Guru Asta 2025: జూన్ 12న మిథునంలో గురు గ్రహం అస్తమయం, ఈ 4 రాశుల వారికి నూతన ఉదయం ప్రారంభమవుతుంది!
Jupiter set in Gemini from 12th June: మే 9 నుంచి మిథున రాశిలో పరివర్తనం చెందిన గురు గ్రహం జూన్ 12న ఈ రాశిలో అస్తమిస్తుంది..ఈ ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుందంటే...

Guru Asta 2025: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి పరివర్తనంతో పాటూ అస్తమయం, ఉదయానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్రభావం కూడా అన్ని రాశులవారిపై ఉంటుంది.
దేవగురువు బృహస్పతిని అదృష్టం, సంపద, జ్ఞానం , గౌరవానికి చిహ్నంగా భావిస్తారు. గురు గ్రహం ఏడాదికి ఓ సారి రాశి మారుతుంది. కానీ ఈ ఏడాది గురుగ్రహం వేగం సాధారణం కన్నా రెట్టింపు అవుతుంది. దీంతో ఈ ఏడాదిలో రెండుసార్లు రాశి మారుతున్నాడు గురువు.
ప్రస్తుతం గురుడు మిథునంలో ఉన్నాడు. సెప్టెంబరు 28 వరకూ ఇదే రాశిలో ఉండి ఆ తర్వాత కర్కాటక రాశిలోకి మారుతాడు. జూన్ 11న గురువు పశ్చిమ దిశలో అస్తమిస్తాడు.తిరిగి జూలై 7న తూర్పున ఉదయిస్తాడు. ఈ సమయంలో మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా...
మేష రాశి
బృహస్పతి సంచారం సమయంలో మేష రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ధర్మ కార్యాలవైపు మనసు లగ్నమవుతుంది. తల్లిదండ్రులతో తీర్థయాత్రకు వెళ్ళే యోచన చేస్తారు.
వృషభ రాశి
ఈ సమయంలో అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులను నియంత్రించండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడైనా ధనం రావాల్సి వస్తే ఆలస్యం అవుతుంది
మిథున రాశి
ఈ సమయంలో సామాజిక కార్యక్రమాలు చేయడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో మీకు ఏర్పడే పరిచయాలు భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయం మీ సొంతం అవుతుంది.
కర్కాటక రాశి
మిథునంలో గురువు అస్తమయం సమయంలో ఏదైనా యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటే ప్రస్తుతానికి వాయిదా వేయడం అవసరం. చేపట్టిన పనుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
సింహ రాశి
కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యలు తగ్గుతాయి. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆదాయం పెరుగుతుంది.
కన్యా రాశి
వైవాహిక జీవితం బావుంటంది. ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు. ఎవరితోనైనా తగాదా ఉంటే సమసిపోతుంది. వ్యాపారం, ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి
తులా రాశి
ఆధ్యాత్మిక కార్యకలాపపై మీ మనసు లగ్నం అవుతుంది. అతి ఆలోచనలు, అతి విశ్వాసం ఉండకపోవడమే మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు
వృశ్చిక రాశి
ఈ రాశివారి విద్యార్థులకు సమస్యలు ఎదురైనా కానీ గురువు సహకారంతో బయటపడతారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధం హెచ్చుతగ్గులకు లోనై ఉంటుంది
ధనుస్సు రాశి
ఈ రాశి ఉద్యోగులు పనిపై దృష్టి సారించాలి. లేదంటే ఏదైనా ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. కుటుంబంలో వివాదాలుంటాయి.
మకర రాశి
జీవిత భాగస్వామితో అపార్థం కారణంగా వివాదం ఉండొచ్చు. మకర రాశివారు ఈ నాలుగు నెలలు అత్యంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కీలక నిర్ణయాలు మరోసారి ఆలోచించి తీసుకోవాలి
కుంభ రాశి
మిథునంలో గురువు అస్తమయం సమయంలో మీకు ఆర్థిక ఇబ్బందులుంటాయి. మాటతీరు మార్చుకోవాల్సిన సమయం లేదంటే వివాదాల్లో చిక్కుకుంటారు.
మీన రాశి
మిథునంలో గురువు అస్తమయం సమయంలో ఈ రాశి ఉద్యోగులు శుభ ఫలితాలు పొందుతారు. అయితే నూతన పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిది. కుటుంబంలో సమస్యలు కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కారం అవుతాయి.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















