దసరా 2025 అక్టోబర్ 2 రాశిఫలాలు - మేషం నుంచి మీనం.. ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
Daily Horoscope in Telugu: 2025 అక్టోబర్ 02న మేషం నుంచి మీనం వరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి

2025 అక్టోబర్ 02 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu 2 October 2025
మేష రాశి
ఈ రోజున మీలో ప్రదర్శన భావన పెరగుతుంది. మీరు కోరుకోకపోయినా, కొన్ని పనులు లోక భయం వల్ల చేయవలసి రావచ్చు. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యుల సహకారం పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారవేత్తలు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోవచ్చు.
శుభ సంఖ్య: 3
రంగు: గులాబీ
పరిహారం: హనుమంతునికి సింధూరం సమర్పించండి
వృషభ రాశి
ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది..పనులలో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. సహోద్యోగుల నుంచి సహకారం తీసుకోవాలి. అకస్మాత్తుగా ప్రయాణించే ప్రణాళిక వాయిదా పడవచ్చు. ధనం పొందడానికి కొంచెం ఎక్కువ కష్టపడాలి, కాని విజయం సాధించిన తర్వాత మనస్సు సంతోషిస్తుంది. పెద్దల ఆశీర్వాదం ఉంటుంది.
శుభ సంఖ్య: 6
రంగు: తెలుపు
పరిహారం: లక్ష్మీదేవికి పాయసం సమర్పించండి.
మిథున రాశి
ఈ రోజున మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీరు ఉన్నత అధికారుల నుంచి ప్రయోజనం పొందుతారు. అదృష్టం కలిసొస్తుంది. సహోద్యోగులు మీ ఆత్మవిశ్వాసాన్ని గుర్తిస్తారు. కుటుంబంలోని మహిళల నుంచి సహకారం ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ప్రయాణాలు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
శుభ సంఖ్య: 4
రంగు: ఆకుపచ్చ
పరిహారం: గణేశునికి దూర్వ సమర్పించండి.
కర్కాటక రాశి
ధనం సంపాదిస్తారు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టవచ్చు . ఉద్యోగస్తులు అధికారుల నుంచి సహకారం పొందుతారు. కుటుంబంలో పిల్లల విజయం ఆనందాన్నిస్తుంది. మహిళలు వైవాహిక జీవితాన్ని సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తారు.
శుభ సంఖ్య: 2
రంగు: తెలుపు
పరిహారం: శివుడికి పాలతో అభిషేకం చేయండి
సింహ రాశి
పాత ఒప్పందం నుంచి ధన లాభం ఉంటుంది. కొత్త ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.. అడ్డంకులు కూడా వస్తాయి. మధ్యాహ్నం తరువాత గందరగోళం పెరగవచ్చు. అత్యాశకు గురై తప్పుడు మార్గాలను అనుసరించకుండా ఉండండి. కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది.
శుభ సంఖ్య: 9
రంగు: పసుపు
పరిహారం: విష్ణు సహస్రనామం పారాయణం చేయండి.
కన్యా రాశి
ఉదయం నిరాశ ఉంటుంది ..పనులపై మనస్సు ఉండదు. ఇల్లు మరియు కుటుంబంలో కూడా శాంతి ఉండదు. మధ్యాహ్నం తరువాత పరిస్థితి మెరుగుపడుతుంది . నిలిచిపోయిన పనులు పురోగతి సాధిస్తాయి. లాభదాయకమైన ఒప్పందాలు లభిస్తాయి. మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు, ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
శుభ సంఖ్య: 7
రంగు: నీలం
పరిహారం: దుర్గామాతకు ఎర్రటి పువ్వులు సమర్పించండి
తులా రాశి
ఈ రోజు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఉదయం శుభవార్త వింటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరినైనా సలహా అడగండి. మధ్యాహ్నం తరువాత స్వభావంలో చంచలత్వం ఉంటుంది, ఇది తీవ్రమైన పనులను ప్రభావితం చేస్తుంది. సాయంత్రానికి అకస్మాత్తుగా ధన లాభం కలిగే అవకాశం ఉంది.
శుభ సంఖ్య: 8
రంగు: ఊదా
పరిహారం: పేదలకు ఆహారం అందించండి.
వృశ్చిక రాశి
ఈ రోజు పనుల్లో విజయం సాధిస్తారు .మీ తీరు కఠినంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆదాయం , వ్యయం సమానంగా ఉంటాయి. మహిళల నుంచి ఆర్థిక సహాయం పొందుతారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
శుభ సంఖ్య: 1
రంగు: ఎరుపు
పరిహారం: నీటిలో ఎర్రటి పువ్వులు వేసి సూర్యునికి సమర్పించండి.
ధనుస్సు రాశి
ఉదయం పనుల్లో క్రమబద్ధత లాభం ఉంటుంది. సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది. మధ్యాహ్నం తరువాత పరిస్థితి మారవచ్చు .. నష్టం కలిగే అవకాశం ఉంది. ఏదైనా ఒప్పందం రద్దు కావచ్చు.
శుభ సంఖ్య: 5
రంగు: నారింజ
పరిహారం: తులసి మొక్కకు నీరు పోయండి.
మకర రాశి
రోజు ప్రారంభంలో పనిలో నిరాశ ఉంటుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో అనవసర వాదనలు ఉంటాయి. మధ్యాహ్నం తరువాత పరిస్థితి మెరుగుపడుతుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సాయంత్రం వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి.
శుభ సంఖ్య: 6
రంగు: నలుపు
పరిహారం: శని దేవాలయానికి నువ్వుల నూనె సమర్పించండి.
కుంభ రాశి
రోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో అకస్మాత్తుగా ధన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మధ్యాహ్నం లోపు ముఖ్యమైన పనులు పూర్తి చేయండి. మహిళలు లేదా తోబుట్టువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. బహిరంగంగా వివాదాస్పద విషయాలు మాట్లాడకుండా ఉండండి.
శుభ సంఖ్య: 3
రంగు: నీలం
పరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
మీన రాశి
ఈ రోజు ఆరంభంలో చేపట్టే పనిలో విజయం, ధన లాభం ఉంటుంది. ప్రియమైన వారి నుంచి శుభవార్త వింటారు. కుటుంబంలో శాంతి ఉంటుంది. మధ్యాహ్నం తరువాత ప్రతికూల పరిస్థితి ఏర్పడవచ్చు . ప్రయాణాలు, విద్యుత్ పరికరాల విషయంలో జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
శుభ సంఖ్య: 7
రంగు: ఆకుపచ్చ
పరిహారం: విష్ణువుకు తులసి ఆకులను సమర్పించండి.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















