Astrology : మిథునం, కర్కాటకం, మీనం సహా ఈ రాశులవారికి భావోద్వేగాలు ఎక్కువ - ఎదుటివారి కష్టాలు చూసి ఇట్టే కరిగిపోతారు!
Zodiac Signs: కొందరు చిన్న అసౌకర్యం కలిగిందంటే చాలు కన్నీళ్లు పెట్టేసుకుంటారు..ఎదుటివారి కష్టాలు విని కరిగిపోతారు. బయటకు కనిపించని సున్నితత్వం వీళ్లలో ఉంటుంది..ఈ లిస్టులో ఈ ఆరు రాశులవారున్నారు...
Astrology: పుట్టిన తేదీ, సమయం, ప్రదేశం ఆధారంగా జాతకచక్రం వేసి వారి భవిష్యత్ ఎలా ఉంటుందో నిర్ణయిస్తారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అయితే ఓ వ్యక్తుల్లో కామన్ క్వాలిటీస్ గురించి చెప్పాలంటే రాశులను ఆధారంగా చేసుకుంటారు. ప్రతి రాశివారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి.. వాటిలో మంచి , చెడు రెండూ ఉంటాయి. కొన్ని క్వాలిటీస్ మాత్రం కామన్ గా ఉంటాయి. కొందరు చిన్న సంఘటనకే డీలా పడిపోతారు, ఎదుటివారి బాధలు విని అవి తమకే వచ్చినంతగా బాధపడిపోతారు. ఈ లక్షణం చాలా సందర్భాల్లో వారికి మంచిచేసినా కొన్ని సమయాల్లో కోలుకోలేని నష్టాన్ని మిగుల్చుతుంది. మరి ఎక్కువగా భావోద్వేగానికి లోనయ్యే రాశులేంటి ఇక్కడ తెలుసుకోండి...
మిథున రాశి (Gemini)
మిథున రాశివారు తమ భావాలను అదుపులో ఉంచుకోలేరు. పరిణితితో వ్యవహరించాల్సిన ఆవశ్యకతను అర్థం చేసుకోవడంలో విఫలం అవుతారు. నమ్మినవారికి తమ సమస్యలు ఏకరువు పెట్టేసుకుంటారు. అదే సమయంలో వారికి చిన్న సమస్య వచ్చినా అదికూడా తమదే అనేంతలా ఫీలవుతారు...ఆ కష్టం నుంచి వాళ్లు గట్టెక్కేవరకూ వీళ్లే ఎక్కువగా ఆలోచించేస్తుంంటారు. ఈ రాశివారిలో కనిపించని సున్నితత్వం వీరికి చాలా సందర్భాల్లో మంచి కన్నా చెడే ఎక్కున చేస్తుంది...అందుకే భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని ఆలోచనాత్మకంగా అడుగువేయాలి...
Also Read: ఈ రాశివారికి రహస్య శాస్త్రాల అధ్యయనంపై ఆసక్తి పెరుగుతుంది , మేషం to మీనం జూన్ 06 రాశిఫలితాలు!
కర్కాటక రాశి ( Cancer)
కర్కాటక రాశివారిలో భావోద్వేగాలు బయటకు కనిపించవు కానీ చాలా ఎక్కువ. వీరి మనస్తత్వం ఎవ్వరి ఊహకు అందదు. బంధం,స్నేహం, ప్రేమ ఏ విషయంలో అయినా వీరి ఆలోచన చాలా లోతుగా ఉంటుంది. బయటకు ఏమీ పట్టనట్టు కనిపిస్తారు కానీ ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తారు. సందర్భం వచ్చినప్పుడు మాత్రం తమ భావాలను , భావోద్వేగాలను వ్యక్తం చేయడంలో అస్సలు సంకోచించరు. ఇదే వీరి బలం,బలహీనత కూడా.
కన్యా రాశి ( Virgo)
కన్యా రాశివారు ఎదుటివారి కష్టాలు వింటే చాలు...ఆ ప్లేస్ లో తమని తాము ఊహించేసుకుంటారు. అవన్నీ తమకే వచ్చినట్టు భావించి పరిష్కారం అయ్యేవరకూ ఎక్కువగా ఆలోచించేస్తుంటారు. అందరిలో కలిసినట్టే ఉంటారు కానీ తమలో ఉండే భావోద్వేగాలను తొందరగా ఎదుటివారితో పంచుకునేందుకు ఆసక్తి చూపరు. ఎంత పరిణితి చెందినట్టు కనిపిస్తారో...కొన్ని సందర్భాల్లో అంతే చిన్నవిషయానికి కన్నీళ్లు పెట్టేసుకుంటారు... ఆ తర్వాత మళ్లీ స్ట్రాంగ్ గా మారిపోతారు...
తులా రాశి (Libra)
తులా రాశివారిలో భావోద్వేగాలు చాలా ఎక్కువ. ప్రతి చిన్న విషయాన్ని మనసుకి తీసేసుకుంటారు...అది వ్యక్తిగతం అయినా, ఎదుటివారి బాధ అయినా. అందుకే ఓ నిర్ణయానికి రావడానికి చాలా కష్టపడతారు. తీసుకునే నిర్ణయాలు సరైనవా కావా అని ఆలోచించరు..తమ భావోద్వేగాలకు అనుగుణంగా ముందుకెళ్లిపోతారు. అనిశ్చితి ఉన్న రాశుల్లో తులా రాశివారిదే టాప్ ప్లేస్.
కుంభ రాశి (Aquarius)
కుంభ రాశివారు పెద్ద పెద్ద అరుపులు వింటే తట్టుకోలేరు. ఈ రాశివారు అధిక భావోద్వేగానికి లోనైనప్పుడు బిగ్గరగా ఏడ్చేస్తారు. వాస్తవానికి ఈ రాశివారు అంతర్ముఖులు..ఎవ్వరితోనూ అంత తొందరగా కలవలేరు కానీ ఒక్కసారి కనెక్ట్ అయితే ఎప్పటికీ విడిచిపెట్టరు. అలాంటి వ్యక్తుల విషయంలో తమకు కలిగిన అసౌకర్యం కన్నా వారికి చిన్న సమస్య వచ్చినా కూడా వీళ్లు భావోద్వేగానికి లోనైపోతారు.
Also Read: ఈ రాశులవారికి అసూయ చాలా ఎక్కువ - ఎదుటివారి సక్సెస్ ను అస్సలు భరించలేరు!
మీన రాశి (Pisces)
ఈ రాశివారిది చాలా సున్నితమైన మనస్తత్వం. ఇతరుల విషయంలో చాలా దయతో ప్రవర్తిస్తారు. కుటుంబం సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు. అయితే ఈ రాశివారి ఆలోచన ఎదుటివారికి అంతుపట్టదు...ఏ విషయంలోనూ డైలమాలో ఉండరు..తమవారికి అండగా నిలవాల్సిన సమయం వచ్చినప్పుడు అయితే పూర్తిగా ముంచేస్తారు లేదంటే అడ్డంగా ఎదురెళతారు... వీరి ప్రవర్తన ఎప్పుడెలా ఉంటుందో ఊహించలేరు..
మిగిలిన రాశులైన మేషం, వృషభం, సింహం, వృశ్చికం, ధనుస్సు , మకరం వారిలో పెద్దగా భావోద్వేగాలండవు...అందుకే జీవితంలో ప్రతి అడుగులోనూ స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి...
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.