అక్టోబరు 08 రాశిఫలాలు - ఈ రాశుల ఉద్యోగులు, నిరుద్యోగులకు ఈ రోజు మంచి రోజు!
Horoscope Prediction 8th October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Daily Horoscope for 8th October 2024
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు అనవసర రిస్క్ చేయొద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అవసరమైన సమయంలో స్నేహితులు, సన్నిహితుల నుంచి సహకారం తీసుకోవడం ఉత్తమం. మీరు చేపట్టే పని విషయంలో స్పష్టత ఉండాలి.
వృషభ రాశి
వృషభ రాశివారు ఈ రోజు సవాళ్లు స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారు. మీ లక్ష్యాలు నెరవేర్చేందుకు అడుగు ముందుకు వేయండి. ఉద్యోగులు పని విషయంలో శ్రద్ధ వహించండి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఈ రోజు మంచిరోజు. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు తీసుకుంటారు.
మిథున రాశి
అనుకున్న పనులు పూర్తిచేయడంలో ఈ రోజు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. మీ ప్రాధాన్యతలపై దృష్టి పెట్టాలి. మీ లక్ష్యాలు నిర్ధేశించుకుని వాటిని సాధించే దిశగా అడుగు ముందుకు వేయాలి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం సాధారణంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది
Also Read: దాండియా నృత్యాలతో కలర్ ఫుల్‌గా సాగే గుజరాతీ దసరా "గర్బా"
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి వ్యాపార పరంగా ఈరోజు మంచి రోజు. ఆదాయ వనరులను పెంచుకోవడంపై పూర్తి శ్రద్ధ చూపుతారు. కుటుంబంలో అనవసర చర్చలకు అవకాశం ఇవ్వొద్దు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. ఉద్యోగులు కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోండి. త్వరలో మంచి అవకాశాలు మిమ్మల్ని పలకరించబోతున్నాయ్.
సింహ రాశి
సింహ రాశి వారికి దీర్ఘకాలంగా ఉన్న సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. బాధ్యతలను నెరవేర్చడంలో వెనక్కు తగ్గరు. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లిస్తారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాట తూలకండి. వ్యాపారంలో చేసే మార్పులు చేర్పులు భవిష్యత్ లో మీకు మంచి చేస్తాయి. మీ పురోగతికి అడ్డంకులు తొలగిపోతాయి.
కన్యా రాశి
కన్యారాశివారికి ఈ రోజు పితృ ఆస్తులకు సంబంధించి మంచి రోజు కానుంది. మీరు అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి. గత తప్పులు కొన్ని బహిర్గతం కావచ్చు. కుటుంబంలోని ఏ ఒక్కరి కెరీర్ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. మీరు మీ పనితో సంతోషంగా ఉంటారు. మీ కోరికలపై నియంత్రణను కొనసాగించండి:
తులా రాశి
తుల రాశి వారికి ఈ రోజు సంతోషకరమైన రోజు. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ జీవితంలో కొంత గందరగోళం కారణంగా ఇబ్బంది పడతారు. మీ ప్రవర్తన మరియు స్వభావంలో మార్పులను తీసుకురండి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వృత్తి, కుటుంబం , భాగస్వామ్య విషయాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం.
వృశ్చిక రాశి
ఈ రోజు వృశ్చిక రాశి వారు ఒకే సమయంలో చాలా పనులు ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్యానికి సంబంధించి నిర్లక్ష్యంగా ఉండొద్దు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య సరిహద్దు ఏర్పరుచుకోవడం మంచిదకి. కొన్నిసార్లు మీ నిర్ణయాలు ఇతరులను బాధపెట్టినా కానీ ఏది ఉత్తమమో గుర్తించి అడుగువేయండి. స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీపై ఉంటుంది.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారు ఈ రోజు అనారోగ్య సమస్యల గురించి ఆందోళన చెందుతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ మనసులో అసూయ, ద్వేషం భావాలుంటాయి. వ్యాపారంలో నూతన ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధంగా ఉంటారు. మీ పిల్లలు మీ అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు. మీ బాధ్యతల నుంచి తప్పుకుపోవద్దు. ఓర్పుతో వ్యవహరించండి
మకర రాశి
ఈ రాశివారికి ఈ రోజు శుభసమయం. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం, ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. వివాదాలకు దూరంగా ఉండడ మంచిది. చేపట్టిన పనులు ఆలస్యం అవుతాయి. పిల్లల వైపునుంచి శుభవార్తలు వింటారు
కుంభ రాశి
కుంభ రాశి వారికి గడిచిన రోజుకన్నా ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. చట్టపరమైన అంశాలకు సంబంధించిన వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు చేపట్టే పనులకు సంపూర్ణ సహకారం ఉంటుంది. ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. స్నేహితులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. ఈ సామర్థ్యాన్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు.
మీన రాశి
మీన రాశివారు భవిష్యత్ గురించి ప్లాన్ చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించడంపై పూర్తి ఉత్సాహంతో ఉంటారు. వాహనం లేదా స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన ఫలిస్తుంది. అవసరానికి డబ్బులు చేతికందుతాయి.
Also Read: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.