అన్వేషించండి

Weekly Horoscope : మేషం to మీనం ఈ వారం మీ రాశిఫలాలు!

Dussehra Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

వార ఫలాలు:  11-11-2024 నుంచి 17-11-2024 వరకు

మేష రాశి

ఈ వారం మేష రాశివారికి శుభ ఫలితాలున్నాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గడిచిన వారం కన్నా మెరుగుపడుతుంది. టైమ్ ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగం, వ్యాపారంలో కొన్ని ససమ్యలున్నా కానీ వాటిని అధిగమిస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. రాజకీయాల్లో ఉండేవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారాంతంలో పని ఒత్తిడి పెరుగుతుంది. 

వృషభ రాశి

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. శత్రువుల సంఖ్య తగ్గుతుంది. వ్యాపారంలో ఉండేవారు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఉద్యోగం, కళారంగంలో ఉండేవారు శుభవార్తలు వింటారు. చేయాలనుకున్న పనులు వాయిదా వేయవద్దు. వారం చివర్లో అధిక ధన వ్యయం ఉంటుంది. రాజకీయాల్లో ఉండేవారికి పదవీయోగం ఉంది. కీలకనిర్ణయాలు తీసుకునేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. 

మిథున రాశి

ఈ వారం మీరు మెరుగైన ఫలితాలు పొందుతారు. ఎప్పటి నుంచో వస్తుంది అనుకున్న సొమ్ము చేతికందుతుంది. చేపట్టిన పనుల్లో సక్సెస్ అవుతారు. ఉద్యోగం, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కళారంగంలో ఉండేవారు మంచి అవకాశాలు పొందుతారు. వారం మొదట్లో వివాదాల్లో చిక్కుకుంటారు..వారాంతంలో ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. 

Also Read: శని సంచారంతో ఈ రాశులవారికి ఆర్థిక, మానసిక సమస్యలు - మరి పరిష్కారం ఏంటి!

కర్కాటక రాశి

ఈ వారం మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఆస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. కళారంగంలో ఉండేవారు మంచి ఫలితాలు సాధిస్తారు. స్నేహితుల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.  

సింహ రాశి

మీపై మీరు నమ్మకంతో అడుగువేయండి..చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి సహకారం అందుతుంది.  
ఉద్యోగులు పదోన్నతికి సంబంధించిన సమచారం వింటారు. వ్యాపారంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆకస్మిక ధనలాభం సూచనలున్నాయి. 
 
కన్యా రాశి

ఈ వారం కన్యారాశివారికి మంచి ఫలితాలున్నాయి. ఎప్పటి నుంచో వేసుకున్న ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు శుభవార్త వింటారు..నిరుద్యోగులు సౌకర్యవంతమైన ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.  

తులా రాశి

ఈ వారం ఈ రాశివారు మంచి ఫలితాలు పొందుతారు. అవసరానికి డబ్బు చేతికందుతుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో అడుగు ముందుకు పడుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇల్లు, వాహనం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. రాజకీయాల్లో ఉండేవారికి సమయం కలిసొస్తుంది. 

వృశ్చిక రాశి

అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం లాభిస్తుంది. ఆలోచనల్లో ప్రతికూలతకు అవకాశం ఇవ్వొద్దు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ప్రత్యర్థులపై మీరు పైచేయి సాధిస్తారు. వ్యాపారంలో లాభాలుంటాయి.  నూతన వాహనం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. అనుకోని ఖర్చులుంటాయి.

Also Read: శని తిరోగమనం - ఈ 3 రాశులవారికి శని వదిలిపోతుంది .. రెండున్నరేళ్లు వీళ్లకు కష్టాలే కష్టాలు!

ధనస్సు రాశి
 
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు.  ఆస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు

మకర రాశి

ఈ వారం మకర రాశివారికి అదృష్టం కలిసొస్తుంది. ఆత్మవిశ్వాసంతో అడుగువేస్తే అనుకున్న పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. ఆర్థిక సంబంధిత విషయాల్లో తొందరపడొద్దు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. మీ చుట్టూ ఉండేవారిలో మీకు సమస్యలు సృష్టించేవారున్నారు జాగ్రత్త. 
 
కుంభ రాశి

గడిచిన వారంలో ఉండే వివాదాలు ఈ వారం సర్దుకుంటాయి...వివాదాలు మీ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతాయని గుర్తిస్తారు. ముఖ్యమైన పనులన్నీ పూర్తిచేస్తారు. బాధ్యతల నుంచి పారిపోవద్దు. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులుంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి. 

Also Read: శుక్రుడి సంచారం కారణంగా ఈ రాశులవారికి అనారోగ్యం, అధిక ఖర్చులు, అన్నింటా అడ్డంకులు!

మీన రాశి

ఈ వారం నూతన పరిచయాలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆలయాలు సందర్శించేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగంలో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. ప్లాన్ ప్రకారం పనులన్నీ పూర్తిచేస్తార. వారం మధ్యలో అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఆస్తుల సంబంధిత విషయాల్లో తొందరపాటు వద్దు.. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget