
మేష రాశి
ఈ రోజు మీకు శుభఫలితాలున్నాయి. వ్యాపారంలో సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. వృత్తిపరమైన విషయాలకు రోజు చాలా మంచిది. ఓ ప్రత్యకమైన పనిపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు.
వృషభ రాశి
కొత్త ప్రణాళికలు వేయడం సరికాదు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఇతరుల విషయాలపై శ్రద్ద పెట్టొద్దు. కోపం కారణంగా బంధాల మధ్య చీలిక వస్తుంది. కుటుంబ సభ్యుల అవసరాలను జాగ్రత్తగా చూసుకోండి.
Also Read: విభీషణుడు సహా ఇప్పటికీ జీవించి ఉన్న పురాణ పురుషులు వీళ్లే!
మిథున రాశి
కొత్త సమాచారం సేకరించడంపై ఆసక్తి చూపిస్తారు. ఓ గుడ్ న్యూస్ వింటారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. సామాజిక జీవితంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది.
కర్కాటక రాశి
అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేయాల్సిన పనిని ఇతరులకు అప్పగించవద్దు. వ్యక్తిగత సంబంధాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.
సింహ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు. విందు , వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అవివాహితుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన రోజు. వ్యాపారంలో లాభాలుంటాయి
Also Read: ఈ ఆలయంలో ఉండే విగ్రహాల్లో నిధులకు సంబంధించిన రహస్యాలున్నాయా!
కన్యా రాశి
పని నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీ శ్రేయోభిలాషుల సలహాలు తప్పకుండా తీసుకోండి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉండొచ్చు. ఈ రోజు ఎవ్వర్నీ అతిగా నమ్మొద్దు.
తులా రాశి
చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్త అందుకుంటారు.కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతారు. ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
షేర్ మార్కెట్‌లో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. మీరు రియల్ ఎస్టేట్ డీల్ నుంచి లాభం పొందుతారు. అనుకున్న పని ఏదైనా నెరవేరుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి సమయం.
Also Read: మే మొదటివారం ఈ రాశులవారు గుడ్ న్యూస్ వింటారు - ఏప్రిల్ 29 నుంచి మే 05 వారఫలాలు!
ధనుస్సు రాశి
అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు ఉన్నత విద్యలో రాణిస్తారు. వ్యాపారంలో రుణాలు తీసుకోవడం తగ్గిస్తే మంచిది. సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు. మీ పని పట్ల సహోద్యోగులు చాలా సంతోషంగా ఉంటారు.
మకర రాశి
వ్యాపారంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. అశాంతిని నియంత్రించండి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ సంబంధాల విషయంలో భావోద్వేగానికి లోనవుతారు
కుంభ రాశి
అనుకోని ఆదాయం చేతికందుతుంది. వైవాహిక జీవితం బావుంటుంది. విహార యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ రాశి రాజకీయ నాయకులకు మంచి రోజు.
Also Read: 'మే' నెల ఏ రాశులవారిని ముంచేస్తుంది - ఏ రాశులవారికి కలిసొస్తుంది!
మీన రాశి
ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పూర్తవుతాయి. సహోద్యోగులతో మీ ప్రవర్తన మెచ్చుకోలుగా ఉంటుంది. ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు సీరియస్ గా తీసుకోవడం మంచిది