ఫెంగ్ ష్యూయి వాస్తు ప్రకారం ఏ గది ఏ దిక్కున ఉండాలి? ధనలాభం కలగాలంటే ఎలా?
సంప్రదాయాలకు విలువనిచ్చేవారు ఇంటిరీయర్ డెకరేషన్ నుంచి ఫర్నిచర్ అమరిక వరకు అన్నింటిలో వాస్తు నియమాలను లేదా ఫెంగ్ ష్యూయి చిట్కాలను పాటిస్తుంటారు. అలాంటి మీ కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు.
దేశంలోని ఎనిమిది ముఖ్యమైన పట్టణ ప్రాంతాల్లో జరిపిన ఒక సర్వే ప్రకారం ఇళ్లు కొంటున్న వారిలో 90 శాతం మంది వాస్తు దోషాలు లేని ఇళ్లు మాత్రమే కావాలని అంటున్నారట. ఇప్పుడంతా ఫెంగ్ ష్యూయి వాస్తును పాటించేందుకు ఇష్టపడుతున్నారట. పండితులు, జ్యోతిషులు మన వాస్తుతో కలిపి ప్లాన్లు ఇస్తున్నారు. ఇంట్లో సోఫాలు, మంచాలు కూడా వాస్తు ప్రకారమే అమర్చుకుంటున్నారు. తలుపుకు ఎదురుగా బుద్ధ, విండ్ షిమ్స్ కిటికి దగ్గర కట్టుకోవడం దాదాపు అన్ని వాస్తు నియమాలకు వర్తిస్తుంది. ఇక ఇపుడు ఇంటర్నెట్ లో రకరకాల టిప్స్ అందుబాటులో ఉండనే ఉన్నాయి.
పూజగది
పూజగది అంటే ఇంట్లో ప్రార్థనా స్థలం. పవిత్రమైంది. కొంత మంది వాస్తు లేదా ఫెంగ్ ష్యూయి వంటి వాటిని విశ్వసించకపోవచ్చు. కానీ గుడి వంటి ప్రార్థనా స్థలాలను గమనించినపుడు మనకు అక్కడి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండడం కనిపిస్తుంది. అందుకు కారణం అవి వాస్తు నియమానుసారం ఉండడమే. ఇలాంటి ఎనర్జీ ఇంట్లో కావాలనుకున్నపుడు తప్పని సరిగా కొన్ని నియమాలు పాటించాలి. సాధారణంగా పూజ గది ఇంట్లో ఈశాన్యం వైపు ఉండడానికే ప్రాధాన్యతను ఇస్తారు. లేదా ఉత్తరం లేదా తూర్పు వైపు కూడా నిర్మించుకోవచ్చు. ప్రార్థించే వారి ముఖం తూర్పు వైపు ఉండాలి. దేవతా విగ్రహాలు 6 అంగుళాలను మించకూండా జాగ్రత్త పడాలి. పూజ చేసుకునే గదిలో ఎవరూ నిద్రించకూడదు. ప్రార్థనా సమయంలో తూర్పు లేదా పడమర ముఖంగా ఉండాలి. వాస్తు లో అయినా ఫెంగ్ ష్యూయిలో అయినా ఈ నియమాలు ఒకే విధంగా ఉన్నాయి.
బెడ్ రూం
మాస్టర్ బెడ్ రూమ్ ఎప్పుడైనా దక్షిణం వైపు ఉండాలి. బెడ్ రూం ఉత్తరం వైపున ఉంటే కుటుంబంలో అలజడి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. పడుకున్నపుడు తల దక్షిణం లేదా పడమర వైపు ఉండాలని నియమం. ఉత్తరం వైపు తల ఉంచి నిద్ర పోకూడదు. ఒకటి కంటే ఎక్కువ అంతస్తుల్లో ఇల్లు ఉన్నపుడు మాస్టర్ బెడ్ రూమ్ అన్నింటికంటే పై అంతస్తులో ఉండాలి. పైకప్పు సమానంగా, పగుళ్లు లేకుండా ఉండాలి. ఇది మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. పిల్లల గది వాయవ్యంలో ఉంటే మంచిది. లేదా పడమరన బావుంటుంది. పిల్లల్లో ధరాణ శక్తికి ఈ దిక్కులు మంచివి. వారి పడక గదికి దగ్గరగా చదువుకునేందుకు ప్రత్యేక స్థలం ఉండాలి. డబ్బు నగలు ఉత్తరంలో దాచి ఉంచాలి. అంటే మీరు డబ్బు తీసుకుంటున్నపుడు లేదా పెడుతున్నప్పుడు ఉత్తరం వైపు ముఖం ఉండేలా అమర్చుకోవాలి. ఇది ధన వృధ్ది స్థానం.
మరికొన్ని టిప్స్
⦿ డైనింగ్ రూమ్ పడమరకు ముఖం చేసి ఉండాలి. ఇది శని స్థానం. ఆకలికి చిహ్నం అయిన బకాసురుడి దారి ఇదే.
⦿ ఇంట్లో మొక్కలు పెంచుకోవాలని అనుకుంటే ముల్లు ఉండే కాక్టస్ లాంటివి ఇంట్లో పెంచకూడదు. అలాగే ఉత్తరం, తూర్పు వైపు గోడల మీదుగా పాకే మొక్కలు పెంచకూడదు.
⦿ ఈశాన్యం, వాయవ్యం, ఉత్తరం, పడమర దిక్కుల్లో స్టడీ రూమ్ నిర్మిస్తే మంచిది. ఇది గురు బలానికి మంచి స్థానాలు. తెలివి తేటలు పెరగడానికి దోహదం చేస్తుంది. సూర్య శక్తి లక్ష్యాల ఎంపికకు తోడ్పడుతుంది, వీనస్ క్రియేటివిటీని పెంచుతుంది.
⦿ ముఖద్వారం అంటే గేట్ తలుపులు బయటి వైపు తెరచుకోవాలి. ఇంటి లోపలికి కాదు. ఇంటి లోని ఏ తలుపు నుంచి కూడా శబ్ధాలు రాకూడదు.
⦿ బాత్రూమ్ తూర్పు లేదా వాయవ్యంలో ఉండాలి. ఈశాన్యంలో అసలు ఉండకూడదు. బాత్రూంలో తూర్పు వైపు గోడకు వాష్ బేసిన్ నిర్మించాలి. గీజర్ ఆగ్నేయంలో అమర్చుకోవాలి.
Also Read: గోడ గడియారం ఈ దిశగా ఉంటే నాశనమే, వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి!
Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!