అన్వేషించండి

సెప్టెంబరు 22 రాశిఫలాలు - ఈ రాశులవారు ఈరోజు పెద్ద సమస్యల నుంచి బయటపడతారు!

Horoscope Prediction 22 September 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 22 September 2024

మేష రాశి

ఈరోజు ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వైవాహిక సంబంధాలలో తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. కార్యాలయంలో మీపై ఉండే అంచనాలు ఎక్కువ ఉంటాయి..ఆ ఒత్తిడి మీపై ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. 

వృషభ రాశి

వ్యక్తిగత జీవితంలో సంతోషం పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. కార్యాలయంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. 

మిథున రాశి

పిల్లల పురోగతి చూసి మీరు గర్వపడతారు. ప్రతికూల ధోరణి ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. ఇతరుల నుంచి సహాయం ఆశించేటప్పుడు మీ ఆత్మగౌరవం తగ్గకుండా చూసుకోండి. అనారోగ్య సమస్యలుంటాయి..జాగ్రత్తపడండి. 

Also Read: శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలు.. దసరా ఏ రోజు వచ్చింది - ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారాలివే!

కర్కాటక రాశి

మీకు ఈ రోజు ఫ్రెష్ గా అనిపిస్తుంది. చాలా సమస్యలనుంచి ఉపశమనం పొందుతారు..వెంటాడుతున్న కొన్ని సమస్యలకు సొల్యూషన్ చూసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలు రాస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇప్పటికే అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి మీ చేతికందుతుంది.  

సింహ రాశి

నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. సృజనాత్మకంగా ఏదైనా చేయాలనే ఆలోచన ఉంటుంది. ఇతరుల సమస్యలపట్ల భావోద్వేగానికి లోనవుతారు. కుటుంబంలో వివాదాలు సర్దుమణుగుతాయి. అవసరానికి డబ్బు చేతికందుతుంది. 

కన్యా రాశి

ఈ రోజు మీరు మీ లక్ష్యాలను సాధించేందుకు ఉత్సాహం చూపిస్తారు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత పదవులు పొందుతారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. అహంకారం తగ్గించుకోవాలి..అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి.  

తులా రాశి

ఖర్చులు నియంత్రించడం చాలా అవసరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సహోద్యోగులు మిమ్మల్ని మోసం చేయవచ్చు కార్యాలయంలో మీ పనిలో అప్రమత్తంగా ఉండాలి. అనవసర చర్చల్లో పాల్గొనవద్దు. స్నేహితులను కలుస్తారు. 

Also Read: దసరాకి కాశీ వెళితే చాలు.. మొత్తం 9 మంది అమ్మవార్లను దర్శించుకోవచ్చు!

వృశ్చిక రాశి

కుటుంబ వ్యవహారాల్లో ఈ రోజు బిజీగా ఉంటారు. మీ మనసులో కోర్కె నెరవేరుతుంది. మీ జీవిత భాగస్వామి ఆలోచనలకు మీరు ప్రభావితం అవుతారు. స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. పెరుగుతున్న ఖర్చులు తగ్గించుకోవడంలో సక్సెస్ అవుతారు. 

ధనస్సు రాశి

ఈ రోజు మీరు  సన్నిహితుల నుంచి సహకారం అందుకుంటారు. విద్యార్థులు కొత్త సబ్జెక్టులరపై ఆసక్తి చూపిస్తారు. కాళ్లకు సంబంధించిన సమస్యతో ఇబ్బందిపడతారు. ఉద్యోగులు నూతన పదోన్నతికి సంబంధించి సమాచారం వింటారు. ఇతరుల భావాలను గౌరవించండి. 

మకర రాశి

మీరు వ్యాపారంలో భాగస్వామిని చేర్చుకోవడం గురించి ఆలోచిస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. సహోద్యోగితో మీకు విభేదాలుంటాయి..అనవసర చర్చలకు అవకాశం ఇవ్వొద్దు. గత అనుభవాలతో పాఠాలు నేర్చుకుని ముందుకు అడుగువేయండి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుతుంది. 

కుంభ రాశి

ఈ రోజు కొత్త పనులు చేపట్టడంలో తొందరపడకండి. సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు శుభప్రదం కాదు.  తప్పుడు సమాచారం వల్ల పనికి ఆటంకం ఏర్పడవచ్చు. కుటుంబంలోని పెద్దల సలహాలు పాటించడం మంచిది. మీ జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. 

