News
News
X

మీకు ఎప్పుడైనా అనుకోకుండా 111 లేదా 11:11 కనిపించాయా? ఈ విషయం తెలుసుకోవల్సిందే!

ఒక్కో సారి యాదృచ్చికంగా మనకు కొన్ని అంకెల రిపిటిషన్ కనిపిస్తుంది. అయితే అది పూర్తిగా యదృచ్చికం కాకపోవచ్చు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు.

FOLLOW US: 
 
ఇవ్వాళ ఎక్కడైనా మీరు 111, లేదా 11:11 ఇట్లా ఏదైనా నంబర్ల సీరీస్ కనిపించిందా? కొన్ని సార్లు ఇలా నంబర్ల రిపిటీషన్ అనేది యూనివర్స్ నుంచి శక్తివంతమైన మెసెజ్ అయ్యుండొచ్చట. ఇలా నంబర్లు రిపీట్ కావడం గురించిన అవగాహన కలిగి ఉంటే జీవితం వర్తమానంలో సాగుతున్న తీరు లేదా భవిష్యత్తుకు కొత్త అర్థం తెలియవచ్చు అనేది సారాంశం. ఇలా రిపీటెడ్ గా కనిపించే నంబర్లను ఎంజిల్ నంబర్స్ అంటారు. ఇవి ఎక్కడైనా కనిపించవచ్చు . అసలు ఈ ఎంజిల్ నంబర్లు అంటే ఏమిటి ఇవి కనిపించడంలో అంతరార్థం ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.

ఎంజిల్ నంబర్లంటే?

రిపిటెడ్ గా వచ్చే నంబర్ల సీరీస్ ను ఎంజిల్ నంబర్లుగా న్యూమరాలజీ నిపుణులు నోవలీ వైల్డర్ అంటున్నారు. ఇవి యూనివర్స్ లోని సూపర్ పవర్ తో అనుసంధానించబడి ఉంటాయనేది ఈయన అభిప్రాయం. అంతేకాదు వైల్డర్ చెప్పిన దాన్ని బట్టి కేవలం నంబర్లు మాత్రమే కాదు రీపిటెడ్  గా వరుస క్రమంలో ఏది కనిపించినా అది యూనివర్స్ అందించే సందేశంగా భావించాలి. ఉదాహారణకు మూడు నల్ల పిల్లులు ఒకే వరుస క్రమంలో కనిపిస్తే అది కచ్చితంగా భవిష్యత్తు జీవితంలో జరిగే ఏదో మార్పుకు సంకేతంగా భావించాలట.

క్రీస్తూ పూర్వం 3 వేల సంవత్సరాలకు పూర్వపు పురాతన విజ్ఞానంగా చెప్పుకునే కల్డియన్ న్యూమరాలజి ప్రకారం ఈ ఎంజిల్ నంబర్ల ప్రస్తావన చాలా పురాతనమైనదిగా చెబుతున్నారు. ప్రతి సారీ యూనివర్స్ నుంచి వచ్చే సందేశమే కాకపోవచ్చు. కొన్ని సార్లు ఇది పూర్వికులు అందించే మెసేజ్ కూడా కావచ్చు. కొంత మంది ఆధ్యాత్మికవేత్తల ప్రకారం ఈనంబర్లు స్పిరిచువల్ టీమ్ నుంచి వచ్చే సందేశం కూడా కావచ్చు. మిమ్మల్ని అర్థాంతరంగా వదిలి వెళ్లిన మీ ప్రయామైన వారు మీ స్పిరిచువల్ టీమ్ లో భాగంగా ఉండి ఉండవచ్చేనేది వీరి అభిప్రాయం.

ఎక్కడ కనిపిస్తాయి?

ఈ సంఖ్యలు ప్రతి రోజూ కనిపించకపోవచ్చు. కానీ ప్రతిచోటా ఎక్కడైనా ఈ ఎంజిల్ నంబర్స్ మీకు కనిపించి ఏదైనా సందేశాన్ని మీకు అందించవచ్చు. ఉదాహరణకు వాచ్ లో కనిపించే టైం, రోడ్డు మీద కనిపించే కార్ నంబర్, లేదా ఏదైనా వస్తువు మీద వేసిన ట్యాగ్ మీద, లేదా వస్తువు ధర ఇలా దేని మీదైనా మీకు 11:11 కనిపించవచ్చు. వైల్డర్ చెప్పినట్టు ఏవైనా వస్తువులు లేదా జీవులు ఒకే లాంటివి వరుస క్రమంలో కనిపించినపుడు అది మీకు యూనివర్స్  నుంచి అందే సందేశంగా భావించాల్సి ఉంటుంది.

