Nagarjuna Yadav: వైసీపీ అధికార ప్రతినిధి అరెస్ట్ - విజయవాడ వస్తుండగా అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు
Andhrapradesh News: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను కుప్పం పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఓ కేసు విషయంలో భాగంగా ఆయన్ను కుప్పం పీఎస్‌కు తరలించారు.
Ysrcp State Spokesperson Arrested: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను (Nagarjuna Yadav) ఆదివారం అర్ధరాత్రి కుప్పం పోలీసులు (Kuppam Police) అరెస్ట్ చేశారు. ఓ టీవీ ఛానెల్ చర్చలో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు ఆయనపై కుప్పం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే టీడీపీ నేత కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. బెంగుళూరు నుంచి విజయవాడ వస్తుండగా ఆదివారం రాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వివిధ అంశాలపై అతన్ని విచారించారు. నాగార్జున యాదవ్‌కు 41ఏ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, గత కొద్ది రోజులుగా నాగార్జున యాదవ్ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.