మీన రాశి

ఈ రాశి ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహాలు పాటించడం ప్రయోజనకరగా ఉంటుంది. కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. నూతన వ్యక్తులు పరిచయం ఏర్పడతారు. ధార్మిక స్థలాల సందర్శన గురించి ఆలోచిస్తారు.  

Also Read:  దసరా సెలవులలో మీ పిల్లలకు ఇవి నేర్పించండి!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Chit Chat: కేసీఆర్‌ది అంతా అక్కసే - ఎమ్మెల్యేలకూ హెచ్చరిక - సీఎం రేవంత్ చిట్ చాట్
కేసీఆర్‌ది అంతా అక్కసే - ఎమ్మెల్యేలకూ హెచ్చరిక - సీఎం రేవంత్ చిట్ చాట్
CM Chandrababu at VIT: నా నిర్ణయాల ఫలితంగా తెలంగాణ నెంబర్ వన్ అయింది, గర్వంగా ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు
నా నిర్ణయాల ఫలితంగా తెలంగాణ నెంబర్ వన్ అయింది, గర్వంగా ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు
GVMC Mayor Election: విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక ఏకగ్రీవం, గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర
విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక ఏకగ్రీవం, గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర
KCR on HCU Lands: హెచ్‌సీయూ భూముల వివాదంపై తొలిసారి స్పందించిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
హెచ్‌సీయూ భూముల వివాదంపై తొలిసారి స్పందించిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG Captian Rishabh Pant Failures in IPL 2025 | ఆగని రిషభ్ పంత్ ఫెయిల్యూర్స్...ఓనర్ తో మళ్లీ క్లాస్Rishabh Pant Failures IPL 2025 | ఆగని రిషభ్ పంత్ ఫెయిల్యూర్స్...ఓనర్ తో మళ్లీ క్లాస్RCB 6 Away Matches Wins in Row | IPL 2025 లో సరికొత్త చరిత్రను సృష్టించి ఆర్సీబీKrunal Pandya 73 runs vs DC IPL 2025 | కుప్పకూలిపోతున్న RCB ని కొహ్లీ తో కలిసి నిలబెట్టేసిన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Chit Chat: కేసీఆర్‌ది అంతా అక్కసే - ఎమ్మెల్యేలకూ హెచ్చరిక - సీఎం రేవంత్ చిట్ చాట్
కేసీఆర్‌ది అంతా అక్కసే - ఎమ్మెల్యేలకూ హెచ్చరిక - సీఎం రేవంత్ చిట్ చాట్
CM Chandrababu at VIT: నా నిర్ణయాల ఫలితంగా తెలంగాణ నెంబర్ వన్ అయింది, గర్వంగా ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు
నా నిర్ణయాల ఫలితంగా తెలంగాణ నెంబర్ వన్ అయింది, గర్వంగా ఉందన్న ఏపీ సీఎం చంద్రబాబు
GVMC Mayor Election: విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక ఏకగ్రీవం, గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర
విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక ఏకగ్రీవం, గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర
KCR on HCU Lands: హెచ్‌సీయూ భూముల వివాదంపై తొలిసారి స్పందించిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
హెచ్‌సీయూ భూముల వివాదంపై తొలిసారి స్పందించిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
Pak Gets C130 Support: యుద్ధ భయంతో టర్కీ సాయం కోరిన పాక్, ఆయుధాలతో ఇస్లామాబాద్ చేరిన సీ130 మిలటరీ విమానం
యుద్ధ భయంతో టర్కీ సాయం కోరిన పాక్, ఆయుధాలతో ఇస్లామాబాద్ చేరిన సీ130 మిలటరీ విమానం
Vishwak Sen: మొన్ననే 30 వచ్చాయ్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా.. - 'హిట్ 3' వేడుకలో మాస్ కా దాస్ విశ్వక్ క్లారిటీ
మొన్ననే 30 వచ్చాయ్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశా.. - 'హిట్ 3' వేడుకలో మాస్ కా దాస్ విశ్వక్ క్లారిటీ
PM Modi AP Tour: అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
అమరావతిలో ప్రధాని రోడ్ షో రద్దు.. మోదీ పర్యటన లో స్వల్ప మార్పులు
India Bans Pakistans YouTube: మరోసారి భారత్ కన్నెర్ర, పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
మరోసారి భారత్ కన్నెర్ర, పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
Embed widget