News Reels

111 లేదా 11:11 కనిపిస్తే..?

ఇలా వరుస క్రమంలో ఒక అంకే కనిపిస్తే అది మీకు కొత్త అవకాశాలు వస్తున్నాయనడానికి సూచన కావచ్చు. లేదా కొత్త ప్రారంభానికి సమయం కావచ్చు. లేదా కొత్తగా మీరు ఏదైనా ఆలోచన చేస్తున్నా లేక ప్లానింగ్ లో ఉన్నా అవన్ని ఫలించబోతున్నాయని అనడానికి సంకేతం కూడా కావచ్చు.

ఒక్కోసారి ఇలా 1 సీరీస్ కనిపంచడం మీ ఆలోచనల మీద దృష్టి సారించమనే సూచన కూడా కావచ్చు. మీ ఆలోచనలు, ప్రణాళికలు, ఆచరణలు భవిష్యత్తును నిర్మించేవి కనుక ఇటువంటి ఒక సందేశం మీకు యూనివర్స్ నుంచి అంది ఉండడచ్చు అనేది నిపుణుల అభిప్రాయం.

111 కనిపిస్తే ఏం చెయ్యాలి?

మీకు 1 సీరీస్ కనిపిస్తే ఆలోచనలు, ప్లానింగ్స్, కొత్త గోల్స్ వంటి వాటి గురించి శ్రద్ధ పెట్టండి. యూనివర్స్ మీకోసం కొత్త ప్లాన్స్ చేస్తుందని గుర్తించండి. మీ ప్రయోజనాల కోసం ప్రకృతి కూడా ఆలోచిస్తోందని దీని అర్థం. ఒక్కోసారి 1 నంబర్ మీరు కాస్త వేగం తగ్గించి ఒక నిమిషం ఆగి ఆలోచించమని చెప్పడానికి సంకేతం కూడా కావచ్చు. లేదా మీరు ఆధ్యాత్మిక సాధకులైతే ఒక సారి ధ్యానించి మీ ఆలోచనలను పునరేకీకరించమని కూడా సంకేతం కావచ్చు. ఏది ఏమైనా ఎంజిల్ నంబర్ కనిపిస్తే ఒకసారి దాని మీద దృష్టి సారించి జీవితంలో జరుగుతున్న, జరగనున్న మార్పులను తరచి చూసుకోవడం మంచిదనేది నిపుణుల అభిప్రాయం.

Published at : 30 Sep 2022 09:13 PM (IST) Tags: Astrology Universe angele numbers massage

సంబంధిత కథనాలు

Love Horoscope Today 10th December 2022: ఈ రాశివారికి ఈ రోజంతా మధురమే అన్నట్టుంటుంది

Love Horoscope Today 10th December 2022: ఈ రాశివారికి ఈ రోజంతా మధురమే అన్నట్టుంటుంది

Horoscope Today 10th December 2022: ఈ రాశివారి కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది, డిసెంబరు 10 రాశిఫలాలు

Horoscope Today 10th  December 2022: ఈ రాశివారి కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది, డిసెంబరు 10 రాశిఫలాలు

Christmas Celebrations 2022: ఇంటి అలంకరణ మాత్రమే కాదు క్రిస్మస్ కి ఇలా కూడా చేయొచ్చు!

Christmas Celebrations 2022: ఇంటి అలంకరణ మాత్రమే కాదు క్రిస్మస్ కి ఇలా కూడా చేయొచ్చు!

2023 Cancer Yearly Horoscope: శని ఇబ్బంది పెడితే బృహస్పతి ఉపశమనం ఇస్తాడు, 2023 లో కర్కాటక రాశిఫలాలు

2023 Cancer Yearly Horoscope:  శని ఇబ్బంది పెడితే బృహస్పతి ఉపశమనం ఇస్తాడు, 2023 లో కర్కాటక రాశిఫలాలు

Love Horoscope Today 9th December 2022:ఈ రాశివారి ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం, వివాహితుల జీవితంలో శాంతి

Love Horoscope Today 9th December 2022:ఈ రాశివారి ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం, వివాహితుల జీవితంలో శాంతి

టాప్ స్టోరీస్

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

Weather Latest Update: తీరందాటిన మాండస్ తుపాను, ఈ జిల్లాల్ని వణికిస్తున్న వానలు

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్