Nara Lokesh 2000KM : ఒక్క అడుగుతో ప్రారంభమై 2 వేల కిలోమీటర్లకు - యువగళం పాదయాత్రలో మరో మైలురాయి !
యువగళం పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని నారా లోకేష్ ఆవిష్కరించారు.

Nara Lokesh 2000KM : తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తయింది. నెల్లూరు జిల్లాలో శిలాఫలకాన్ని నారాలోకేష్ ఆవిష్కరించారు. జనవరిలో ప్రారంభమైన పాదయాత్ర నిరాటకంగా సాగుతోంది. పండుగ రోజులు.. ఓ కుటుంబ కార్యక్రమం.. మరో సారి ఎన్నికల నిబంధనల పేరుతో అడ్డుకున్న సందర్భం తప్ప… లోకేష్ తనకు అనారోగ్యమని.. లేకపోతే మరో వ్యక్తిగత కారణంతో కానీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. కాళ్లకు బొబ్బలెక్కినా నిరంతరాయంగా నడుస్తూనే ఉన్నారు [
I complete 2000 Kms of #YuvaGalamPadayatra today. More than just the distance covered, this is a journey that embodies the dreams and aspirations of the youth of Andhra Pradesh. Thank you to all who've joined me, together we'll rebuild our state. Onward to the next milestone!… pic.twitter.com/VDsjwYZwmy
— Lokesh Nara (@naralokesh) July 11, 2023
బ్రేక్ లేకుండా పాదయత్ర
అసలు ఒక్క రోజు విరామం ఇద్దామనే ఆలోచనే రానీయడం లేదు. పైగా రోజంతా లోకేష్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. తెల్లవారు జాము నుంచి అర్థరాత్రి వరకూ ఆయన ప్రజలు , పార్టీ క్యాడర్ మధ్యే ఉంటున్నారు. రోజూ వందల మందికి సెల్ఫీలు ఇస్తున్నారు. తనతో కలిసి నడిచేందుకు వస్తున్నవారందరితో మాట్లాడుతున్నారు. ఉదయం.. మధ్యాహ్నం… సాయంత్రం ఇలా ప్రతి సందర్భంలోనూ ఆయనచుట్టూ వందల మంది ఉంటున్నారు. అయినా ఎక్కడా చిన్న రిమార్క్ లేకుండా చిరునవ్వుతోనే ఉంటున్నారు. ప్రజల మధ్య ఉండటం తనకు ఇష్టమని చేతలతో చూపిస్తున్నారు. అదే సమయంలో తన పాదయాత్ర లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఆయన విభిన్న వర్గాలతో సమావేశం అవుతున్నారు. వారికి భరోసా ఇస్తున్నారు. ఎవరికైనా సాయం అవసరం అనుకుంటే తక్షణం చేస్తున్నారు.
లోకేష్ పట్టుదలకు టీడీపీ క్యాడర్ ఫిదా
పాదయాత్రకు రాను రాను ఆదరణ పెరుగుతోందని టీడీప నేతలంటున్నారు. మొదట కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైన తర్వాత చిత్తూరు జిల్లాలో పాదయాత్రకు జనం లేరంటూ చెప్పడానికి ప్రత్యర్థులు ప్రయత్నించారు కానీ ఇప్పుడు ఆ సాహసం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ లోకేష్ వెంట నడిచేవారిలో పది వేల మంది కంటే తక్కువ ఎక్కడా ఉండటం లేదు. నిజానికి లోకేష్ సీఎం అభ్యర్థి కాదు.. ఓ పార్టీ అధ్యక్షుడు కాదు.. ఏ ప్రత్యేకమైన పదవిలో లేరు. కానీ పార్టీ కోసం పని చేసిన ఇమేజ్ ఆయనకు ఇలా అటెన్షన్ తీసుకొచ్చింది. పట్టుదలతో తన ఇమేజ్ మేకోవర్ చేసుకోవడంలో లోకేష్ అద్భుతమైన పురోగతి సాధించారని టీడీపీ క్యాడర్ సంతోషపడుతోంది. చివరికి లక్ష్యం చేరగలడని అందరిలోనూ నమ్మకం కలిగించారని అంటున్నారు.
అభినందిస్తున్న పార్టీ నేతలు , సానుభూతిపరులు
లోకేష్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తయింది. మరో రెండు వేల కిలోమీటర్ల దూరం సాగనుంది. నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని నారా లోకేష్ పెట్టుకున్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ యాత్ర సాగనుంది. రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా పలువురు సోషల్ మీడియాలో నారా లోకేష్ ను అభినందించారు.
Congratulations on completing 2000Kms! I'm proud to see you championing the youth and lending an ear to the concerns of the people of our state. Youth are our future, and the TDP shall realise their immense potential by providing them with better opportunities for growth. Good… https://t.co/b3oKMXDO93 pic.twitter.com/DjTHUolp8K
— N Chandrababu Naidu (@ncbn) July 11, 2023
This is truly an impressive accomplishment, @naralokesh Anna. Having known you since childhood, I am not surprised by this at all. Your dedication is truly extraordinary. Covering a distance of 2000 kilometers is simply astounding. May you be blessed with increased strength and… https://t.co/XVBauY5420
— Rohith Nara (@IamRohithNara) July 11, 2023
Congratulations @NaraLokesh, on completing an incredible 2000-kilometer walk with #YuvaGalamPadayatra. May your determination pave the way for a brighter future. Keep shining! https://t.co/VlKUTz947k
— Chalasani Aswani Dutt (@AshwiniDuttCh) July 11, 2023
నిజంగా నేను మీరు 200 కిలోమీటర్లు కూడా పాదయాత్ర చేయరు అనుకున్నా ఏదో ఒక సాపు చెప్పి ఆపేస్తారని ఊహించుకున్న. కానీ నేను అనుకున్నది తప్పు . చాలా ఆనందం ఇచ్చింది మీరు 2000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేయడం , నాకు మీ పార్టీతో సంబంధం లేదు కానీ మీరంటే అభిమానం… https://t.co/3dVCUJxcbG
— BANDLA GANESH. (@ganeshbandla) July 11, 2023



















