అన్వేషించండి

Guru Purnima 2025: గురు పూర్ణిమ రోజు మీ ప్రతి సమస్యకు పరిష్కారం - మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు చేయండి!

Ashadha Purnima 2025: హిందూ ధర్మంలో వేదవ్యాసుని గౌరవిస్తూ ఆయన జన్మించిన ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకుంటారు. ఈ రోజు మీ రాశి ప్రకారం ఈ పరిహారాలు చేస్తే శుభ ఫలితాలు పొందుతారు..

Guru Purnima 2025  Remedies according to zodiac sign : ఆషాఢ మాసం పౌర్ణమి (Ashadha Purnima 2025) గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ. గురు పూర్ణిమ నాడు శిష్యులు తమ గురువులను పూజిస్తారు, గౌరవిస్తారు   కృతజ్ఞతలు తెలుపుకుంటారు.

ఏటా ఆషాఢ  పౌర్ణమి రోజున గురు పూర్ణిమ  జరుపుకుంటారు. ఈ సంవత్సరం గురు పూర్ణిమ గురువారం జూలై 10వ వచ్చింది. ఈ రోజు మీ రాశి ప్రకారం పరిహారాలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి..వెంటాడుతున్న సమస్యలు తొలగిపోతాయి.  

గురు పూర్ణిమ రోజున రాశి ప్రకారం చేయవలసిన పరిహారాలు (Guru Purnima 2025 Remedies)

మేష రాశి (Aries)

గురు పూర్ణిమ రోజున ఆలయానికి వెళ్లి శ్రీ మహా విష్ణును  పూజించండి. ఆ తర్వాత పేదలకు పసుపు రంగు దుస్తులు  లేదా పసుపు మిఠాయిలు దానం చేయండి. ఈ రోజున మీ గురువును దర్శించి వారి ఆశీర్వాదం పొందండి.

వృషభ రాశి (Taurus)

గురు పూర్ణిమ నాడు మీ గురువు, విష్ణుమూర్తి , శివుడిని పూజించండి. ఈ రోజున భగవద్గీత లేదా ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించండి. ఆ తర్వాత మీ సామర్థ్యం మేరకు పేదలకు సహాయం చేయండి.

మిథున రాశి (Gemini)

గురువు ఇచ్చిన మంత్రాలను జపించండి. గురువుకు బహుమతి ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుకోండి. శ్రీ మహావిష్ణువును పూజించండి. పూజలో భగవంతునికి అన్నం పాయసం నైవేద్యంగా సమర్పించండి.

కర్కాటక రాశి (Cancer)

ఆలయంలో లేదా పూజా మందిరంలో నెయ్యి దీపం వెలిగించి మీ గురువును తలుచుకోండి. ఈ రోజు మీరు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే విశేష ఫలితాలు పొందుతారు. గురు మంత్రాన్ని జపించండి.

సింహ రాశి (Leo)

గురు పూర్ణిమ శుభ దినాన పిల్లలకు, విద్యార్థులకు విద్యా సామగ్రిని దానం చేయండి,  పేదలకు సహాయం చేయండి.  ఏదైనా విద్యా సంస్థకు వెళ్లి కొత్తగా ఏదైనా కోర్సులు నేర్చుకునే ప్రయత్నం చేయండి.  

కన్యా రాశి (Virgo)

కన్యా రాశి వారు గురు పూర్ణిమ రోజు రాత్రి సమయంలో విష్ణువును పూజించండి. మీ గురుదేవుల వద్దకు వెళ్లి కానుకలు సమర్పించి ఆశీర్వచనం తీసుకోండి
 
తులా రాశి (Libra)

తులా రాశి వారు గురు పూర్ణిమ రోజు కుటుంబ సభ్యులు, ప్రియమైన వారితో ఆధ్యాత్మిక విషయాలపై చర్చించండి.  మతపరమైన ప్రదేశానికి వెళ్లి గురువుల ఆశీర్వాదం పొందండి.

వృశ్చిక రాశి (Scorpio)

వృశ్చిక రాశి వారు గురు మంత్రాన్ని జపించండి. పేదలకు, నిరుపేదలకు భోజనం ఏర్పాటు చేయండి, మీ గురువుల ఆశీర్వాదం తీసుకోండి , వారికి బహుమతులు సమర్పించండి

ధనుస్సు రాశి (Sagittarius)

గురు పూర్ణిమ రోజున మీరు ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లిరండి. ఇంట్లో సత్యనారాయణ కథవినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది
 
మకర రాశి (Capricorn)

మకర రాశి వారు ఈ రోజున చంద్రుడిని పూజించండి.  గురు మంత్రాన్ని జపించండి. మీరు గురు పూర్ణిమ నాడు ఆలయంలో హోమం నిర్వహిస్తే శుభ ఫలితాలు పొందుతారు. విష్ణువుని పూజించండి
 
కుంభ రాశి (Aquarius)

మీ గురువు సేవ కోసం కొంత సమయం కేటాయించండి. ఇకపై అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయండి. ఈ పరిహారంతో భవిష్యత్ లో చాలా సమస్యల నుంచి బయటపడతారు. ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది

మీన రాశి (Pisces)

ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనండి. గురువుల నుంచి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..సమస్యల నుంచి బయటపడేస్తుంది 

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget