ZPTC MPTC Election Counting: ముగిసిన కౌంటింగ్.. వైసీపీ విజయ దుందుభి.. జిల్లాల వారీగా ఇలా..
తెలుగు దేశం పార్టీకి కంచు కోటలుగా ఉన్న ప్రాంతాల్లోనూ వైఎస్ఆర్ సీపీ జెండానే ఎగిరింది. ఈ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండడంతో తన అభ్యర్థులను పోటీలో నిలపలేదు.
ఆంధ్రప్రదేశ్ జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ క్లీన్ స్వీప్ చేసింది. అన్ని జిల్లాల్లోనూ దాదాపు అన్ని స్థానాలను వైఎస్ఆర్ సీపీనే కైవసం చేసుకుంది. తెలుగు దేశం పార్టీకి కంచు కోటలుగా ఉన్న కుప్పం, నిమ్మకూరు సహా అన్ని ప్రాంతాల్లోనూ వైఎస్ఆర్ సీపీ జెండానే ఎగిరింది. ఈ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండడంతో తన అభ్యర్థులను పోటీలో నిలపలేదు. కానీ కొన్ని స్థానిక నేతల అండతో టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. జడ్పీటీసీ ఫలితాల్లో వైసీపీ ఏకపక్షంగా నిలిచింది.
మొత్తం 6,985 ఎంపీటీసీ, 441 జడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ ముగిసింది. కానీ, ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఎన్నికల కౌంటింగ్‌కు అర్ధరాత్రి పట్టొచ్చని పంచాయతీ రాజ్ కమిషనర్ తెలిపారు. కాగా మొత్తం 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ కారణాల రీత్యా ఎన్నికల ప్రక్రియ 375 స్థానాల్లో నిలిచిపోయింది. పోటీ చేసిన వారిలో 81 మంది అభ్యర్థులు కరోనా సహా ఇతర కారణాలతో మరణించారు. మిగిలిన 7,220 ఎంపీటీసీ స్థానాలకుగాను 18,782 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఏప్రిల్ 8న ఈ స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టు తీర్పుతో కొవిడ్ జాగ్రత్తలతో 13 జిల్లాల్లో 209 కేంద్రాల్లో ఓట్లను లెక్కించారు.
శ్రీకాకుళం: జడ్పీటీసీ-38, ఎంపీటీసీ-667
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-37, టీడీపీ-0, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-562, టీడీపీ-76, బీజేపీ-2, ఇతరులు-10
విజయనగరం: జడ్పీటీసీ-34, ఎంపీటీసీ-549
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-34, టీడీపీ-0, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-445, టీడీపీ-85, బీజేపీ-2, ఇతరులు-10
విశాఖపట్నం: జడ్పీటీసీ-39, ఎంపీటీసీ-651
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-35, టీడీపీ-1, ఇతరులు-1
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-452, టీడీపీ-114, బీజేపీ-5, ఇతరులు-32
తూర్పు గోదావరి: జడ్పీటీసీ-61, ఎంపీటీసీ-1086
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-48, టీడీపీ-1, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-644, టీడీపీ-46, బీజేపీ-30, ఇతరులు-8
పశ్చిమ గోదావరి: జడ్పీటీసీ-48, ఎంపీటీసీ-863
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-30, టీడీపీ-0, ఇతరులు-2
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-582, టీడీపీ-69, బీజేపీ-3, ఇతరులు-50
కృష్ణా: జడ్పీటీసీ-46, ఎంపీటీసీ-723
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-41, టీడీపీ-2, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-630, టీడీపీ-64, బీజేపీ-11, ఇతరులు-6
గుంటూరు: జడ్పీటీసీ-54, ఎంపీటీసీ-805
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-53, టీడీపీ-0, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-704, టీడీపీ-62, బీజేపీ-0, ఇతరులు-23
ప్రకాశం: జడ్పీటీసీ-55, ఎంపీటీసీ-742
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-55, టీడీపీ-0, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-649, టీడీపీ-62, బీజేపీ-3, ఇతరులు-13
కర్నూలు: జడ్పీటీసీ-53, ఎంపీటీసీ-796
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-52, టీడీపీ-0, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-672, టీడీపీ-99, బీజేపీ-5, ఇతరులు-14
కడప: జడ్పీటీసీ-50, ఎంపీటీసీ-858
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-49, టీడీపీ-1, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-520, టీడీపీ-16, బీజేపీ-8, ఇతరులు-5
నెల్లూరు: జడ్పీటీసీ-46, ఎంపీటీసీ-554
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-46, టీడీపీ-0, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-494, టీడీపీ-33, బీజేపీ-2, ఇతరులు-18
చిత్తూరు: జడ్పీటీసీ-65, ఎంపీటీసీ-841
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-63, టీడీపీ-0, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-817, టీడీపీ-37, బీజేపీ-0, ఇతరులు-6
అనంతపురం: జడ్పీటీసీ-63, ఎంపీటీసీ-804
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-61, టీడీపీ-1, ఇతరులు-1
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-742, టీడీపీ-47, బీజేపీ-1, ఇతరులు-14